Latest Updates
-
మగవారికి షాకింగ్ న్యూస్.. మీ శరీరంలో ఈ హార్మోన్ లెవెల్స్ పడిపోవడం గమనిస్తున్నారా.? -
ఆలయాల్లో దేవతలను మేల్కొలిపే సుప్రభాతం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం -
ప్రెగ్నెన్సీ సమయంలో యోగా, స్ట్రెచింగ్ చేయవచ్చా.?.. గర్భిణీలు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే.! -
రెస్టారెంట్ రుచితో కరకరలాడే షెజ్వాన్ చికెన్ లాలీపాప్.. మీ ఇంట్లోనే చేసేయండిలా.. -
పరగడుపున నానబెట్టిన మెంతులు తింటే.. ఈ 5 అద్భుత ప్రయోజనాలు మీ సొంతం! -
గుడ్డిగా నమ్మి మోసపోకండి.. రిలేషన్ షిప్స్ పై చాణక్యుడి 6 హెచ్చరికలు -
హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు.. ఉద్యోగులు ఏ నగరాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారో తెలుసా.! -
చికెన్, మటన్ కూడా దీని ముందు బలాదూర్.. స్పైసీ మష్రూమ్ చుక్కా రుచి చూశారా? -
ముఖం, జుట్టు జిడ్డుగా మారి ఇబ్బంది పెడుతుందా.. భారీ వర్షాల్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
ప్రైవేట్ పార్ట్స్ లో హెయిర్ తీయడానికి ఏ పద్ధతి బెస్ట్?
సెల్ఫీ తీసుకుంటున్నారా...?అయితే ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ మీకోసమే..!
వావ్ ..ఈ ఫోటో ఎంత బాగా వచ్చిందో చూడు..ఎవరు తీశారు? నేనే' నువ్వునా...! ఎలా..? అదో ట్రిక్ అంతే..' నిజం చెప్పాలంటే ట్రిక్ లేదు తొక్క కాదు....తన ఫోటో తనే తీసుకుందంతే...అంటే ఇదంతా సూపర్ సెల్ఫీ మహత్యం..ఇప్పుడు సోషియల్ మీడియా వెబ్ సైట్లలో ఈ ట్రెండ్ బాగా హల్ చల్ చేస్తోంది. ఎవర్ని చూసినా ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. కాస్త బాగా తయారైతే చాలు...వెంటనే ఫోటో తీసుకోవడం ఫేస్ బుక్ లో పెట్టేయడం. పెట్టిన పది నిముషాలకోసారి ఎన్ని లైకులు పడ్డాయి....ఎన్ని కామెంట్లు వచ్చాయని వెతుక్కోవడం...రాకపోతే నిరాశ చెందడం. ఇదంతా కామనైపోయింది.
అయితే లైకుల గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. మనం తీసుకునే ఫోటో మనకు నచ్చాలి అంతే...ఎవరో ఫోటోని చూసి చేసే కామెంట్లతో మనకు పని లేదు. వాటి గురించి పట్టించుకోనవసరం అంతకంటే లేదు. ఈ క్రమంలో 'సెల్ఫీ' బాగా రావాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం...

మిమ్మల్ని మీరు :
సెల్ఫీ తీసుకునే ముందు మిమ్మల్ని మీరు ఒకసారి అద్దంలో చూసుకోవడం చాలా ముఖ్యం. మీ జుట్టు, మేకప్ ఇలాంటి వన్నీ ఒకసారి పరిశీలించకుని ఫోటో తీసుకోండి..ఏముంది...ఒకసారి బాగా రాకపోతే అది డిలీట్ చేసుకుని వేరేది దిగుతాం అంటారా? అలా కూడా చేయొచ్చు..కానీ దానికంటే మనల్ని మనం ముందే ఒకసారి పరిశీలించుకుంటే ఇంకా మంచి ఔట్ పుట్ వస్తుంది. కదా..

శాంపిల్స్ తో ప్రాక్టీస్ :
ఫోటో తిసిన వెంటనే ‘బాగుంది కాదా’అని సైట్లో పెట్టేయకుండా ముందుగా కొన్ని శాంపిల్ ఫోటోలను తీయడం ప్రాక్టీస్ చేయండి. అలా మీకు పర్ఫెక్ట్ గా వచ్చేంత వరకూ మీకు నచ్చినన్ని ఫోటోలు తీయండి. వీటన్నింటిలో ఏది బాగా వచ్చిందో చూడండి...అంటే ఏ యాంగిల్ లో ఫోజ్ ఇస్తే ఫోటో బాగా వచ్చిందో చూసుకుని ఆ ఫోటోని ఎంచుకోవాలన్నమాట.

ముందూ వెనుకా...
ఫోన్ తో సెల్ఫీ తీసుకోవాలంటే ముఖ్యంగా ఉండాల్సింది మీ ఫోన్ కి ముందూ వెనకా కెమెరాలున్నాయా.? లేదా? అనేది పరిశీలించాలి. ఎందుకంటే బ్యాక్ కెమెరా కంటే ఫ్రంట్ కెమెరా ఉంటేనే ఫోటో ఎలా వస్తుందనేది మన సులభంగా తెలుసుకోవచ్చు. అదే ఈజీ కూడా..!

సరైన వెలుతురులో :
ఫోటో దిగేటప్పుడు బ్యాక్ గ్రౌండ్ కి ఎంత ప్రాధాన్యం ఉందో ...బ్రైట్ నెస్ కూ అంతే ప్రాముఖ్యం ఉంది. ఫోట దిగేటప్పుడు సరిపడా వెలుతురు ఉందో లేదో ఒక్కసారి పరిశీలించుకోవడం చాలా ముఖ్యం. ఒక వేళ వెలుతురు ఎక్కువైనా పర్లేదు ..కాంట్రాస్ట్ లో తగ్గించుకోవచ్చు. కానీ తక్కువ కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే వెలుతురు సరిగ్గా లేకపోతే ఫోటో డిమ్ గా ఉండి ..ముఖం క్లియర్ గా కనిపించదు.

మంచి బ్యాక్ గ్రౌడ్:
ఒక్కోసారి మీరు ఫోటోలో ఎంత బాగా ఫోజిచ్చినా ...మీరు నిల్చున్న బ్యాక్ గ్రౌండ్ మీ ఫోటో అందాన్ని చెడగొడుతుంది. కాబట్టి సహజంగా అందంగా ఉన్న బ్యాక్ గ్రౌండ్ ను ఎంపిక చేసుకుంటే స్వీట్ అండ్ సింపుల్ గా ఉంటుంది.అంటే నేచర్ కి సంబందించినవి గానీ..ఇంట్లో అందంగా అలంకరించిన షోకేస్ లు గానీ...ఇలాంటి బ్యాక్ గ్రౌండ్స్ అన్నమాట! ఇవేవీ పట్టించుకోకుండా ఇంట్లో పాతబడిన కర్టెన్లు, కలర్ మారిన గోడలను బ్యాక్ గ్రౌండ్ లా ఎంచుకుంటే మీరు ఎంత బాగా ఫోటో దిగినా వేస్ట్ అవుతుంది.

ఆత్మవిశ్వాసంతో:
ఫోటో దిగేటప్పుడు ఆత్మవిశ్వాసంతో దిగండి. కొంత మంది సెల్ఫీ తీసుకునేటప్పుడు ఎవరైనా చూస్తున్నారేమోనని భయంభయంగా...సిగ్గుపడుతున్నట్లుగా కనిపిస్తుంటారు. కానీ సెల్ఫీ తీసుకునేటప్పుడు అలాంటి అనవసర భయాలకు తావివ్వకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లండి. మంచి ఫోటోను మీ సొంతం చేసుకోవచ్చు.

ఎడిటింగ్ యాప్స్:
చాలా రకాల ఫోటో ఎడిటర్ యాప్స్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్నాయి. వీటితో మీరు దిగిన ఫోటోను మీకు కావలసినట్టుగా మలచుకోవచ్చు. కాబట్టి, మీ మొబైల్ కు సూటయ్యే యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని వాటిలో ఉన్న ఫీచర్స్ ను ఉపయోగించుకోండి. యాప్స్ లో చాలా ఆప్షన్లున్నాయి కదా అని వాటన్నింటినీ మీ ఫోటోపై ప్రయోగించకండి..ఎందుకంటే అన్ని ఆప్షన్లు అన్ని ఫోటోలకు సరిపోకపోవచ్చు. దీంతో ఫోటో సహజత్వం కోల్పోతుంది. కాబట్టి ఫోటోకు తగిన ఆప్షన్లను ఎంపికచేసుకోవడం చాలా ముఖ్యం.

మరికొన్ని జాగ్రత్తలు:
ఎంత సెల్ఫీ తీసుకొని ఫేస్ బుక్ లో పెట్టినా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. మీ ఫోటోలు ఫేస్ బుక్ లో బాగా సన్నిహితులైన స్నేహితులు, బంధువులకు మాత్రమే షేర్ చేయాలి. అంతే కానీ, ఎవరికి పడితే వారికి షేర్ చేయడం శ్రేయస్కరం కాదు. ముఖ్యంగాఅపరిచితులతో షేర్ చేసుకోకూడుదు.

మరికొన్ని జాగ్రత్తలు:
అలాగే ఫేస్ బుక్ లోని మీకున్న ఫ్రెండ్స్ లిస్ట్ లో మీకు బాగా కావాల్సిన కొంతమందికి మాత్రమే మీకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసుకొనే సదుపాయం కూడా ఉండి . ప్రైవసీ సెట్టింగ్స్ ఆప్షన్స్ లోకి వెళ్లి దాన్నిఉపయోగించుకోవచ్చు.

మరికొన్ని జాగ్రత్తలు:
సెల్ఫీ తీసుకుని సన్నిహితులకు చూపించి, వారి నుంచి ప్రశంసలు అందుకోవాలనుకోవడం ఈ రోజుల్లో సహజమే కావచ్చు. కానీ ఇలా చేయడం ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ లేనిపోని ఇబ్బందుల్లో చిక్కుకోకూడదు. ఆ రకమైన జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం అత్యంత అవసరం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి...



Click it and Unblock the Notifications