Latest Updates
-
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే..
ఫస్ట్, సెకండ్, థర్డ్ : మీ బర్త్ ఆర్డర్ బట్టి మీ వ్యక్తిత్వం తెలుసుకోవచ్చు..!
ప్రతి తల్లిదండ్రులకు పిల్లల పుట్టుక ఒక గొప్ప వరం. తల్లిదండ్రులకు చిల్డ్రన్స్ విషయంలో ఫస్ట్ , మిడిల్స్, లాస్ట్ లేదా సింగిల్ చైల్డ్ ఇలా ఎవరైనా సరే తల్లిదండ్రులు బిడ్డలను ఎప్పుడూ ఎక్కువగా ఇష్టపడుతారు . అయితే మొదటి సంతానం మరియు చివరిసంతానం మీద ఎక్కువ ప్రేమ కలిగి ఉంటారిని ప్రతి ఇల్లలో చెబుతుండాగా వింటుంటాము. అమ్మాయైనా, అబ్బాయైన సరే మొదట పుట్టిన వారికి అన్ని విషయాల్లో మిడిల్ అండ్ లాస్ట్ పుట్టిన వారికంటే మరింత ఎక్కువ ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది.
తల్లిదండ్రులకు మొదట పుట్టే సంతానంలో అమ్మాయాయైనా...అబ్బాయైనా సరే తల్లిదండ్రులు స్పెషల్ గా ఫీలవుతారు. మొదటసారి గర్భపొందినప్పుడు చాలా ఎక్సైట్ మెంట్ గా ఫీలవుతారు. అదే ఎక్సైట్మెంట్ తోనే మొదటి పిల్లలను చాలా గారాభంగా పెంచుతారు. తర్వాత మిడిల్ వన్(రెండవ సంతానం)విషయంలో కొద్దిగా రిలాక్స్డ్ గా ఉంటారు. మిడిల్ వన్ ను చూసుకోవడానికి మొదటి వారు ఉంటారు. కాబట్టి రెండవ సంతానం మీద కొద్దిగా నెగ్లెక్ట్ గా ఉంటారు .
ఇద్దరు పిల్లలు పుట్టినప్పుడు, రెండవ సంతానం మీద తల్లిదండ్రుల కంటే ఎక్కువగా మొదటి సంతానంలో పుట్టివారు కేర్ మరియు రెస్పాన్సిబులిటిగా ఉంటారు. ఇక మూడవ సంతానంలో పుట్టే పిల్లకు తల్లిదండ్రులతో పాటు మొదటి, రెండవ సంతానం కూడా చాలా అనందంగా ఉంటారు. క్యూట్ లిటిల్ వన్ చూసుకోవడానికి ఇంట్లో ఆల్రెడీ అమ్మనాన్నతో పాటు, మొదటి రెండవ సంతానం కూడా ఉంటుంది. క్యూట్ లిటిల్ బేబీని చూసుకోవడం చాలా సింపుల్ గా, సులభమవుతుంది.
అయితే మొదటసారి, రెండవసారి మరియు మూడవసారి పుట్టిన పిల్లల్లో మనస్తత్వం, వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? తెలుసుకోవాలంటే కొంత ఎక్సైటింగ్ గానే ఉంటుంది. ఫస్ట్ , సెకండ్ మరియు థర్డ్ ఆర్డర్ లో పుట్టిన వార..బర్త్ ప్యాట్రన్ బట్టి ఒక్కొక్కరి వ్యక్తిత్వం ఎలా తెలుసుకోవాలంటే ఈ క్రింది స్లైడ్ క్లిక్ చేయాల్సిందే...

1. ఫస్ట్ బార్న్ (మొదటి సంతానం:
బర్త్ ప్యాట్రన్ లో మొదటి సంతానం ఎప్పుడూ చాలా ఫర్ఫెక్ట్ గా మరియు బిజీ నేచర్ కలిగి ఉంటారు . వీరు వారి పిల్లల గురించి ఎక్కువ కేర్ తీసుకుంటారు మరియు ఎక్కువ బాధ్యత కలిగి ఉంటారు.కొన్ని విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు, ఏకాగ్రత కలిగి ఉంటారు. ఎక్కువ బాధపడుతారు . మొదట పుట్టిని వారు అన్నింట్లో చాలా చురుకుగా ఉంటారు. అన్నింట్లో ముందుంటారు మరియు కొన్ని విషయాల్లో చాలా కంట్రోల్డ్ గా ఉంటారు. చాలా కష్టపడి అన్నింట్లో వారిదే పైచేయి ఉండాలని కోరుకుంటారు.

2. మిడిల్ బార్న్(రెండవ సంతానం):
రెండవ సంతానంలో పుట్టిన వారు చాలా ఇండిపెండెంట్ గా ఉంటారు. సామాజిక సేవా గుణం ఎక్కువ, తిరుగుబాటుతనం ఎక్కవు. బయట ఎక్కువగా గడపడానికి ఇష్టపడుతారు.. ప్రతి ఒక్కరితో త్వరగా కలిసిపోతారు. వారి కొద్దిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఫీలవుతుంటారు. కుంటుంబంలో మరియు స్నేహితులతో మంచి గుర్తింపు పొందడానికి తాపత్రయపడుతూ మార్గాన్ని వెతుకుతుంటారు. వీరు ఏవిషంయలో ఫర్ఫెక్షన్ గా ఉండరు మరియు ఇతరులను ఆకట్టుకోవడానికి సృజనాత్మకత కలిగి ఉంటారు. ఇతరులకు ఇబ్బంది కలిగించరు మరియు ఎదుటి వారి సంతోషాన్ని ఎప్పుడూ కోరుకుంటుంటారు .

3. లాస్ట్ బార్న్(చివరి సంతానం):
వీరు చాలా అందంగా ఉంటారు మరియు ఎక్కువ బయట తిరగడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వీరు చాలా సోషియల్ గా ఉండటానికి ఇష్టపడుతారు. కానీ కొన్ని విషయాలను (కాంప్లికేటెడ్ విషయాలను)ఇష్టపడరు . వీరు మంచి ప్రేమికులు మరియు అలాగే ప్రవర్థిస్తారు. ప్రేమను పంచుతారు, ప్రేమను స్వీకరించే స్వభావం కలిగి ఉంటారు. అయితే వారు ఏదైనా కానీ స్వయంగా నిర్ణయం తీసుకొనే మనస్తత్వం కలిగి ఉంటారు. ఇంట్లో వారి పట్ల చాలా జాగ్రత్తగా నడుకుంచుకుంటారు. ఇంట్లో వారందరూ వారి ఇష్టపడేట్లు నడుచుకుంటారు . కొద్దిగా సాహస ప్రియులు మరియు ఏవిషయంలో అయినా దూకుడెక్కువ.

4. ఒకే ఒక సంతానమైతే :
వీరు చాలా కాన్ఫిడెంట్ గా మరియు రెస్పాన్సిబులిటీ గా ఉంటారు. సింగిల్ చైల్డ్ వారి వయస్సుకంటే ఎక్కువ తెలివి తేటలుంటాయి. అలాగా సెన్సిటివ్ నెస్ ఎక్కువ . అతను/ ఆమె అన్నింట్లో ముందుంటారు, చదువు, ఉద్యోంగం, ఆటలు, పాటలు, అన్నింట్లో ముందుటారు. అలాంటి జీవితాన్నే కోరుకుంటారు . అలాగే అతను / ఆమె అలాగే ఏ విమర్శలను తట్టుకోలేరు మరియు మనస్సాక్షికి విలువిస్తారు. మనస్సాక్షి చంపుకొని ఎలాంటి చెడు పనులు చేయడానికి ఇష్టపడరు. సింగిల్ చైల్డ్ ఎప్పుడూ సోషియల్ గా ఉండటానికి ఇష్టపడుతారు మరియు రిలాక్స్ పొందడానికి చాలా తక్కువ సమయం మాత్రమే ఉంటుంది.

5. అడాప్ట్ చిల్డ్రన్:
దత్తత తీసుకున్న పిల్లలు తల్లి దండ్రులు ఎలా చెబితే అలా పెరగడానికి.. ఉండటానికి ఇష్టపడుతారు. ప్రతి విషయంలో తల్లిదండ్రుల మీద ఆధారపడుతారు. వీరి విషయంలో ఫస్ట్ బార్న్ లేదా లాస్ట్ బార్న్ అని వ్యక్తిత్వాన్ని అంచానా వేయలేము. అయితే, అతను / ఆమె యొక్క గుణాలను మాత్రం అంచనా వేయొచ్చు. దత్తత తీసుకున్న పిల్లలు ఎక్కువ ప్రేమ మరియు అభిమానం మరియు జాగ్రత్తలు కలిగి ఉంటారు. మరియు తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడుస్తారు.

6. గ్యాప్ ఇన్ చిల్డ్రన్:
పుట్టిన పిల్ల మద్య ఎక్కువ గ్యాప్ ఉంటే రెండవ మరియు మూడవ సంతానంలో పుట్టిన పిల్లల యొక్క వ్యక్తిత్వం మరియు ఇతర స్వభావాలు ఒకే విధంగా ఉంటాయి.

7. ఎందుకలా జరుగుతుంది:
ఇలాంటి వ్యక్తిత్వం, మరియు గుణాలు జీన్స్ నుండి వచ్చినవి కాకపోయిచ్చు. మొదట పుట్టిన వారి నడవడిక, అలవాట్లు చూసి మిగిలిన ఇద్దరూ పెరగడానికి కారణమవుతుంది. అలాగే కుటుంబ పరిస్థితుల బట్టి, వారి బందువుల్లో ఎవరో ఒకరిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని పెరగడానికి కారణమవుతుంది.



Click it and Unblock the Notifications











