Latest Updates
-
డెలులు డేటింగ్ అంటే ఏంటీ?..డేటింగ్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్న కొత్త ట్రెండ్ ఇదే! -
బ్రెడ్ లేకుండానే బ్రెడ్ పకోడీ..టీ టైమ్లో దీని మజాయే వేరు..జస్ట్ 10 నిమిషాల్లో ఎలా చేసుకోవాలంటే.. -
అచ్చం బేకరీ రుచితో.. ఇంట్లోనే శాండ్ విచ్ చేసుకోండిలా..పైన కరకరలాడుతూ, లోపల మెత్తగా.. -
డెహ్రాడూన్ స్పెషల్ మటన్ భుట్వా..నెక్స్ట్ లెవల్ టేస్ట్! -
పప్పు నానబెట్టే పనే లేదు..మిగిలిపోయిన బ్రెడ్ తో 15 నిమిషాల్లో కరకరలాడే వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
April 2026 Festivals: హనుమాన్ జయంతి నుండి అక్షయ తృతీయ వరకు..ఏప్రిల్ నెల పండుగల పూర్తి జాబితా! -
ముంబై స్పెషల్ బటాటా పోహా.. ఉదయం పూట నోరూరించే, కడుపు నింపే అద్భుతమైన బ్రేక్ ఫాస్ట్! -
ఈరోజు రాశి ఫలాలు (28.03.26): శనివారం నాడు మీ అదృష్టం ఎలా ఉండబోతోంది? -
అచ్చం హోటల్ స్టైల్ సాంబార్ కావాలా? అయితే ఈ మసాలాను ఇంట్లోనే చేసుకోండి! -
వంటగదిలో చెమటోడ్చే పనే లేదు.. ఈ ఎండల్లో స్టవ్ వెలిగించకుండా చేసే 4 అద్భుతమైన వంటలివే!
ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన 10 ప్రదేశాలు..
మీకు దయ్యాలంటే భయంలేదా? అర్ధరాత్రులు ఒంటరిగా బయటకు వెళ్ళగలరా? కొందరు సాహసవంతులు,ధైర్యులు ఉంటారు కాదనను. మరికొందరు ఇతరులు ఏమనుకుంటారో అని భయపడుతూనే నటిస్తుంటారు. ఒకవేళ ఆ భయం ఉంటే నిర్భయంగా చెప్పేయండి. ఎందుకంటే ఇక్కడ భయానకమైన ప్రదేశాలు, ఒళ్ళు గగుర్పాటు పొడిచే స్థలాలు,భవనాలు ఉన్నాయి. అక్కడికి ఎంత ధైర్యంమున్న వాళ్లైనా సరే వెళ్ళడానికి భయభయంతో వణికిపోతున్నారు. అలాంటి కొన్ని ప్రదేశాలను మీకందిస్తున్నాం భయపడకుండా చూడండి.

హశీమా ఐలాండ్, జపాన్:
దక్షిణ జపాన్ లో నాగసాకి పట్టణానికి 15 కి.మీ దూరంలో 505 గదులతో ఒక అపార్ట్ మెంట్ ఉంది. ఇందులో గదులన్నీ, పై భాగం సగం కాంక్రీట్ తో కప్పబడి ఉన్నాయి. చుట్టూ సముద్రం మధ్యలో ఉన్న ఈ అపార్ట్ మెంట్ చూస్తూనే భయంతో వణికిపోతున్నారు.
Image Courtesy

విల్లార్డ్ ఆశ్రమం, న్యూ యార్క్:
దీర్ఘకాలిక పిచ్చితో బాధపడే వాళ్ళను ఈ ఆశ్రమంలో ఉంచుతారు. న్యూ యార్క్ లోని విల్లార్డ్ పట్టణ సమీపంలోగల సెనికా సరస్సు ఒడ్డున ఈ ఆశ్రమం ఉంది. 1995లో ఈ ఆశ్రమం లోకి 400 మంది రోగులను తీసుకువచ్చారు. వారి దగ్గర ఉన్న 400 సూట్ కేసులు ఆశ్రమం అటకపై ఉన్నట్లు కొన్ని సంవత్సరాల తర్వాత బయటపడింది.
Image Courtesy

ఎల్ హోటల్ డెల్ సాల్టో,కొలంబియా:
1950లో 18 అంతస్థుల భవనాన్ని నిర్మించాలని, ఉన్న భవనాన్ని పునర్మించాలని భావించారు కొలంబియాకు చెందిన ఎల్ హోటల్ డెల్ సాల్టో హోటల్ యజమానులు. గాబ్రియా లగ్రాచా ప్లానింగ్ సిద్ధం చేయగా, డొమినికో పార్మా భవన నిర్మాణం చేయడానికి సన్నద్దమయ్యాడు. అయితే ఇప్పటికి 20 ఏళ్ళు గడచినా ఆ హోటల్ నిర్మాణం మాత్రం ఇంకా పూర్తి కాలేదు. అక్కడ నది ప్రవహిస్తుండం వలెనే ఆ నిర్మాణం మధ్యలోనే ఆగిపోయినట్లు కొందరు చెబుతున్నారు.
Image Courtesy

ఓకిగహర-జపాన్:
"ఆత్మహత్యల అడవి". 2002-78, 2003-105,2010-57. ఇదేదో లిస్టు కాదు జపాన్ లోని ఓకిగహర అడవిలో దొరికిన శవాల సంఖ్య. ఈ ప్రాంతంలోకి వెళ్ళగానే ఆత్మహత్య చేసుకోవాలనిపించేలా ఉంటుందట. అందుకే ఇక్కడ ఎక్కువ సూసైడ్ చేసుకోవడానికి సిద్దపడుతుంటుంటారట. ఇక్కడ మరణించినవారు ఎక్కువగా జపనీస్ మరియు ఇంగ్లీష్ వారే ఉన్నారు. 2001లో డ్రగ్స్ కు బానిసలైనవారు ఇక్కడ సూసైడ్ చేసుకున్నారట. అయితే ఇక్కడ సూసైడ్ కు పాల్పడిన వాళ్ళలో కొన్ని శవాలు మాత్రమే బయటపడ్డాయి.
Image Courtesy

క్రాకో, ఇటలీ:
చూడటానికి సుందరమైన నగరం. పేరు మాత్రం దయ్యాల పట్టణంగా, దయ్యాల కోటగా పిలవబడుతోంది. ఇటలీలోని క్రాకో ప్రాంతంలో సంభవించిన సహజ విపత్తుల కారణంగా 1892 నుండి 1922 మధ్య కాలంలో సుమారు 1300 మంది అక్కడి ఉత్తర అమెరికాకు వలస వెళ్లారు. 1963లో మళ్ళీ అక్కడ పంట పొలాలను సిద్ధం చేయడానికి వారు ముందుకు రాగా, ఆ పంట భూమి సహకరించలేదు. 1972లో వరదలు రావడం, ఆహార సమస్యల కారణంగా 1980 నుండి ఆ ప్రాంతాన్ని వదిలి పూర్తిగా వెళ్లిపోయారు.
Image Courtesy

ఓవర్టౌన్ బ్రిడ్జి:
ఒకవైపు నుండి 50 అడుగుల లోతులో ఉన్న బ్రిడ్జిఫై నుండి పెద్దగా కేకలు వేస్తూ కుక్కలు దూకుతుంటాయి.ఆ నీటి ప్రవాహం నుండి బయటపడ్డ కుక్కలు మళ్ళీ గట్టు మీదికి చేరి ఒకటే సైడు నుండి దూకటం మొదలుపెడతాయి. ఈదలేని కొన్ని కుక్కలు చాలా వరకూ అందులో మరణించాయి. ముందుగా పారపెట్ అనేది ఈ బ్రిడ్జి పేరు. అయితే కుక్కలు ఇందులో దూకి చనిపోతుండడంతో ఆ పేరును ఓవర్ టౌన్ బ్రిడ్జిగా మార్చబడింది. మీడియా కథనాలతో ఇక్కడికి వెళ్ళడానికి సాహసిస్తున్నారు.
Image Courtesy

ఓచిమిల్కో, మెక్సికో:
బొమ్మల్లో కూడా ప్రాణం ఉంటుందని, అవి కూడా మనషులలాగే జీవించగలవని నమ్మే వ్యక్తి జూలియన్ సాంటన బరెరా. నీటి ఒడ్డున, కాల్వల దగ్గర, రోడ్ సైడ్ పడిపోయిన పాడైపోయిన్ బొమ్మలను తీసుకువచ్చి ఓచిమిల్కోలోని అటవీ ప్రాంతంలో వేల్లాడాదీసేవాడు. రాత్రిపూట సంచరించే జంతువులను అవి చంపెస్తాయని ఆయన నమ్మేవాడు. అయితే ఈ బొమ్మలను కావాలనే యజమానులు పారవేసుకొని ఉండరని ఆయన చెప్పేవాడట. 2001లో ఆయన మరణించాక అక్కడ కొత్త బొమ్మలు రాలేదు. వీటిని వెళ్లి మీరు చూడాలంటే అక్కడి పడవల్లో ప్రయాణిస్తూ చూడవచ్చు.
Image Courtesy

అస్థిపంజరాల గది:
రోమన్ లో ఒక గదిలో 40,000-70,000 మంది చనిపోయిన మనుషుల అస్థిపంజరాలను తీసుకువచ్చి ఆ ఎముకలను ఇలా షోకేజ్ గూడును అమర్చినట్లుగా అమర్చారు.చనిపోయిన మనిషి శరీరం నుండి ఏదో ఒక పార్ట్ లోని ఎముకను తీసుకొని ఇలా అమరుస్తారట.
Image Courtesy

చేటేవు మిరిండా, బెల్జియం:
ధ్వనించే కోటగా పిలవబడుతున్న ఈ కోటను బెల్జియం మున్సిపాలిటీ స్వాధీనం చేసుకుంది. 1991లో ఈ కోటను అమ్మకానికి దీన్ని అమ్మకానికి పెట్టిన ఒక్క గదిని కూడా తీసుకోవడానికి ఇందులో నివసించడానికి ఎవరూ ముందుకురాలేదు.
Image Courtesy

డాడి పార్క్, బెల్జియం:
బెల్జియంలోని డాడిజెలెలో గల డాడివినోదపు ఉద్యానవనంలో ఒక కుర్రాడు వాటర్ నౌటిక్ రైడ్ పై కిందకు వెళుతుండగా తన చేతిని కోల్పోయాడు. ఒకప్పుడు ప్రజలకు వినోదాన్ని అందించిన ఈ పార్క్ ను పదేళ్ళుగా మూసివేశారు.
Image Courtesy



Click it and Unblock the Notifications











