Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
సోషల్ మీడియాలో మీ ఫ్రైవసీని కాపాడుకోవడం ఎలా
ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా లేకపోతే ఒక్కసారిగా మొత్తం స్తంభించిపోతుందన్న విషయం వాస్తవమే. అయినప్పటికీ, అదే సోషల్ మీడియా వల్ల లేనిపోని సమస్యలు, ప్రమాధాలు చుట్టుముడుతున్నాయి. ఈ క్రమంలో ఫేస్ బుక్, ట్విట్టర్, మైస్పేప్ లాంటి నెట్ వర్కింగ్ వెబ్ సైట్లు వాడే విషయంలో మీ ప్రైవసీని కాపాడుకోవడానికి, మీ వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూసే అధికారం వేరొకరికి ఇవ్వకుండా ఉండడానికి ఈ జాగ్రత్తలు పాటించండి...

1. ఫేస్ బుక్ లో మనకు సంబంధంలేని వ్యక్తులు కూడా అనేక మంది ఫ్రెండ్ రిక్వెస్టులు పంపిస్తుంటారు. వారి గురించి పూర్తిగా చెక్ చేసిగానీ మన లిస్టులో యాడ్ చేసుకోకూడదు.
2. కొంత మంది ఫ్రెండ్స్ లిస్ట్ నెంబర్ పెంచుకోవడానికి ఎవర్ని పడితే అవారిని యాడ్ చేసుకుంటుంటారు. ఎప్పుడైతే అలా యాడ్ చేసుకుంటామో మన ప్రైవసీకి మనమే భంగం కలిగించుకుంటున్నామని గుర్తుంచుకోండి.
3. అలాగే మన ఫోటో అల్బమ్ కూడా కొంత మంది కావాల్సిన ఫ్రెండ్స్ కు మాత్రమే షేర్ చేస్తే మంచిది.
4. మీ వ్యక్తిగత సమాచారం, ఫోన్ నెంబర్లు బాగా నమ్మకస్తులైన వ్యక్తులకు, స్నేహితులకు పర్సనల్ గా ఫోన్ చేసి మాత్రమే ఇవ్వండి..అంతే గానీ, ఛాట్ బాక్స్ లో గానీ, ఇతర సోషల్ మీడియా మాధ్యమం ద్వారా గానీ ఎక్స్ ఛేంజ్ చేసుకోవద్దు.
5. అలాగే, మీ ఫేస్ బుక్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ లో మీ ఫోన్ నెంబర్లు గానీ, ఇంటి అడ్రస్ వివరాలుగానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు.
6. ఎవరైనా అపరిచితులు వ్యక్తిగతంగా మీకు మెయిల్స్ పంపి, స్నేహం చేయడానికి ఆసక్తి చూపిస్తే, మీ విచక్షణను బట్టి నిర్ణయం తీసుకోండి. అంతేగానీ, పర్సనల్ సమాచాం ఇచ్చి రిస్క్ లో పడకండి.
7. కొంత మంది ఒక ప్రత్యేకమైన అప్లికేషన్ల ద్వారా ఆన్ లైన్ గేమ్స్ ఆడటానికి మీకు రిక్వెస్టులు పంపుతారు. మీరు ఆసక్తి ఉండి, వారితో పరిచయం పెంచుకోవాలనుకుంటే, అది గేమ్ వరకూ పరిమితం చేయండి. అంతే గానీ, మీ పర్సనల్ ఆల్బమ్స్, నోట్స్ కు వారికి యాక్సెస్ ఇవ్వద్దు.
8. మీకు ఎవరిమీదైనా అనుమానం కలిగినా, నమ్మకం లేకపోయినా, లేకపోతే వారు మీకు అంత ప్రాధాన్యం ఉన్న వ్యక్తిగా అనిపించకపోయినా, వెంటనే మీ ఫ్రెండ్ లిస్ట్ లోంచి డెలీట్ చేయండి. ఇలా చేయడం వల్ల నష్టమేమీ ఉండదు.
9. మీ మెయిల్ కు అసందర్భంగా ఎవరెవరో అపరిచితులు పదే పదే మెయిల్స్ పంపిస్తుంటే, ఆ మెయిల్ ఐడిని సాధ్యమైనంత వరకూ మార్చేయడమే మంచిది.
10. అన్నింటికన్నా మరో ముఖ్యమైన విషయం మీ ఫేస్ బుల్, ఇ-మెయిల్ పాస్ వర్డ్ ని ఎవరికీ బహిర్గతం చేయకూడదు.
11. ఎవరైనా మిమ్మల్ని టార్గెట్ చేసి, మిమ్మల్ని వేఢించడానికి సోషల్ మీడియాను ఒక వాహకంగా ఉపయోగించుకుంటున్నారని మీరు భావిస్తే, వెంటనే ఈ విషయాన్ని ఆలస్యం చేయకుండా పోలీసులకు తెలియజేయండి. ఇటువంటి కేసులను పరిష్కరించడం కోసం ప్రత్యేకంగా సైబర్ పోలీస్ విభాగం పనిచేస్తోంది.



Click it and Unblock the Notifications