Latest Updates
-
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి!
కేవలం ఆసియాలో మాత్రమే అందుబాటులో ఉండే.. అమేజింగ్ ఫ్రూట్స్
మన హిందు సంప్రదాయంలో వివిధ రకాల ప్రాంతాల్లో వివిధ రకాల ఆహారపు అలవాట్లు, సాంప్రదాయాలు ఉంటాయి. ఒక్కో ప్రదేశాన్ని సందర్శించినప్పుడు కొన్ని కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటుంటాము. ముఖ్యంగా ఒక్కో ప్రదేశంలో ఒక్కో విధమైన సాంప్రదాయలు , అలవాట్లు కలిగి ఉండటం చాలా డిఫరెంట్ గా ఉంటుంది.
మన దేవంలోనే ఒక్కో రాష్ట్రంలో, లేదా ప్రాంతాలల్లో ఒక్కో విధమైన సాంప్రదాయం, ఆహారపు అలవాట్లు, సంస్కృతిని కలిగి ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
అంతే కాదు, ప్రాంతాలను బట్టి, ఆహారాలతో పాటు, పండ్లు పువ్వులు కూడా డిఫరెంట్ గా ఉంటాయి. మన ఆసియా దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉండే వివిధ రకాల పండ్లు కూడా డిఫరెంట్ గా ఉండటం మాత్రమే కాదు చాలా పాపులర్ అయ్యాయి.
ఆ ప్రాంతాలను బట్టి వారి ఆహారపు అలవాట్లతో పాటు , ఈ పండ్లు కూడా వారి జీవనశైలిలో ఒక భాగమైనాయి . కొన్ని రకాల పండ్లు మరియు కూరగాయలు, ఆ భౌళిక ప్రాంతాన్ని, వాతావరణ స్థితిగతులను బట్టి పండుతాయి. ఇటువంటి పండ్లు , కూరగాయాలు ప్రపంచంలోని ఇతర దేశాల్లో కనుగొనడం కష్టం. అందుకే ఇటువంటివి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు.
ఏషియన్ కంట్రీలో వివిధ ప్రాంతాల్లో ఉండే ఎక్సోటిక్ ఫ్రూట్స్ కొన్ని, ప్రపంచ వ్యాప్తంగా బాగా ఫేమస్ అయిన వాటిని ఈ క్రింది స్లైడ్ లో పరిచయం చేస్తున్నాము . ఇవి కేవలంలో ఏసియన్ కంట్రీలో మాత్రమే పండుతాయి.
ఈ అద్భుతమైన పండ్లు, టేస్టీ, అండ్ హెల్తీ ఫ్రూట్ పండే ఏషియన్ కంట్రీలో మన పుట్టడం గర్వంగా ఫీలవుతూ..మరి ఆ పండ్ల గురించి తెలుసుకుందా..

దురియన్:
దురియన్ ఫ్రూట్ సౌత్ ఏసియాలో ‘‘పండ్లలో రారాజు'' అని పిలుస్తారు.. అయితే ఈ ఫ్రూట్ యొక్క వాసన చాలా డిఫరెంట్ గా ఉండటం వల్ల దీన్ని కొనడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. కొన్ని హోటల్స్ లో వీటిని అమ్మడానికి వీలు లేకుండా బ్యాన్ చేసారు.

రాంబుటన్:
వావ్ ! ఈ ఫ్రూట్ చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా రెడ్ కలర్లో నోరూరిస్తుంది. ఈ ఫ్రూట్ తొక్క తీసినప్పుడు చాలా అద్బుతుంగా, రుచిగా, స్వీట్ అండ్ స్టిక్కీగా ఉంటుంది. అలాగే దీని లోపల మద్యలో ఒక విత్తు కూడా ఉంటుంది.

మ్యాంగోస్టీన్:
ఈ ఫ్రూట్ చూడటానికి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ ఫ్రూట్ ను కట్ చేసినప్పుడు ఫ్రూట్ కు రక్షణగా బయటి పీల్ పర్పుల్ కలర్లో చాలా అద్భుతంగా ఉంటుంది.లోపల పట్టుకుంటే, సాప్ట్ గా , వైట్ గా , తినడానికి రుచిగా ఉంటుంది. అలాగే ఈ ఫ్రూట్ స్వీట్ స్మెల్ తో నోరూరిస్తుంటుంది. తిన్న తర్వాత కూడా కొద్ది సేపు ఆ టేస్ట్ అలాగే ఉంటుంది.

జాక్ ఫ్రూట్:
ఫ్రూట్స్ లో అతి పెద్ద ఫ్రూట్ ఇది. సౌత్ ఇండియాలో ఇది చాలా ఫేమస్. ఈ ఫ్రూట్ దాదాపు 80పౌండ్స్ బరువుంటుంది. ఈ ఫ్రూట్ చూడటానికి ఎల్లో కలర్లో ఆరెంజ్ కలర్లో ఉంటుంది . ఈ ఫ్రూట్ ను పచ్చిగానే తినవచ్చు. ఈ ఫ్రూట్ లో ఉండే విత్తనాలు, కర్రీ చేసి తింటుంటారు . ఫ్రూట్ మాత్రం చాలా స్వీట్ గా ఉంటుంది.

ఉడ్ ఆపిల్:
ఉడ్ ఆపిల్ దీన్ని వెలపండు (ఎలక్కాయ) అనికూడా పిలుస్తుంటారు. దీని తొక్క చాలా గట్టిగా ఉంటుంది. దీన్ని బ్రేక్ చేయడం కొంచెం కష్టమే . ఒకసారి దీన్ని బ్రేక్ చేసి ఓపేన్ చేస్తే లోపల చాలా స్మూత్ గా ఉండే గ్రేకలర్ , ఎల్లో లేదా గ్రీన్ పీల్ తో చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని పచ్చిగా ఉన్నప్పుడు, పెప్పర్ సాల్ట్ వేసుకుని తింటారు, పండుగా ఉన్నప్పుడు బెల్లం వేసుకుని తింటే చాలా టేస్టీ మరియు హెల్తీ కూడా.

స్టార్ ఫ్రూట్ :
ఈ ఫ్రూట్ చూడటానికి అచ్చు స్టార్ వలే ఉంటుంది. 5 లేదా 6 కార్నర్స్ తో స్టార్ రూపాన్ని కలిగి ఉంటుంది. దీన్ని తెలుగులో జాపత్రి, జాజికాయ అని కూడా పిలుస్తుంటారు . ఇది క్రంచీగా, జ్యూసీగా ..టేస్టీగా ఉంటుంది. ఇది సీజనల్ ఫ్రూట్ . కొద్దిగా సాల్ట్ వేసుకుని తింటే మంచి రుచి ఉంటుంది.

డ్రాగాన్ ఫ్రూట్ :
ఈ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ మొక్క కాక్టస్ కుటుంబానికి చెందినదే. డ్రాగన్ ఫ్రూట్ ను పిటాయ లేదా స్ట్రాబెర్రీ పియర్ గా మరియు అన్యదేశ ఉష్ణమండల పండుగా పేర్కొంటారు. వివిధ రకాల పోషకాలతో పాటుగా, సంభావ్య ప్రయోజనాలను కలుగచేస్తుంది. పండు, గుజ్జు కూడా ఎరుపుగా ఉండే రకం. పండు పసుపు పచ్చగా.. గుజ్జు తెల్లగా ఉండే రకం. ఇది ఎగుమతి అనుకూలమైనది. పండు ఎర్రగా.. గుజ్జు తెల్లగా ఉండే రకం. ఇది చాలా తియ్యగా ఉంటుంది.

లిచి:
చైనా దక్షిణ ప్రాంతంలో లిచి పండ్లు బాగా పండుతాయి. ఆకర్షణీయమైన ఎరుపు రంగులో కనిపిస్తూ లోపలంతా నోరూరించే గుజ్జు లాంటి పదార్థాన్ని కలిగి ఉన్న లిచి పండు ఇప్పుడు మనకు ఎక్కడ చూసినా దొరుకుతోంది. కారణం ఈ పండు వచ్చే సీజన్ ఇదే కాబట్టి.



Click it and Unblock the Notifications