For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంట్లో ఎట్టిపరిస్థితిలో ఉండకూడని ఫోటోలు..వస్తువులు..!

|

సాధారణంగా ఇంట్లో కొన్ని వస్తువులను పెట్టుకుంటే అద్రుష్టం వరిస్తుందని, మరికొన్ని వస్తువులు పెట్టుకోవడం వల్ల హాని జరుగుతుందని, చెడు ఫలితాలను అందిస్తుందని సూచిస్తుంటారు. ఎంత కష్టపడినా..ఎంత సేవ్ చేసినా.. నిలవడం లేదని వాపోతుంటారు. అంతే కాదు కొన్ని ఫోటోలు కానీ, వస్తువులు కానీ మంచిని సూచిస్తే, మరికొన్ని చెడును ఆహ్వానిస్తాయి. అలా ఇంట్లో చెడు జరగాలని ఎవరూ కోరుకోరు కదా...?

అలాంటి వస్తువులను మన ఇంట్లో నుండి తొలగించడం మంచిది. ఇంటిని పరిశుభ్రంగా ఉంచడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఈ క్రింది లిస్ట్ లో సూచించిన వస్తువులు మీరు తెలిసో తెలియకో ఇంట్లో కనుక పెట్టుకొని ఉంటే వెంటనే తొలగించడం మంచిది. వీటిని తొలగించడం వల్ల సంతోషం, మనశాంతి లభిస్తుంది. ఈ వస్తువులు ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీని తీసుకొస్తాయి. ఇవి మిమ్మల్నిఅనారోగ్యకరంగా మరియు ఆర్థికంగా దెబ్బతీస్తాయి. కాబట్టి ఈ క్రింది వాటిలో సూచించినవి ఏవైనా మీ ఇంట్లో ఉంటే వెంటనే తొలగించండి...

పారే జలపాతం

పారే జలపాతం

పారే జలపాతం పెయింటింగ్స్ గాని ఫౌంటైన్స్ పెయింటింగ్స్ గాని ఇంట్లో పెట్టుకోకూడదు. ఇవి పేదరికాన్ని సూచిస్తాయి. మీకు వచ్చిన సంపద గుర్తింపు ఎక్కువ కాలం నిలువకూడదు అని సూచిస్తాయి.

ఏడుస్తున్న బాలుడు బాలిక పెయింటింగ్స్

ఏడుస్తున్న బాలుడు బాలిక పెయింటింగ్స్

ఏడుస్తున్న బాలుడు బాలిక పెయింటింగ్స్ ఈ మధ్యా బాగా పాపులర్. అయితే ఇవి దురదృష్టానికి సూచికలు. అందువల్ల అటువంటి పెయింటింగ్స్ ఇంట్లో పెట్టుకోవద్దు.

మోడివారిన చెట్లు

మోడివారిన చెట్లు

మొండి చెట్లు, : అలాగే కొంతమంది ఇంట్లో మొండి చెట్లు అంటే పళ్ళు, పూలు ఇలాంటివి ఏమీలేని చెట్ల పెయింటింగ్స్ ని చూస్తుంటాం. ఇలాంటి పెయింటింగ్స్ ని ఉంచరాదు. ఇవి దురదృష్టాన్ని సూచిస్తాయి.పళ్ళు పూలు లేని చెట్లు, ఉంచకూడదు

నటరాజ పెయింటింగ్

నటరాజ పెయింటింగ్

సాదారణంగా నటరాజ పెయింటింగ్ ప్రతీ క్లాసికల్ డ్యాన్సర్ ఇళ్ళల్లో ఉంటుంది. ఇది మంచి కళాత్మకంగా ఉన్నప్పటికీ వినశనాన్ని సూచిస్తుంది. తాండవ నృత్యం అంటే వినాశనానికి నృత్యం అనే మశాన్ని సూచిస్తుంది. అందుకే ఈ పెయింటింగ్ ఇంట్లో పెట్టుకోవడం అంత మంచిది కాదు.

 పులులు,ఎలుగుబంట్లు,తోడేల్లు

పులులు,ఎలుగుబంట్లు,తోడేల్లు

క్రూర జంతువులైన పులులు,ఎలుగుబంట్లు,తోడేల్లు వంటి పెయింటింగ్స్ పెట్టుకోకూడదు. ఇవి మనుషుల్లోని హింసా ప్రవృత్తిని సూచిస్తాయి. చూసారు కదా. అందువల్ల ఇటువంటి పెయింటింగ్స్ మీ ఇంట్లో ఉంటే వెంటనే బయట పడేయండి.

పడిపోబోతున్న లేదా నాశనమవుతున్న బోట్)

పడిపోబోతున్న లేదా నాశనమవుతున్న బోట్)

సింకింగ్ బోట్(పడిపోబోతున్న లేదా నాశనమవుతున్న బోట్): ఇంట్లో ఉంచకూడని వస్తువుల్లో ఇది కూడా ఒక ప్రధానమైన వస్తువు. లేదా చిత్రం. మునుగుతున్నట్టు ఉన్న పడవ చిత్రపటం లేదా బొమ్మలు ఇంట్లో ఉంచుకొన్నట్లైతే ఆ పడవ కుటుంబ సభ్యుల మధ్య సంబంధాల్లో దిగజార్చే స్వభావాన్ని చూపిస్తుంది. కాబట్టి అలాంటి చిత్రపటాలు ఏవైనా ఉన్నట్లైతే వాటిని వెంటనే తొలగించడం మంచిది.

వాటర్ ఫౌంటైన్(నీటి ధార):

వాటర్ ఫౌంటైన్(నీటి ధార):

వాటర్ ఫౌంటైన్(నీటి ధార): ఇంటి అలంకరణ కోసం కొంతమంది ఇల్లల్లో వాటర్ ఫౌంటైన్ ను ఉంచుకొంటారు. అయితే ఇది చూడటానికి అందంగా ఉన్నా దీని వల్ల కొంచెం నష్ట కూడా జరుగుతుంది. చాలా మంది నీటిని ఎంత వృదా చేస్తే అంత డబ్బు ఖర్చు అవుతుంది నమ్ముతుంటారు. మరి వాటర్ ఫౌంటైన్లో నీరు ఎప్పుడూ దారలాగ ప్రవహించడం వల్ల డబ్బుకూడా అలా వేస్ట్ అయిపోతుంది. డబ్బునిలవదని దీన్ని ఇంట్లో ఉంచుకోకూడదంటున్నారు.

చెప్పుల స్టాండ్ :

చెప్పుల స్టాండ్ :

చెప్పుల స్టాండ్ ను ఇంటిలోపల ఎట్టిపరిస్థితిలోనూ పెట్టకూడదు. షూ ర్యాక్స్ ఎప్పుడూ ఇంటి బయటే ఉండాలి. చెప్పులు స్టాండ్ ఇంట్లో ఉండటం వల్ల అనారోగ్యపాలవ్వడమే కాదు, దురదృష్టానికి సంకేతం.

చెత్త చెదారం:

చెత్త చెదారం:

ఇంట్లో ఎప్పటికప్పుడు చెత్త చెదారంను తొలగిస్తుండాలి. కుప్పలు , లేదా మూలల్లో తోయడం వల్ల ఇంట్లో నెగటివి ఎక్కువగా ఉంటుంది. దురదృష్టానికి సంకేతం.

వాడిన పువ్వులు:

వాడిన పువ్వులు:

పూజకు ఉపయోగించే పువ్వులు తాజాగా ఉండాలి. అలాగే వాడిన పువ్వులను వెంటనే తొలగించాలి. వాడిన పువ్వులు ఇంట్లో నెగటివిటికి తీసుకొస్తుంది.

థోర్నీ ప్లాంట్ (బ్రహ్మజముడు ):

థోర్నీ ప్లాంట్ (బ్రహ్మజముడు ):

కాక్టస్ వంటి ముళ్ల మొక్కలను ఇంటి ఆవరణంలో కూడా ఉంచకూడదు. ఇవి అనారోగ్యపాలు చేయడమే కాకుండా ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులకు గురిచేస్తుంది. కాబట్టి ఇది సురక్షితమైనది కాదు.

రాగి చెట్టు:

రాగి చెట్టు:

రాగి చెట్టుకు మన దేశంలో పూజలు ఎక్కువగా చేస్తుంటారు. ఈ చెట్టులో అతీత శక్తులున్నదువల్లే ఈ చెట్టుకు అంత ప్రాధాన్యత ఇస్తుంటారు. అంతే కాదు, రాగి చెట్టు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అయితే ఈ చెట్టు ఇంటి ఆవరణంలో ఉంటే కుటుంబంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

తులసి మొక్క

తులసి మొక్క

తులసి మొక్కను అతి పవిత్రంగా భావిస్తాము. అయితే తులసి మొక్కను పెట్టుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలున్నాయి. తులసి ఆరోగ్యానికి, ఇంట్లో సంతోషానికి, దుష్టశక్తులు రాకుండా చేసేటటువంటి శక్తి సామర్థ్యాలున్నాయని అంటుంటారు. అయితే తులసి మొక్కను సరైన ప్రదేశంలో పెడితేనే ఇటువంటి మంచి ఫలితాలను పొందవచ్చు. ఎట్టి పరిస్థితిలోనూ దక్షణ వైపు, కార్నర్ లో పెట్టకుండా జాగ్రత్తలు తీసుకోండి. అలా ఉంటే ఇంట్లో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

తాజ్ మహల్

తాజ్ మహల్

తాజ్ మహల్ ప్రేమకు చిహ్నమైనప్పటికీ షాజహాన్ భార్య ముంతాజ్ సమాధి గా నిర్మించబడింది. అది ఒక సమధి కావడం వలన చెడు ఫలితాలు ఉంటాయని అందుకే ఇంట్లో పెట్టుకోకూడదని అంటారు.

నగ్న చిత్రాలు:

నగ్న చిత్రాలు:

నగ్న చిత్రాలను కూడా ఉంచకూడదు. ఇవి దురదృష్టాన్ని సూచిస్తాయి. నగ్న చిత్రాలు,వేటాడే చిత్రాలు వంటివి ఇంట్లో పెట్టుకోకూడదు. ఇవి దురదృష్టానికి హేతువులు.

రామాయణ మహాభారతాల

రామాయణ మహాభారతాల

రామాయణ మహాభారతాల నుంచి యూద్ధ సన్నివేశాల పెయింటింగ్స్ ఇంట్లో పెట్టుకోకూడదు. ఇవి దాయదుల మధ్య ఎప్పటికీ అంతం కాని పోరును సూచిస్తాయి. ఈ పెయింటింగ్ ఇంట్లో ఉంచకూడదు.

English summary

Avoid Keeping These Things At Home

If you have been working hard and yet not getting credit for all the hard work, then there must be something that you are doing wrong.You might be either borrowing things that can lead you to poverty or keeping a few items at home that need to be thrown out at the earliest. Like they say, a clean, clutter-free house attracts prosperity.
Story first published: Thursday, August 18, 2016, 16:47 [IST]
Desktop Bottom Promotion