Latest Updates
-
పెయిన్ కిల్లర్స్ వద్దు.. సోంపు టీ ముద్దు!.. నెలసరి నొప్పులకు చెక్ పెట్టే అద్భుత ఔషధం! -
వేడి వేడి అన్నంలోకి మజ్జిగ పులుసు బోండా..కంచాలు కంచాలు లాగించేయడం గ్యారెంటీ! -
ఎండాకాలంలో పొట్టకు చల్లగా..జస్ట్ 5 నిమిషాల్లో సూపర్ టేస్టీ పెరుగన్నం తాలింపు..ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లిలో డ్యాన్స్ ఎంట్రీలు.. ఇది ఆత్మవిశ్వాసమా లేక సంప్రదాయానికి అవమానమా? సోషల్ మీడియాలో మొదలైన పెద్ద యుద్ధం ఇదే! -
వేసవిలో ఒంటికి చలువ చేసే కమ్మని దోసకాయ శాండ్ విచ్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
భర్తను కత్తితో పొడిచిన భార్య… జైలు శిక్షను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు వెనుక అసలు ట్విస్ట్ ఇదే! -
హై కాల్షియం, జీరో షుగర్.. పవర్ ప్యాక్డ్ రాగి స్మూతీ ఎలా చేసుకోవాలంటే.. -
కన్నడ చిత్రసీమలో మరో తీవ్ర విషాదం..గుండెపోటుతో ప్రముఖ నటుడు దిలీప్ రాజ్ కన్నుమూత -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణీలు ఈ చిన్న పొరపాట్లు చేస్తే తల్లీబిడ్డలకు ప్రమాదమా? -
80 శాతం రోగాలకు మందులు అక్కర్లేదు.. ఈ 4 అలవాట్లు మార్చుకుంటే చాలు!
ఋణం ఇచ్చేముందు మీ స్నేహితుడిని అడగవలసిన ప్రశ్నలు
డబ్బు అప్పుగా ఇచ్చేప్పుడు చాలా ప్రశ్నలు అడగవలసి ఉంటుంది. మీ స్నేహితుడికి ఆర్ధిక సహాయం అవసరమైనప్పుడు మీరు ఏమి ఆలోచించకుండా డబ్బు ఇవ్వటానికి సిద్ధపడతారు. మీ వొద్ద అదనంగా డబ్బు ఉన్నప్పుడు ఇవ్వటంలో తప్పు లేదు. సహాయపడాలి కూడా! కాని కొన్ని సమయాల్లో డబ్బు అప్పుగా ఇవ్వటం కూడా కొన్ని సమస్యలకు దారి తీస్తున్నది. ఇటువంటివి నివారించటానికి ఇక్కడ మీరు మీ స్నేహితుడికి డబ్బు అప్పు ఇచ్చేముందు అడగవలసిన ఏడు ప్రశ్నలను ఇస్తున్నాము. చూడండి.
1. డబ్బు ఏ కారణం కొరకు తీసుకుంటున్నారు?
డబ్బు అప్పుగా ఇచ్చే ముందు అడగవలసిన ముఖ్యమైన ప్రశ్నలలో ఒకటి - ఎందుకు డబ్బు తీసుకుంటున్నారు? ఈ ప్రశ్నను అడగటానికి మీరేమి బిడియపడనవసరంలేదు. మిమ్మలిని ధైర్యంగా డబ్బు అప్పు అడగటానికి అవతలి వ్యక్తి సిద్ధపడినప్పుడు, అదే వ్యక్తి మీరడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పటానికి సిద్ధపడిఉండాలి. అంతేకాక, మీరు డబ్బు అప్పుగా ఇస్తున్నప్పుడు, ఆ డబ్బును ఎలా ఉపయోగిస్తున్నారో తెలుసుకునే హక్కు మీకు ఉన్నది.

2.మీ స్నేహితుడు డబ్బు విషయంలో చెడ్డపేరు కలిగి ఉన్నాడా?
మీరు డబ్బు అప్పుగా ఇవ్వటానికి నిర్ణయించుకున్నప్పుడు, ఆ వ్యక్తి యొక్క ఆర్థికపరమైన అలవాట్లను కూడా పరిగణలోకి తీసుకోవాలి. తీసుకున్న డబ్బుకు అతనే బాధ్యత వహిస్తాడా? ఇతనికి డబ్బు అప్పు తీసుకుని, వాటిని తిరిగి చెల్లించే అలవాటు లేదా? మీరు కష్టపడి సంపాదించిన డబ్బును అప్పుగా ఇస్తున్నప్పుడు, ఆ వ్యక్తి యొక్క ఆర్థికపరమైన అలవాట్లు మీరు ఇవ్వాలా/వొద్దా అని నిర్ణయం తీసుకోవటానికి సహాయపడతాయి.
3.మీ స్నేహితుడు గతంలో మీకు సహాయం చేశాడా?
మీరు మీ స్నేహితుడికి డబ్బు అప్పుగా ఇవ్వాలి అని అనుకున్నప్పుడు, అతను గతంలో ఏమైనా సహాయం చేశాడా - అది ఆర్థికంగా కాని లేదా వేరే విధంగా కాని. కొన్నిసార్లు ఇంకొక వ్యక్తిని డబ్బు అడగటానికి ఇది చాలా బలాన్ని మరియు డబ్బుసహాయం అడగటానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఈ వ్యక్తి తీసుకున్న డబ్బును చెప్పినరీతిలో తిరిగి ఇస్తుంటే, అప్పుడు డబ్బు అప్పుగా ఇవ్వటంలో తప్పు లేదు.
4. మీ వొద్ద డబ్బు ఉన్నదా?
రోజు ఆఖరులో మీ దగ్గర ఏమి లేకపోతే, మీరు ఏమి అప్పుగా ఇవ్వలేరు. కాబట్టి, మిమ్మలిని ఎవరైనా డబ్బు అప్పుగా అడిగితే వెంటనే సమాదానమివ్వకండి. ఒక్కసారి మీ ప్రస్తుత ఆర్ధికస్థితిని చూసుకోండి మరియు మీరు డబ్బు ఇవ్వగాలరో/లేదో నిర్ణయించుకోండి. మీరు చెల్లించవలసిన బిల్లులు, ఇంటి అద్దె/ తనఖా, కారుకు కట్టవలసిన డబ్బు,ప్రయోజనాల కొరకు చెల్లించవలసిన డబ్బు లేదా ఇతర ఖర్చులు వంటివి ఉన్నప్పుడు ఆదర్శానికి పోయి డబ్బు అప్పు ఇవ్వవొద్దు.
5. మీరు డబ్బు పోగొట్టుకోవాలని అనుకుంటున్నారా?
ఒకవేళ మీ స్నేహితుడు మంచి ఉద్దేశాలు ఉన్నవాడైనా, ఆ వ్యక్తి డబ్బు తిరిగి ఇవ్వకపోవటానికి ఎప్పుడూ ఒక ఛాన్స్ ఉంటుంది. కాబట్టి, మీరు ఆ డబ్బును వొదులుకోవటానికి కూడా సిద్ధపడాలి. మీకు ఆర్థికంగా సహాయం చేయాలని ఉన్నా, మీకు చెల్లించవలసిన బిల్లులు ఉన్నప్పుడు, అది మంచి ఆలోచన కాదు. మీరు చెల్లించవలసిన అద్దె డబ్బులో కొంత మీ స్నేహితురాలికి అప్పు ఇచ్చినా, ఆమె మీకు అద్దె చెల్లించవలసిన సమయంలోపు మీకు ఇవ్వకపోవొచ్చు.
6. స్నేహబంధం ఎంతవరకు ముఖ్యం?
మీ స్నేహితుడు డబ్బు తిరిగి ఇవ్వకపోవటానికి ఎప్పుడు ఒక చాన్స్ కలిగి ఉంటే, మీరు ఆ స్నేహబంధం యొక్క విలువ గురించి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. స్నేహం మరియు డబ్బు ఎప్పుడూ కలవవని నా గట్టి నమ్మకం. అందువలన, మీరు మీ దగ్గర సన్నిహితులను సన్నిహితంగానే ఉంచండి, కాని మీ ఇద్దరి సమీకరణంలో డబ్బు ప్రస్తావననే తేవొద్దు. మీరు పెద్ద మొత్తంలో డబ్బును మీ స్నేహితుడికి అప్పు ఇచ్చినప్పుడు మరియు ఆటను/ఆమె ఆ డబ్బు తిరిగి ఇవ్వనప్పుడు, మీ స్నేహబంధం ఆ అప్పుతో సన్నిహితంగా ఉండదు.
7. మీరు వ్రాతపూర్వక ఒప్పందం కలిగి ఉన్నారా?
మీరు మీ స్నేహితుడికి డబ్బు ఋణంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నప్పుడు, ఒక వ్రాతపూర్వక ఒప్పందం కుదుర్చుకోండి. ఆ ఒప్పందంలో ఋణవివరాలు అంటే ఋణమొత్తం, వడ్డీ రేట్లు మరియు ఋణ చెల్లింపు నిబంధనలు వంటివి బహిర్గతపరచాలి. ఈ వ్రాతపూర్వక ఒప్పందంలో ఋణమొత్తానికి సంబంధించి ఏ గందరగోళం లేదా అపార్థాలకు తావివ్వకుండా చూసుకోవాలి.



Click it and Unblock the Notifications