Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
డబ్బు, ఉద్యోగం ఉన్నా ప్రశాంతంగా ఉండలేకపోతున్నారా ?
మానసిక శాంతి. దీని కోసం చాలా మంది చాలా రకాలుగా వెతుకుతూ ఉంటారు. డబ్బు, స్నేహితులు, ఉద్యోగం, కుటుంబం ద్వారా ప్రశాంతత పొందడానికి ట్రై చేస్తుంటారు. మానసిక ప్రశాంతత బయట ఉండే అంశాల ద్వారా పొందలేం.. కానీ ఆలోచనల్లో మార్పుల ద్వారా అది సాధ్యమవుతుంది.
మానసిక ప్రశాంతత పొందడానికి ఎవరూ సహాయపడలేరు.. ఎందుకంటే మిమ్మల్ని మీరు బెస్ట్ గా మార్చుకున్నప్పుడే అది సాధ్యం. ఈ బిజీ ప్రపంచంలో మనుషుల అవసరాలు తీర్చుకోవడానికి డబ్బు పొందాలనుకుంటారు. చుట్టూ ఉన్న అంశాలు ఎలాంటి ప్రోత్బలం ఇచ్చినా, మారాలని టెంప్ట్ చేసినా.. ముందు మిమ్మల్ని మీరు నమ్మాలి. నిజమైన సంతోషం ఎక్కడ పొందుగలుగుతారో.. అనలైజ్ చేసుకోవడానికి సమయం ఇవ్వాలి. అంతరాత్మ ఏం చెబుతుందో వినండి.. దాన్నే ఫాలో అవ్వండి.
READ MORE: నిద్రలో వచ్చే కలలు.. రియాలిటీకి దగ్గరగా ఉంటాయా ?
మానసిక ప్రశాంతత నిదానంగా పొందగలగాలి అంతేకానీ.. కొనలేనిది. మానసిక ప్రశాంతత తప్ప అన్నీ పొందగలిగామని చాలామంది చెబుతూ ఉంటారు. దీన్ని బట్టి ఫైనాన్షియల్ స్టేటస్ మీద ప్రశాంతత ఆధారపడి ఉండదని తెలుస్తోంది. కాబట్టి డబ్బుకి, ప్రశాంతతకి సంబంధం లేదు. సో మానసిక ప్రశాంతత ఈజీగా పొందడానికి ఇక్కడ కొన్ని ఈజీ టిప్స్ మీ కోసం..

సింపుల్ గా ఉండటం
సింపుల్‌గా ఉండటం వల్ల ఎలాంటి హాని కలుగదు.. అలాగే కాంప్లికేటెడ్‌గా ఉండటం వల్ల ఏం లాభముండదు. సింపుల్ గా జీవించడానికి, చుట్టు ఉన్నవాటిని సింపుల్ గా మార్చుకోవడానికి దేవుడు మనకి అవకాశమిచ్చాడు. సింప్లిసిటీతో జీవిస్తే మానసిక ప్రశాంతత ఈజీగా పొందవచ్చు. గాసిప్స్, లెవెల్ చూపించడం, మీకంటే హైలెవెల్ లో ఉన్న వారినే స్నేహితులను చేసుకోవాలనుకోవడం వల్ల ప్రశాంతత కోల్పోతారు.

ప్రస్తుతం గురించి ఆలోచించడం
గతం గురించి వదిలేయాలి.. భవిష్యత్ ని అంచనావేయలేం. కాబట్టి భవిష్యత్ గురించి అనవసరంగా ఆలోచించి ఎనర్జీ కోల్పోకుండా ఉండాలి. గతం గురించి, భవిష్యత్ గురించి ఆలోచించడం మానేయడం వల్ల ప్రస్తుతం ప్రశాంతంగా, సంతోషంగా గడపవచ్చు.

కృతజ్ఙతా భావం
మానసిక ప్రశాంత పొందడానికి ఇదొక మార్గం. జీవితంలో పొందే ప్రతి చిన్న విషయానికి కృతజ్ఙత తెలపాలి. శ్వాస పొందడం నుంచి అన్ని బ్లెస్సింగ్సే అని నమ్మాలి. మీ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దిన ప్రతి ఒక్కరిపైనా కృతజ్ఙతా భావం కలిగి ఉండాలి.

మార్పులకు సిద్ధంగా మైండ్
సమయానికి తగ్గట్టు అభిప్రాయాలు మార్చుకునేలా మైండ్ ని అలర్ట్ చేయాలి. మీరు భావించినదే నిజమవ్వాలని లేదు.. అది తప్పు అని భావిస్తే అభిప్రాయం మార్చుకునేలా మైండ్ ని ప్రిపేర్ చేయాలి.

చీకటి తర్వాత వెలుగు తప్పనిసరి
బాధ, ఇబ్బందికర పరిస్థితులు ఎల్లకాలం అలానే ఉండవు. కాలం గడిచే కొద్ది కొత్త విషయాలు వస్తాయి. ఇబ్బందికర పరిస్థితులను ఎంజాయ్ చేయడం వల్ల మీరు మరింత స్ర్టాంగ్ అవుతారు. అంతేకాదు దీనివల్ల జీవితాన్ని మరింత బాగా అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల మరింత కాన్ఫిడెన్స్ పొందవచ్చు. చింతలు, బాధలు, పెయిన్ వచ్చినప్పుడు స్ట్రాంగ్‌గా ఉండాలి.

అహాన్ని అణగతొక్కాలి
మానసిక ప్రశాంతత కోల్పోవడానికి ప్రధాన కారణం అహం. కాబట్టి ఇగోని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. అంత ప్రశాంతంగా ఉండగలుగుతారు.

చుట్టు ఉన్నవాటిని మార్చుకోవాలి
మీ గదిలోకి ఫ్రెష్ గాలి వచ్చేలా సెట్ చేసుకోవాలి. అలాగే సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. దీనివల్ల రిలాక్స్‌గా, హ్యాపీగా అనిపిస్తుంది. మానసిక ప్రశాంతత చుట్టూ ఉన్న అంశాల ద్వారా కూడా పొందవచ్చు. వస్తువులను శుభ్రం చేయడం, వాటిని చక్కగా సర్దుకోవడం వల్ల కాస్త రిలాక్స్ గా అనిపిస్తుంది. ఈ విధంగా మానసిక ప్రశాంతత పొందవచ్చు.



Click it and Unblock the Notifications