Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
టాయిలెట్స్ గురించి 7 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ...!!
మేము ప్రతిసారి ఎదో ఒక ఆసక్తికరమైన విషయం గురించి చెప్పుతున్నాం. మన దైనందిక జీవితంలో ప్రాధమికంగా ఉపయోగించే కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. వాటిలో మనం ఇప్పుడు టాయిలెట్స్ గురించి తెలుసుకుందాం.
ఈ వ్యాసంలో టాయిలెట్స్ (మరుగుదొడ్లు) గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం.

చరిత్ర ప్రకారం, క్వీన్ ఎలిజబెత్ I యొక్క కోర్టు సభ్యుడు అయిన సర్ జాన్ హరియింగ్టన్ 1596 లో ఆధునిక ఫ్లష్ టాయిలెట్ ఆవిష్కరించాడు.
కానీ, కొన్ని సంవత్సరాల తరువాత, ఈ మోడల్ ను 1775 లో అలెగ్జాండర్ సుమ్మింగ్ అనే ఒక ఇంగ్లిష్ సృష్టికర్త కొన్ని మార్పులను చేసెను. అతను ఫ్లష్ టాయిలెట్ పేటెంట్ పొందిన మొదటి వ్యక్తి అయ్యాడు. అతను చెడు వాసనలు పోయే విధంగా S ఆకారంలో వాల్వ్ కనుగొనెను.
మరుగుదొడ్లు గురించి చారిత్రాత్మక వాస్తవాలే కాకుండా మనస్సును రగిలించే కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి.

ఫ్యాక్ట్ : 1
మీకు టాయిలెట్ సీటు బాత్రూమ్ లో పరిశుభ్రమైన భాగం అని తెలుసా? చాలా మంది దానిపై కూర్చునే ముందు దాని శుభ్రం పట్ల శ్రద్ద చూపరు.

ఫ్యాక్ట్ : 2
ఒక సర్వే ప్రకారం అపరిశుభ్రమైన టేబుల్ మరియు స్మార్ట్ ఫోన్ ఉపరితలం మీద స్టాపైలోకాకస్ బ్యాక్టీరియా 20 యూనిట్స్ ఉంటే, అదే టాయిలెట్ సీటు మీద అయితే 600 యూనిట్స్ స్టాపైలోకాకస్ బ్యాక్టీరియా ఉంటుంది.

ఫ్యాక్ట్ : 3
మరొక సర్వేలో టాయిలెట్ నుండి బయటకు వచ్చేటప్పుడు 77 శాతం మగవారు, 93 శాతం ఆడవారు మాత్రమే చేతులను కడుగుతారు. అయితే పురుషులతో కరచాలనం చేసినప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలేమో.

ఫ్యాక్ట్ : 4
మీకు సగటున ఆధునిక టాయిలెట్ కోసం 1.6 గ్యాలన్ల నీరు అవసరం అవుతుంది. ఒక్కసారి ఫ్లష్ చేస్తే 6 లీటర్ల నీరు తీసుకుంటుంది.

ఫ్యాక్ట్ : 5
పారిస్ లో 1739 లో తొలిసారిగా మహిళలకు,పురుషులకు ప్రత్యేక మరుగుదొడ్లను ప్రారంభించారు.

ఫ్యాక్ట్ : 6
ఒక సర్వే ప్రకారం వాష్ రూమ్ లో మహిళల కంటే పురుషులు ఎక్కువ సమయం గడుపుతారని తేలింది. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం కదా.

ఫ్యాక్ట్ : 7
ప్రజలు తీసుకున్న మందులు దాదాపుగా 90% మూత్రవిసర్జన ద్వారా విడుదలవుతాయని తెలుసా? అందువల్ల, మురికి నీళ్ల వ్యవస్థలలో భారీ మోతాదులో మందులు ఉంటాయి.



Click it and Unblock the Notifications
