Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
ఆదరణ కోల్పోతున్న మన చరిత్రకు నిదర్శనమైన పురాతన కట్టడాలు
వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా.. మన ఇండియాలోని ప్రసిద్ధ కట్టడాల గురించి చర్చిద్దాం. అది కూడా.. సరైన శ్రద్ధ లేకపోవడం, ప్రభుత్వ చొరవ లేకపోవడం వల్ల.. అవి తమ ఉనికిని కోల్పోతున్నాయి. అలాంటి ప్రముఖ కట్టడాలేంటో ఇప్పుడు చూద్దాం..
పురాతన ప్రదేశాలు, కట్టడాలు మన చరిత్రను, పూర్వీకుల కళాత్మకతను, శక్తి సామర్థ్యాలను వివరిస్తాయి. అలాగే ఆ కట్టడాలను చూస్తే.. మన పూర్వీకులు ఎంతటి రాజ వైభోగాలు అనుభవించారో తెలుస్తుంది. అయితే మన సంప్రదాయాలు, కళలను తెలిపే ఈ కట్టడాలపై శ్రద్ధ, సరైన జాగ్రత్తలు లేకపోవడం వల్ల.. ఇవి వాటి ఉనికిని కోల్పోతున్నాయి.
ఇండియాలోని పురాతన ఆలయాల్లో దాగున్న అంతుచిక్కని రహస్యాలు
ఈ కట్టడాలపై ప్రభుత్వం సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల నెమ్మదిగా నాశనం అయిపోతున్నాయి. నిర్లక్ష్యం కారణంగా.. వీటిని మనం పూర్తీగా కోల్పోవాల్సి వస్తుందేమో. నిర్లక్ష్యానికి గురవుతున్న మన ఇండియాలో ఉన్న అత్యంత ప్రముఖ కట్టడాలేంటో ఇప్పుడు చూద్దాం.

అజంతా, ఎల్లోరా
అజంతా ఎల్లోరా కట్టడాలు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో ఉన్నాయి. ఒక్క రాతితోనే.. అత్యంత సుందరమైన కళలు నిర్మించారు. అందుకే ఇది చాలా ఫేమస్. అయితే.. ఇప్పుడు ఈ కట్టడాలు నాశనం అవుతున్నాయి. అక్కడికి వస్తున్న విజిటర్స్ దీన్ని డ్యామేజ్ చేస్తున్నారు. కాబట్టి వెంటనే దీనిపై అలర్ట్ అవ్వాల్సి ఉంది.

హవా మహల్
జైపూర్ లో ఉన్న హవా మహల్ అత్యంత పెద్దది. ఇందులో సిటీలో జరిగే.. రకరకాల యాక్టివిటీస్ ని చూడవచ్చు. అయితే ఈ మహల్ కిటికీలు పగుళ్లకు లోనవుతున్నాయి. కాబట్టి.. దీనిమీద కాస్త జాగ్రత్త వహించడం చాలా అవసరం.

పనహల కోట
కోల్హాపూర్ లో ఖచ్చితంగా చూడాల్సిన ప్రాంతాల్లో ఇది ఒకటి. కానీ.. పర్యాటకులు చేసిన తప్పుల వల్ల ఇది డంపింగ్ యార్డ్ లా మారిపోయింది. ఈ కోట గోడలను శుభ్రం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి.. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ధోలవిరా
గుజరాత్ లోని కుచ్ జిల్లాలో ఉన్న చిన్న గ్రామం ధోలవిరా. పురావస్తు ప్రాంతాలలో చెప్పుకోదని ముఖ్యమైన ప్రాంతమిది. అయితే ఈ ప్రాంతాన్ని వర్షాకాలంలో చాలా శ్రద్ధ వహించాలి. వర్షాలు ఈ ప్రాంతంపై తీవ్ర దుష్ర్పభావం చూపుతున్నాయి.

హుమయూన్ సమాధి
రెడ్ స్టోన్స్ తో నిర్మించిన అతి పెద్ద సమాధి హుమయూన్ సమాధి. ఇది న్యూఢిల్లీలో ఉంది. ఇది చాలా పురాతన కట్టడం కావడం వల్ల దీనిపై తగిన చర్యలు తీసుకోవడం చాలా అవసరం.

బింబెక్తా గుహలు
మధ్యప్రదేశ్ లో చాలా పాపులర్ బింబెక్తా గుహలు. దీని చరిత్ర, రాతి గుహలు చాలా ప్రత్యేకం. ఈ గుహలు అనేక చారిత్రక విషయాలను వివరిస్తాయి. అయితే నిర్లక్ష్యం కారణంగా.. ఇవి తమ ఉనికిని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.

మహాభోధి ఆలయం
బోధ్ గయలో ఉంది మహాభోధి ఆలయం. పుణ్యక్షేత్రాలపై మక్కువ ఉన్నవాళ్లు తప్పకుండా దర్శించాల్సిన ఆలయం ఇది. ఇక్కడ చాలా ప్రశాంత వాతావరణం ఉంటుంది. అయితే.. ఇక్కడ మెయింటెనెన్స్ కొరత చాలా ఉంది.



Click it and Unblock the Notifications