Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
వావ్..! ఈ ఆల్ట్రాసౌండ్ ఇమేజెస్ చూస్తే ఇంప్రెస్ అవ్వాల్సిందే..!!
మహిళలు గర్భిణీలైతే.. వాళ్ల ఫీలింగ్స్ చాలా కొత్తగా ఉంటాయి. పొట్టలో బిడ్డ గురించి రకరకాల ఆలోచనలు, ఎమోషన్స్ ఉంటాయి. అమేజింగ్ మూమెంట్స్ తల్లి అనుభవిస్తుంది. బేబీ పొట్టలో తన్నడం మొదట ఎదురయ్యే అద్భుతమైన అనుభవం.
అలాగే చిన్న చేతులు, కాళ్లు ఏర్పడిన ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ చూస్తే మరింత ఉత్సాహం కలుగుతుంది. ఇలాంటి అనుభూతులను ఈ ప్రపంచానికి వివరించలేనివి. అందమైన అనుభవాలు. మరి అలాంటి అమేజింగ్ ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ ఇమేజ్ లు మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తాయి.

స్కానింగ్ చేస్తున్నప్పుడు వివిధ రకాల ఎక్స్ ప్రెషన్స్ చూపిస్తున్న బుజ్జి పాపాయిలను చూస్తుంటే.. ఎవరికైనా.. వావ్ అనాలనిపిస్తుంది. ఒకరు ఆవలిస్తుంటే.. మరొకరు నవ్వుతుంటే.. మరొకరు.. విభిన్నమైన ఎక్స్ ప్రెషన్ తో కనిపిస్తారు. మరి అలాంటి ఇమేజెస్ మీకోసం..

హార్ట్ షేప్ హెడ్
ఇక్కడ చూశారుగా ఈ బేబీ పొట్టలో ఉండగా తల హార్ట్ షేప్ లో ఉంది. అది చూసిన తల్లి.. చాలా కంగారు పడింది. 5 నెలల తర్వాత పుట్టిన బుడ్డోడి తల మామూలుగా ఉండటంతో ఆ తల్లి రిలాక్స్ అయింది.
Image Courtesy

భయంకరమైన ఫేస్
వీక్లీ చెకప్ కి వెళ్లినప్పుడు ఆల్ట్రాసౌండ్ స్కాన్ లో భయంకరంగా, ఎర్రగా కనిపిస్తున్న ఈ ఇమేజ్ చూసి.. తల్లిదండ్రులు భయపడ్డారు. ఇది 4డీ ఆల్ట్రాసౌండ్ స్కాన్.
Image Courtesy

ఎవిల్
ఇంకా పొట్టలో ఉన్న బేబీ స్టార్ వార్స్ సినిమాలో ఎవిల్ ఎంపిరర్ ఉన్నట్టు ఉంది కదా. ఇది చూసిన తల్లి వెంటనే రెండింటినీ కంపేర్ చేసింది. స్కాన్ రూంలో ఉన్నవాళ్లంతా పొట్టచెక్కలయ్యేలా నవ్వేశారు.
Image Courtesy

క్లాపింగ్ హ్యాండ్స్
14వ వారంలో బేబీ చేతులు రెండు కలిపి క్లాప్స్ కొడుతున్నట్టు ఉన్న ఈ ఇమేజ్ అందరినీ ఆకట్టుకుంది.
Image Courtesy

థంబ్స్ అప్
వావ్ ఇది చూశారా ? బేబీ చూడు థంబ్స్ అప్ సంకేతం ఇవ్వడం చూసిన డాక్టర్లు, తల్లిదండ్రులు చాలా అమేజ్ అయ్యారు.
Image Courtesy

గర్భాశయంలో నవ్వుతున్న బేబీ
ఎమీ క్రెగ్, లెయ్ టన్ కి పుట్టిన బేబీ.. పొట్టలో ఉండగా ఎంత అందంగా నవ్వుతున్నాడో చూడండి.
Image Courtesy



Click it and Unblock the Notifications
