Latest Updates
-
అచ్చం బేకరీ రుచితో.. ఇంట్లోనే శాండ్ విచ్ చేసుకోండిలా..పైన కరకరలాడుతూ, లోపల మెత్తగా.. -
డెహ్రాడూన్ స్పెషల్ మటన్ భుట్వా..నెక్స్ట్ లెవల్ టేస్ట్! -
పప్పు నానబెట్టే పనే లేదు..మిగిలిపోయిన బ్రెడ్ తో 15 నిమిషాల్లో కరకరలాడే వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
April 2026 Festivals: హనుమాన్ జయంతి నుండి అక్షయ తృతీయ వరకు..ఏప్రిల్ నెల పండుగల పూర్తి జాబితా! -
ముంబై స్పెషల్ బటాటా పోహా.. ఉదయం పూట నోరూరించే, కడుపు నింపే అద్భుతమైన బ్రేక్ ఫాస్ట్! -
ఈరోజు రాశి ఫలాలు (28.03.26): శనివారం నాడు మీ అదృష్టం ఎలా ఉండబోతోంది? -
అచ్చం హోటల్ స్టైల్ సాంబార్ కావాలా? అయితే ఈ మసాలాను ఇంట్లోనే చేసుకోండి! -
వంటగదిలో చెమటోడ్చే పనే లేదు.. ఈ ఎండల్లో స్టవ్ వెలిగించకుండా చేసే 4 అద్భుతమైన వంటలివే! -
ఈ కమ్మటి టమాటా గ్రేవీ చేస్తే.. తెలియకుండానే రెండు ఇడ్లీలు,దోశలు ఎక్కువే లాగించేస్తారు! -
కేవలం 2 బంగాళదుంపలతో..10 నిమిషాల్లో పొటాటో పాప్ కార్న్..పైన కరకరలాడుతూ, లోపల కరిగిపోయేలా..
ఒకే ఒక్క రూపాయితో కొనగలిగే.. అత్యంత ముఖ్యమైన వస్తువులు..!!
ఒక్క రూపాయి అంటే ప్రస్తుత కాలంలో చాలా చులకన. ఎందుకంటే.. ఒక్క రూపాయికి ఏమీ రాదు అని గేళీ చేస్తుంటారు. నిజమే.. పెద్ద పెద్ద వస్తువులు కాకపోయినా.. చిన్న వస్తువులు వస్తాయి. అంతేకాదు.. ఒక్కరూపాయి పెట్టి కొనగలిగే వస్తువులు కూడా ఉన్నాయి. కానీ ఎంత పెద్ద మొత్తంలో డబ్బు ఉన్నా.. ఒక్కరూపాయితోనే లెక్క మొదలవుతుంది కదా..
మన ఇంట్లో అమ్మమ్మలు, నాన్నమ్మలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు.. వాళ్లు చాలా తక్కువ డబ్బులకే.. ఎక్కువ వస్తువులు కొనేవాళ్లని.. కాస్ట్ చాలా తక్కువగా ఉండేవని అంటుంటారు. అంతేకాదు.. పది రూపాయలు తీసుకెళ్తే.. ఇంట్లోకి కావాల్సిన వస్తువులన్నీ తీసుకొచ్చేవాళ్లం అని చెబుతుంటారు.
అంతేకాదు.. మన గ్రాండ్ పేరెంట్స్, మన పేరెంట్స్ కుటుంబ పోషణ, చదువు, పెళ్లిళ్లు చేయడం, వెకేషన్స్ కి వెళ్లడం వంటివన్నీ.. ఎలా గొప్పగా ఉండేవి. ఆ కాలంలో సంపాదన అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ.. చాలా హ్యాపీగా ఉండేవాళ్లు. కానీ.. అప్పట్లో వాళ్లు ఖర్చు పెట్టిన డబ్బుకి.. ఈ కాలంలో ఎన్ని వస్తువులు వస్తాయి చెప్పండి.
ఉదాహరణకు ఆ కాలంలో ట్రాన్స్ పోర్టేషన్ చాలా తక్కువ ఉండేది. ఒక రూపాయికి కూడా.. చాలా దూరం ప్రయాణించేవాళ్లు. అలాగే టీ, న్యూస్ పేపర్ కూడా రూపాయికే కొనేవాళ్లు. కానీ ఇలాంటివన్నీ ఇప్పుడు కుదరవు అనుకుంటుంటాం. కానీ.. ఒక రూపాయితో కొనగలిగే వస్తువులు ఈ కాలంలో కూడా ఉన్నాయి. అవేంటో చూద్దామా..

బట్టల బటన్స్, హుక్కులు
బట్టలు చాలా కాష్ట్ లీ అయ్యాయి. కానీ.. బట్టలకు ఉపయోగించే బటన్స్ ఒక రూపాయికి వస్తాయి. అంటే బట్టలకు ఎంతో ముఖ్యమైన బటన్స్. అవి లేకుండా.. చొక్కా వేసుకోవడం కూడా రాదు. అలాంటి ముఖ్యమైన వస్తువులు ఒకరూపాయికి వస్తాయి.

కాఫీ పౌడర్
రూపాయికి కాఫీ పౌడర్ ప్యాకెట్స్ అందుబాటులో ఉన్నాయి. అలసిపోయినప్పుడు, వర్క్ లో బిజీగా ఉన్నప్పుడు.. త్వరగా చేసుకోవడానికి ఈ ఒక్క రూపాయి కాఫీ పౌడర్ బాగా ఉపయోగపడుతుంది.

స్టాంప్
ఎలక్ట్రిక్ మెయిల్ ఉన్నప్పటికీ.. హార్డ్ కాపీలను డెలివర్ చేయడానికి.. స్టాంప్ లు కంపల్సరీ కావాలి. పెళ్లి కార్డు, గ్రీటింగ్ కార్డ్, లెటర్ ఏది పోస్ట్ చేయాలన్నా అవసరమయ్యే స్టాంప్.. ఒక రూపాయికే కొనుక్కోవచ్చు.

చాక్లెట్స్
నోరు తీపి చేసుకోవాలి అనిపించినప్పుడు ఒక రూపాయి ఉంటే చాలు.. స్వీట్ నెస్ రుచి చూడవచ్చు. చాక్లెట్స్, క్యాడ్బరీ ఎక్లెయిర్స్ వంటి.. రకరకాల చాక్లెట్స్ ఒక రూపాయికే అందుబాటులో ఉంటాయి.

కాల్ కాస్ట్
ఫోన్ టాక్ టైమ్ ఇప్పటికీ.. ఒక నిమిషానికి ఒక రూపాయి కంటే తక్కువ ఉంది. అలాగే మెసేజ్ ల కాస్ట్ కూడా రూపాయి కంటే తక్కువే ఉన్నాయి. అంత ఎందుకు.. ఒక రూపాయి కాయిన్ బాక్స్ లు కూడా అందుబాటులో ఉన్నాయి.

షాంపూ ప్యాకెట్స్
జుట్టుకి షాంపూ చేసుకోవడానికి కూడా ఒక రూపాయి చాలు. ఎక్కడికైనా ట్రెవెలింగ్ కి వెళ్లినప్పుడు.. షాంపూలను తేలికగా పట్టుకెళ్లడానికి ఒక రూపాయి ప్యాకెట్స్ బాగా ఉపయోగపడతాయి.

ఆయిల్ ప్యాకెట్స్
హెయిర్ ఆయిల్ ప్యాకెట్స్ కూడా ఒక రూపాయికి అందుబాటులో ఉన్నాయి. బిజీగా ఉన్నప్పుడు, స్ట్రెస్ కి లోనయినప్పుడు.. ఒక రూపాయి హెయిర్ ఆయిల్ ప్యాకెట్ మంచి రిలాక్సేషన్ ని ఇస్తుంది.

సేఫ్టీ పిన్స్
సేఫ్టీ పిన్స్, పేపర్ పిన్స్ మనం దాదాపు ప్రతి రోజూ ఉపయోగిస్తుంటాం. ఒక రూపాయికి ఇలాంటి పిన్స్ చాలానే వస్తాయి.

వాషింగ్ పౌడర్స్
వాషింగ్ పౌడర్ లభించే చిన్న చిన్న ప్యాకెట్స్ ఒక రూపాయికే లభిస్తాయి. ఈ వన్ రుపీ ప్యాకెట్.. బట్టలు శుభ్రం చేయడానికి బాగా ఉపయోగపడతాయి.

ప్రింట్స్
జిరాక్స్ ఒకరూపాయికే వస్తుంది. ఒక పేపర్ ప్రింట్ తీయడానికి, జిరాక్స్ చేయడానికి ఒక రూపాయి ఉంటే చాలు కదూ.

ముఖ్యమైన వంటింటి వస్తువులు
వంటిట్లో చాలా మిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, నిమ్మ వంటి వస్తువులతో నిండి ఉంటుంది. అయితే.. వీటిల్లో దేన్నైనా.. ఒక రూపాయికి కొనుక్కోవచ్చు. అయితే సీజన్ ని డబ్బు వీటి కాస్ట్ తక్కువగా ఉంటుంది.

తలనొప్పి తగ్గించే మెడిసిన్
కొన్ని రకాల పెయిన్ కిల్లర్స్ ఒక రూపాయికి అందుబాటులో ఉన్నాయి.

స్టిక్కర్స్
కుంకుమ లేదా స్కిక్కర్స్ కూడా.. ఒక రూపాయికి కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని ఈజీగా కొనుగోలు చేసి.. ఇంట్లో దాచిపెట్టుకోవచ్చు.

మౌత్ ఫ్రెషనర్స్
భోజనం తర్వాత.. మౌత్ ఫ్రెషనర్స్ లేదా వక్క పొడి వేసుకోవడం చాలామందికి అలవాటు ఉంటుంది. ఇవి కూడా.. ఒక రూపాయికి అందుబాటులో ఉన్నాయి.

కాయిన్స్
కాబట్టి.. ఇన్ని వస్తువులు ఒక రూపాయికి అందుబాటులో ఉన్నాయి. సో.. ఒకపై రూపాయి కనిపిస్తే.. ఇంట్లో కిట్టీ బ్యాంక్ లో వేయడం చేయకండి. దీన్ని ప్యాకెట్ లో పెట్టుకుంటే.. ఏవైనా కొన్నప్పుడు అవసరం అవుతుంది.



Click it and Unblock the Notifications











