Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
పురాణాల ప్రకారం మనుషుల మరణం ఎలా ఉంటుంది ??
మనుషులకు అన్నింటికంటే.. ఎక్కువగా మరణం అంటే భయం. ఎప్పుడు ఎలా.. మనగడ కోల్పోవాల్సి వస్తోందో అని ప్రతి క్షణం భయపడుతూ ఉంటారు. దీనికి బలహీనత ఒకరకమైన కారణమైతే.. రిలేషన్స్ మరో బలమైన కారణం. బంధుత్వాలు, బాంధవ్యాల మధ్యలో చిక్కుకున్న మనుషులకు... ఈ జీవితంపై ఎక్కువ ఆశగా ఉంటుంది.
పుట్టిన ప్రతి ఒక్కరు మరణించక తప్పదు. మరణం ఎలా వస్తుందో ఎప్పుడు వస్తుందో ఎవరూ ఊహించలేనది. కానీ నిత్యం ఎంతో మంది మనకు తెలియకుండానే చనిపోతూ ఉంటారు. మన ఇంట్లో ఒక బిడ్డ పుడితే.. ఈ ప్రపంచంలో ఎన్ని వేల మంది చనిపోతుంటారు మనం ఊహించనిది కాదు. సంతోషాలు, సంపదలు, సర్వసుఖాలు, దుఖాలు, ఆలోచనలు, బంధుత్వాలు, బాంధవ్యాలు, అన్యోన్యతలు, అనురాగాలు నింపిన జీవితం చివరికి అంతం కావాల్సిందే.
ఏదో ఒకసారి.. మరణాన్ని ఎదుర్కోక తప్పదు. దానికి మనం సిద్ధం కాకపోయినా.. మరణం మాత్రం సంభవించక తప్పదు. అయితే.. మనం ఎలా చనిపోతాం.. చనిపోయే ముందు.. ఎలాంటి ఫీలింగ్స్ కలుగుతాయి అనేది.. మన పురాతన గ్రంథాలు వివరించాయి. మరి ఆ సంకేతాలేంటో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా..

ఎలా చనిపోతారు ?
ఎంత కిరాతకంగా ఉండే మనిషి అయినా.. చనిపోయే ముందు.. సైలెంట్ గా ఉండాల్సిందే. అలాగే మంచి పనులు చేయాల్సిందే. మన ఆధ్యాత్మిక గ్రంధాలు.. ఒక వ్యక్తి చనిపోయేటప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాడు, ఎలాంటి సంకేతాలు వినిపిస్తాయో వివరించాయి.

తేలికైన మరణం
చనిపోయేవాళ్లకు తప్ప మరణం అనేది అందికీ బాధాకరమే. మీకు ఎలాంటి బాధ లేకుండా.. చనిపోవాలి అని ఉంటే.. అపద్ధం చెప్పకూడదు. మంచి వ్యక్తులుగా ఉండాలి, దేవుడిపై అనన్యమైన ప్రేమ, నమ్మకం ఉండాలి.

నేరాలు చేయడం
రేప్, మర్డర్ వంటి నేరాలు చేసేవాళ్లు.. చాలా చాలా భయంకరమైన, బాధతో కూడిన మరణాన్ని అనుభవిస్తారు. అలాంటి వ్యక్తిని తీసుకెళ్లడానికి వచ్చే యమధర్మరాజు.. అలాంటి వాళ్లను చాలా మలినమైన మూడ్ తో తీసుకెళ్తాడట.

కష్టమైన మరణం
చాలా కిరాతకంగా ఉండేవాళ్ల, చాలా రూడ్ గా వ్యవహరించేవాళ్లు, ఇతరులను గౌరవించని వాళ్లు.. చాలా బాధతో కూడిన మరణాన్ని అనుభవిస్తారు.

చనిపోయే విధానం
చాలా బాధాకరమైన మరణం పొందే వాళ్లు చనిపోవడానికి కొద్ది సమయం ముందే తెలుసుకోగలుగుతారు. చనిపోవడానికి ముందు నిర్లక్ష్యంగా మాట్లాడటం, నోరు ఆరిపోవడం, హార్ట్ బీట్ పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవన్నీ చాలా బాధపెట్టిన తర్వాత.. మరణిస్తారు.

శివపురాణం
శరీరంగా పేలవంగా మారణం, ఎర్రగా ప్యాచెస్ ఏర్పడటం వంటి లక్షణాలు కనిపించిన వ్యక్తి.. 6 నెలలోపే చనిపోతారని శివ పురాణం చెబుతోంది.

మరిన్న సంకేతాలు
వాసన, రుచి, స్పర్శ కోల్పోయాడంటే.. ఆ వ్యక్తి.. త్వరలోనే చనిపోతాడని సంకేతం. అలాగే సూర్యుడిని చూడలేకపోవడం, సూర్యుడి కిరణాలను ఫీలవలేకపోవడం వంటి లక్షణాలు కనిపించిన వ్యక్తి కూడా.. త్వరలోనే చనిపోతాడు.

శరీరంలో లక్షణాలు
ఒకవేళ ఒక వ్యక్తి.. ప్రతిదాన్ని బ్లాక్ అండ్ వైట్ లో చూస్తున్నాడంటే.. అతను త్వరలోనే చనిపోతాడని సంకేతం. ఎడమచేతి నరాలు, కండరాలు హఠాత్తుగా, చాలా లాగుతున్నాయంటే.. అతను.. చాలా త్వరలోనే చనిపోతాడని సంకేతం.

నీడ చూడలేకపోవడం
తన నీడను తానే అద్ధంలో కూడా చూసుకోలేకపోతున్నాడంటే, నీళ్లు, ఆయిల్ లో కూడా.. తన నీడను గుర్తించలేకపోతున్నాడంటే.. అతను చనిపోతాడని అర్థం.

నక్షత్రాలు
ఒకవేళ ఒక వ్యక్తి.. నక్షత్రాలు, చందమామను కూడా చూడలేకపోతున్నాడంటే.. ఖచ్చితంగా త్వరలో చనిపోతాడని సంకేతం. అంతేకాదు.. ఆకాశాన్ని కూడా నీలి రంగులో కాకుండా.. ఎరుపు రంగులో చూస్తున్నాడంటే.. అతను ఖచ్చితంగా త్వరలో చనిపోతాడు.

బ్లూ
ఒక వ్యక్తి ఉన్నట్టుండి.. చుట్టూ ఉన్న వాటిని.. పూర్తీగా నీలం రంగులో చూస్తున్నారంటే.. ఏదైనా బ్లూ కలర్ లోనే కనిపిస్తోంది.. అంటే ఆ వ్యక్తి కేవలం ఒక నెల అంతకంటే.. తక్కువ కాలం బతుకుతారని సంకేతం.

మరణాన్ని తేలికచేసుకోవడం ఎలా
మరణం అనివార్యమైనదని భగవత్ గీత చెబుతోంది. తాను మరణించబోతున్నానని ఒక వ్యక్తికి తెలిస్తే.. కొన్ని పనులు చేయడం వల్ల.. కొంత మేలు జరగవచ్చు.

దేవుడి పేరు
మరణానికి కొన్ని రోజుల ముందు.. ఎక్కువగా మాట్లాడటం మానేయాలి. సమయాన్నంతటినీ.. దేవుడి ధ్యానంలో నిమగ్నం చేయాలి. ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్లాలి.

మంచి పనులు చేయడం
మంచి కర్మ ఒక్కరోజులో పొందలేనిది. అయితే చనిపోవడానికి ముందు కొన్ని మంచి పనులు చేయడం వల్ల.. జీవితంలో చేసిన చెడుపనుల ప్రభావం కొంతైనా తగ్గుతుంది.

ఇష్టమైన వాళ్లు
చనిపోవడానికి ముందు.. ఆ వ్యక్తి.. తమకు బాగా ఇష్టమైన వాళ్లను పిలుస్తుంది. వాళ్లతో మాట్లాడాలి. వాళ్లను ఎంత ఇష్టపడుతున్నారో చెప్పాలి. దేవుడి దగ్గరకు వెళ్తున్నామని ఫీలవ్వాలి.

జీవితం
త్వరలో మరణిస్తామని తెలిస్తే.. దాన్ని అంగీకరించాలి. దేవుడితో పోట్లాడకూడదు. మరణాన్ని ఎంత త్వరగా అంగీకరిస్తే.. అంత తేలికగా.. ఉంటుంది.

తల్లిదండ్రుల పేర్లు
చనిపోవడానికి ముందు తల్లిదండ్రుల పేర్లు పలకడం వల్ల.. మరణం చాలా తేలికగా ఉంటుంది. బాధతో కూడి ఉండదు.

క్షమాపణ చెప్పడం
చివరగా.. తమ జీవితంలో చేసిన తప్పులు, పొరపాట్లకు క్షమాపణ అడగాలి. అప్పుడు.. మంచి కర్మ కలిగి.. ప్రశాంతంగా చనిపోతారు.



Click it and Unblock the Notifications
