Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
కాబోయే భర్తలో అమ్మాయిలు ఎక్స్ పెక్ట్ చేసే హ్యాబిట్స్ ?
పెళ్లి అనేది జీవితంలో చాలా ముఖ్యమైనది. పెళ్లి చేసుకున్న వ్యక్తితో జీవితాంతం కలిసి ఉండాల్సి ఉంటుంది, కొత్త లైఫ్ పంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పెళ్లి విషయంలో తీసుకునే ఏ నిర్ణయమైనా.. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే అబ్బాయిని ఎంపిక చేసుకునేటప్పుడు అమ్మాయిలు, అమ్మాయిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు అబ్బాయిలు చాలా కేర్ తీసుకుంటారు.. తీసుకోవాలి కూడా. అప్పుడే మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది.
READ MORE: వివాహం తర్వాత భర్త భార్య నుండి నేర్చుకోవలసిన 10 విషయాలు
అయితే ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవచ్చు.. పెళ్లి చేసుకుంటే బాగా చూసుకుంటాడు అని నమ్మకం కుదరాలి. అలా నమ్మకం కుదరాలి అంటే.. ఆ అబ్బాయిలో కొన్ని క్వాలిటీస్ ఉండాలి. పెళ్లి చేసుకున్నందుకు హ్యాపీగా ఉన్నాను అని అమ్మాయికి నమ్మకం కలిగించే హ్యాబిట్స్ ఉండాలి. అలా తనకు చాలా ప్రేమగా చూసుకునే భర్త దొరికాడు అనడానికి ఉండాల్సిన లక్షణాలేంటో ఇప్పుడు చూద్దాం..

మీకు ముద్దు పెట్టి రోజుని ప్రారంభిస్తాడు
ప్రతి రోజుని కొత్తగా ప్రారంభిస్తాడు. అతను ప్రతిరోజూ మీకు ముద్దుతో గుడ్ మార్నింగ్ చెప్పి డేని స్టార్ట్ చేస్తాడు. అతను ఎప్పుడూ ఒకేలాగా, స్థిరంగా ఉంటారని చెప్పడానికి ఇదో బెస్ట్ క్వాలిటీ. ఈ రకంగా రోజుని ప్రారంభించడం వల్ల మీకు చాలా మంచి మూడ్ వస్తుంది. కాబట్టి ఇలాంటి క్వాలిటీ ఉన్న వ్యక్తి మీకు భర్త అయితే మీరు చాలా హ్యాపీగా ఉంటారు.

మాట్లాడటం కంటే వింటారు
ఎలాంటి రోజైనా, ఎంత బిజీగా ఉన్నా, రోజంతా అలసిపోయినా, హ్యాపీగా ఉన్నా, లేకపోయినా.. అతను మీ రోజు ఎలా గడిచిందనే విషయాన్ని వినడానికి రెడీగా ఉంటాడు. మీరు చెప్పే ప్రతి విషయాన్ని చాలా ఓపిగ్గా వింటాడు. తర్వాతే మీకు కావాల్సిన సలహాలు, నిర్ణయాలు చెబుతారు.

వంట చేస్తాడు
రాత్రిపూట అలసిపోయినప్పుడు చాలామంది ఫుడ్ ఆర్డర్ చేస్తారు. కానీ మీ భాగస్వామి చాలా డిఫరెంట్ గా ఆలోచించే వాళ్లు అయితే.. బయట ఫుడ్ కంటే.. సింపుల్ గా ఏదైనా తనే స్వయంగా ఫ్యామిలీ కోసం వంట చేస్తాడు.

హగ్
రోజు గడిచిన తర్వాత మీరు రిలాక్స్ గా టీవీ చూస్తున్నప్పుడు మిమ్మల్ని చాలా ప్రేమగా గట్టిగా కౌగిలించుకుంటాడు. అతను మిమ్మల్ని హగ్ చేసుకోవడమే కాకుండా.. అప్పుడప్పుడు కిస్ చేస్తాడు, అలాగే కొన్ని సందర్భాల్లో మీ పాదాలకు మసాజ్ కూడా చేస్తాడు.

మిమ్మల్ని సంతోషపెడతారు
మిమ్మల్ని ఎప్పుడు సంతోషపెట్టాలని చూస్తాడు. రొమాంటిక్ గా ఉంటారు. మీ మూడ్ చేంజ్ అయినప్పుడు.. రొమాంటిక్ గా మిమ్మల్ని బుజ్జగిస్తాడు. సినిమా థియేటర్ లో, పార్క్ లో ఎక్కడైనా మీతో రొమాన్స్ చేయడానికి సంకోచించడు. ఎప్పుడూ మీతో చాలా సరదాగా, హ్యాపీగా ఉంటాడు.

మీ స్నేహితులు, ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తాడు
మ్యారేజ్ అనేది లాంగ్ లైఫ్ ఉండేది. వైవాహిక జీవితంలో ప్రతి ఒక్కరూ ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి. అప్పుడే మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ ని, ఫ్యామిలీని బాగా ఇష్టపడతారు, అర్థం చేసుకుంటాడు. మీ పేరెంట్స్ ని డ్రాప్ చేయడం, పిక్ అప్ చేసుకోవడం వంటివి ఇష్టంగా చేస్తారు.

చిన్న పిల్లలను ఇష్టపడతారు
చిన్న పిల్లలతో ఆడుకోవడాన్ని ఇష్టపడతాడు. పిల్లలతో హైడ్ అండ్ సీక్ ఆడటం, వాళ్లను జాగ్రత్తగా చూసుకోవడం, స్టోరీస్ చెప్పడం చేస్తూ.. చిన్నారులతో చాలా సరదాగా ఎంజాయ్ చేయడాన్ని ఇష్టపడతారు.

ఆర్థికంగా బాధ్యత
అతను ఏ జాబ్ చేస్తున్నాడు అన్నది మ్యాటర్ కాదు. అతను ఫైనాన్షియల్ గా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. బాధ్యతగా నడుకుంటారు. బిల్లులన్నీ టైంకి పే చేయడం, ఫ్యూచర్ ప్లాన్స్ చేసుకోవడం వంటి అతని బాధ్యతను వివరిస్తాయి.

మిమ్మల్ని గుర్తిస్తాడు
ఎక్కడున్నా.. ఎంతమందిలో ఉన్నా మిమ్మల్ని చాలా ప్రేమగా చూస్తాడు. చుట్టూ ఎంతమంది ఉన్నా.. అతని చూపులు మాత్రం మీ వైపే ఉంటాయి. చాలా అందంగా కనిపిస్తున్నావ్ అంటూ.. కాంప్లిమెంట్స్ ఇస్తాడు. తనకు మీరే ప్రపంచం అన్న ఫీలింగ్ మీకు కలిగిస్తాడు.

తన గురించి కేర్ తీసుకుంటాడు
తన గురించి తాను కేర్ తీసుకుంటాడు. కనీసం వారానికి 5 సార్లైనా వ్యాయామం చేస్తాడు. రన్నింగ్, క్లైంబింగ్, జిమ్ ఇలా ఏదో ఒక ఎక్సర్ సైజ్ చేస్తాడు. ఎప్పుడు మంచి సువాసనతో ఉంటాడు. అలాగే డ్రెస్సింగ్ బాగా మెయింటెయిన్ చేస్తాడు. అలాగే తన శారీరక, మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటాడు.



Click it and Unblock the Notifications
