రామాయణాన్ని కళ్లకు కట్టినట్టు చూపించే.. అద్భుత తీపి గుర్తులు..

రాముడు నడయాడిన ప్రదేశాలు మనకు పూజ్యనీయమైనవి. మన దేశంలోని ఏ ప్రదేశానికి వెళ్లినా రాముడు సీతాలక్ష్మణ సమేతుడై ఈ ప్రాంతానికి వచ్చాడని చెబుతూ ఉంటారు. అంతే కాదు దానికి తగిన ఆనవాళ్లనూ చూపెడుతుంటారు. రఘునందనుడి పాదధూళి సోకిన చోట మందిరాలు నిర్మించి ఆధ్యాత్మిక సేవలో తరిస్తూ ఉంటారు భక్తులు.

అలాంటి ప్రదేశాలు కొన్ని చెప్పమంటే తెలుగు రాష్ట్రాలవారు మాత్రం భద్రాచలం అని టక్కున చెప్పేస్తారు. భద్రాద్రి ఒక్కటే కాదు...ఇలా రామాయణంతో సంబంధం ఉన్నట్లుగా భావించే ప్రదేశాలు మన పొరుగు దేశాల్లో కూడా కనిపిస్తాయి. మరి రామాయణంలో పేర్కొన్నట్లు భావించే కొన్ని ప్రదేశాల గురించి తెలుసుకుందాం...

రామ సేతు:

రామ సేతు:

ఆ నాడు సీతమ్మ తల్లిని వెతుక్కుంటూ రామదండుతో కలిసిన శ్రీరాముడు లంకకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు సముద్రాన్ని దాటాలి. కానీ ఎటువంటి మార్గం లేకుండా లంక చేరడం కష్టం. అందుకోసం నిర్మించిందే ఈ రామసేతు..! వానరులంతా కలిసి చేయిచేయి కలిపి రాళ్లసాయంతో నిర్మించుకున్న ఆ వంతెనే ఈ వంతెన క్రమంగా కనుమరగైపోతుండటం దురద్రుష్టకరం. ఈ వంతెనను తమిళనాడులోని పంబన్ దీవికి , శ్రీలంకలోని మన్నార్ దీవికి మధ్యలో నిర్మించారు.

నేపాల్లో సీతమ్మ గుడి:

నేపాల్లో సీతమ్మ గుడి:

నేపాల్ లోని అద్భుత కట్టడాల్లో ఇదొకటి. దీన్నే ‘నౌలఖా మందిర్' అని కూడా అంటుంటారు. నేపాల్ లో ‘జనక్ పూర్' అనే ఆ ప్రాంతంలో ఈ గుడిని దర్శించవచ్చు. జనకుని కుమార్తె అయిన జానకీ పేరుతో ప్రత్యేకంగా కట్టించిన గుడి ఇది.

లేపాక్షి:

లేపాక్షి:

మన దేశంలో మహిమాన్వితమైన దివ్యశైవక్షేత్రాలు 108ఉన్నాయి. వాటిలో ‘లేపాక్షి' కూడా ఒకటి. పురాణాల ప్రకారం దీనికి ఈ పేరు రావడానికి రకరకాల కారణాలున్నాయి. ఆనాడు సీతమ్మ తల్లిని రావణుడు చెరబట్టి తీసుకెళ్తుంటే, ఆమె కాపాడబోయి గాయపడ్డ జటాయువును చూసిన శ్రీరామచంద్రుడు ‘లే పక్షీ' అని పిలిస్తే జటాయువు లేచినిలుచున్నాడని కాలక్రమంలో ఈ ప్రదేశాన్ని ‘లేపాక్షి' అన్న పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతోంది. . ఈ లేపాక్షి అనంతపురంలో హిందూపురం పట్టణానికి దాదాపు 16కి.మీల దూరంలో ఉంది

కోనేశ్వరం-శ్రీలంక:

కోనేశ్వరం-శ్రీలంక:

ఈ గుడికి సంబంధించి కూడా ఎన్నో సంఘటనలను అక్కడి ప్రజలు కథలు కథలుగా చెప్పకుంటుంటారు. రావణుడి భక్తికి మెచ్చి స్వయంగా శివుడే తన కోసం ఈ గుడిని కట్టించారని కొందరంటే, మరికొందరు మాత్రం రావణుడు చేసే చెడ్డ పనులను వదిలేయమని తన తల్లి చెప్పిందని, ఈ కోపంతోనే తన దగ్గరున్న కత్తిని దూరంగా విసిరాడని, అలా విసిరినప్పుడు అక్కడున్న కొండ రెండుగా చీలిందని అంటుంటారు. ఇలాంటి ఆసక్తికరమైన మరో కథ కూడా ఉంది.

సీతా కొతువ:

సీతా కొతువ:

రావణుడు సీతను ఎత్తుకెళ్లాక ముందుగా తన భార్య మండోదరి నివసించే కోటలోనే ఆమెను ఉంచాడట. ఆ ప్రాంతం పేరే ‘సీతా కొతువ'. సీతను అశోకవనానికి తీసుకెళ్లే ముందు ఇక్కడ కొన్ని రోజులు ఆమెను దాచాడని చెబుతుంటారు. శ్రీలంకలోని ఈ ప్రాంతం ప్రస్తుతం పర్యాటక ప్రదేశంగా ప్రసిద్దిగాంచింది. ఈ ప్రాంతానికి హనుమంతుడు సీత కోసం వచ్చిన ఆనవాళ్లు కూడా కనిపిస్తాయంటారు. ఈ ప్రాంతం ఒకప్పుడు అందమైన జలపాతాల, రకరకాల చెట్టు, పూలతో ఇంకెంతో అందంగా కనిపించేదట.

కాల్చిన గుర్తులు:

కాల్చిన గుర్తులు:

సీతాదేవి జాడ తెలుసుకోవడానికి ఆంజనేయుడు లంకకు వెళతాడు. అక్కడ రాక్షససేనలు అతనిని బంధించి రావణుని ముందు హాజరుపరుస్తారు. ఆ సమయంలో రావణుడు హనుమంతుని తోకకు నిప్పు పెట్టాల్సిందిగా ఆదేశిస్తాడు. ఆ నిప్పుతోనే లంకను మొత్తం దహించివేస్తాడు. అందుకే చూసి రమ్మంటే కాల్చివచ్చాడనే నానుడి మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ఇలా కాల్చిన గుర్తులు ఇప్పటికీ శ్రీలంకలోని ఉస్సంగడలో కనిపిస్తాయని అంటుంటారు.

నాసిక్ పవిత్ర పుణ్యక్షేత్రాల్లో నాసిక్ ఒకటి.

నాసిక్ పవిత్ర పుణ్యక్షేత్రాల్లో నాసిక్ ఒకటి.

ఇది ముంబైకి 187 కిలోమీటర్ల దూరంలో ఉంది. అరణ్యవాసానికి వెళ్లినప్పుడు శ్రీరామ చంద్రుడు నాసిక్ లో కొన్ని రోజులు నివసించారు. రావణుడు సీతను అపహరించింది కూడా ఇక్కడి నుంచే. అంతేకాదు రావణుడి సోదరి సూర్పనక ముక్కును లక్ష్మణుడు కోసినది కూడా ఇక్కడే. అందుకే ఈ ప్రాంతానికి నాసిక్ అని పేరు వచ్చింది.

కుంభమేళా

కుంభమేళా

నాసిక్ లో ప్రతి 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది. నాసిక్ లో రామకుండ అనేది ప్రధాన తీర్థయాత్ర స్థలం. ఇక్కడ రాముడు, సీత స్నానాలు చేసేవాళ్లని అందుకే దీన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. అంతేకాదు ఇందులో ఎముకలు ఈజీగా కలిసిపోతాయి.. అందుకే ఇందులో చనిపోయిన వాళ్ల అస్థికలు కలుపుతారు. కాబట్టి దీన్ని అస్థి విలయ తీర్థ అని కూడా పిలుస్తారు.

 రామేశ్వరం

రామేశ్వరం

రామేశ్వరంలోని చాలా ప్రాంతాలు రామాయంతో ముడిపడి ఉన్నాయి. రామేశ్వరంలోపలికి వెళ్లాలంటే ఇక్కడ ఉన్న బ్రిడ్జి దాటాల్సి ఉంటుంది. శ్రీరాముడు లంకకు వెళ్లేటప్పుడు వానరసేనతో కలిసి ఈ బ్రిడ్జ్ దాటడానికి రాళ్లు వేసివెళ్లినది ఇక్కడే. దీన్ని లక్ష్మణ తీర్థ, రామ తీర్థ అని పిలుస్తారు. బాణాలను గ్రౌండ్ లోకి విసిరిన ప్రాంతాన్ని కోడి తీర్థ అని, రాముడు తన జుట్టుని శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించిన ట్యాంక్ ని జట తీర్థ అంటారు.

 హంపి

హంపి

విజయనగర సామ్రాజ్యానికి రాజధాని హంపి. విజయనగర సామ్రాజ్యానికి ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది సైన్యం ఉండేది. అయితే రాముడికి హంపికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా ? ఉంది. ఇక్కడే శ్రీరాముడు హనుమంతుడిని మొదటిసారి కలిసిన ప్రాంతం. అలాగే పార్వతి తన భర్త అయిన శివున్ని కలిసినది కూడా ఇక్కడే.

కిష్కింద హంపి

కిష్కింద హంపి

కిష్కింద హంపి నుంచి 5కిలోమీటర్ల దూరంలో ఉంది అనేగుడి. ఇక్కడ తుంగబద్ర నది ప్రవహిస్తుంది. అయితే ఈ ప్రాంతానికి పురాణగాధ ఉందని స్థానికులు నమ్ముతారు. అదే రాముడు హనుమంతుడు, సుగ్రీవుడిని కలిసిన కిష్కిందగా భావిస్తారు. రామాయణంలో ప్రస్థావించిన రిష్ ముఖ్ పర్వతం హంపికి దగ్గరలోనే ఉంది.

ష్కంద - పురాతన ప్రాంతం కిష్కందను సుగ్రీవుడు

ష్కంద - పురాతన ప్రాంతం కిష్కందను సుగ్రీవుడు

ష్కంద - పురాతన ప్రాంతం కిష్కందను సుగ్రీవుడు, బాలీ పాలించారు. వీళ్లద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోతారు. ఆ తర్వాత సుగ్రీవుడు మాతాంగ పర్వత కొండపై నివసిస్తాడు. ఇది చాలా ఫేమస్ వ్యూ పాయింట్. రావణుడు సీతను అపహరించుకుని వెళ్లాక.. రామలక్ష్మణులు సుగ్రీవుడు, హనుమంతుడిని ఇక్కడే కలుస్తారు.

 హజర రామా టెంపుల్ చాలా ప్రసిద్ధమైనది

హజర రామా టెంపుల్ చాలా ప్రసిద్ధమైనది

రామాలయం కర్ణాటక సమీపంలో ఉన్న హజర రామా టెంపుల్ చాలా ప్రసిద్ధమైనది. 15వ శతాబ్ధంలో ఈ ఆలయంలో రామాయణానికి సంబంధించిన ఎన్నో శిల్పాలు, చిత్రాలు ఇక్కడ కనిపిస్తాయి. రామాయణ ఇతిహాసాన్ని శిల్పాల రూపంలో ఇక్కడ గోడలపై మలిచారు. అయితే ఇప్పడు అవి కనుమరుగైపోయాయి.

 చిత్రకూట

చిత్రకూట

చిత్రకూట ఉత్తరప్రదేశ, మధ్యప్రదేశ్ బార్డర్ లో ఉంది చిత్రకూట. 14 ఏళ్ల వనవాసం సమయంలో ఇక్కడ ఉన్న అడవిలో సీతారాములు నివసించారు. 14ఏళ్ల వనవాసం సమయంలో 11 ఏళ్లు ఇక్కడే నివసించారు సీతారాములు.

 పంచవటి

పంచవటి

పంచవటి హిందూ పురాణాల ప్రకారం రామాయణంలో పంచవటిని ప్రస్తావించారు. పంచవటి అనేది దండకారణ్యంలో ఒక ప్రాంతం. ఇక్కడే శ్రీరాముడు తన భార్య సీత, సోదరుడు లక్ష్మణుడితో కలిసి నివసించడానికి ఇల్లు నిర్మించుకున్నాడు. పంచవటి అంటే ఐదు మర్రిచెట్టు ఒకే చోట ఉండటం అని అర్థం.

 సీతాదేవి లవకుశలకు జన్మనిచ్చిన స్థలం

సీతాదేవి లవకుశలకు జన్మనిచ్చిన స్థలం

సీతాదేవి లవకుశలకు జన్మనిచ్చిన స్థలం బితూర్ బితూర్ అనే ప్రదేశం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని కాన్పూర్ నుంచి 30 మైళ్ళ దూరంలో ఉంది. ఈ ప్రదేశంలోనే వాల్మీకి ఆశ్రమం ఉంది. అంతే కాక సీతా దేవి లవకుశలను జన్మనిచ్చిన ప్రదేశం గా అభివర్ణిస్తారు. ఇక్కడే సీతాదేవి భూదేవిలో ఐక్యమైనది.

సీతారాములు నడిచిన ప్రాంతం

సీతారాములు నడిచిన ప్రాంతం

సీతారాములు నడిచిన ప్రాంతం ఆంధ్ర ప్రదేశ్ లోని ఖమ్మం జిల్లాలో భద్రాచలం ఒక చిన్న గ్రామం. రాముడు తన వనవాసం సమయంలో సీతా, లక్ష్మణులతో కలిసి ఇక్కడ కొంత కాలం నివసించాడు. ఈ ప్రదేశంలో సీతా రామ లక్ష్మణులు నడియాడిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది.

 ముక్తిదాం ఆలయం

ముక్తిదాం ఆలయం

ముక్తిదాం ఆలయం నాసిక్ రోడ్ లో ఉంది. ఈ ఆలయ ఆర్కిటెక్చర్ చాలా అద్భుతంగా ఉంటుంది. వైట్ మార్బుల్ తో దీన్ని నిర్మించారు. ఈ ఆలయంలో 18 అధ్యయాల భగవద్గీతతో కూడిన బొమ్మలు ఉన్నాయి. అలాగే 12 జ్యోతిర్లింగాల విగ్రహాలున్నాయి.

 కలరామ్ టెంపుల్

కలరామ్ టెంపుల్

ఇది రామాలయం. కలరామ్ అంటే నలుపు రాముడు అని అర్థం. ఈ ఆలయాన్ని ప్రతి యేటా వేలాది మంది సందర్శిస్తారు. ఇక్కడ ఉన్న 70 అడుగుల బ్లాక్ స్టోన్ స్ర్టక్చర్ చూడటానికే ప్రజలు ఆసక్తిచూపుతుంటారు.

సీతమ్మ దాహం తీర్చిన రాముడు

సీతమ్మ దాహం తీర్చిన రాముడు

సీతమ్మ దాహం తీర్చిన రాముడు సీతమ్మవారి దాహాన్ని రాముడు తీర్చిన ప్రదేశంగా చెప్పబడుతుంది కడపజిల్లా ఒంటిమిట్ట. ఈ క్షేత్రము ఏకశిలా నగరము అని ప్రసిద్ధి చెందినది. ఇక్కడ ఉన్న కోదండ రామాలయంలోని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్టించాడు. ఒకే శిలలో శ్రీరామున్ని సీతను లక్ష్మణుని ఇక్కడ చూడవచ్చు. ఈ దేవాలయంలో శ్రీరామ తీర్ధం ఉంది. సీత కోరిక ప్రకారం శ్రీ రాముడు రామ బాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని పురాణం చెబుతోంది.

రామగిరి ఖమ్మం జిల్లా రామగిరిలో

రామగిరి ఖమ్మం జిల్లా రామగిరిలో

సీతారాములు సంచరించిన రామగిరి ఖమ్మం జిల్లా రామగిరిలోనూ సీతారాముల ఆనవాళ్లున్నాయి. వనవాసం సమయంలో శ్రీరాముడు రామగిరిపై కొంతకాలం కుటీరం ఏర్పరుచుకుని సీతా లక్ష్మణులతో ఉన్నారని స్థానికులు చెబుతారు. సీతారామలక్ష్మణులు సంచరించినట్లు కొన్ని ఆనవాళ్ళు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఒక బండరాతిపై శ్రీరాముని పాదాలు, సీతాదేవి స్నానమాచరించిన కొలనుతోపాటు శ్రీరామునితో సంచరించిన ఆంజనేయుడి విగ్రహం కూడా ఉంది.

 త్రయంభకేశ్వర్

త్రయంభకేశ్వర్

ఇండియాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో త్రయంభకేశ్వర్ ఒకటి. అంతేకాదు 12 జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగం ఇక్కడ ఉండటం విశేసం. నాసిక్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంటుంది. ఈ ఆలయం దర్శించిన తర్వాత మోక్షం కలుగుతుందని భక్తులు నమ్ముతారు.

కపలేశ్వర ఆలయం

కపలేశ్వర ఆలయం

కపలేశ్వర ఆలయం నాసిక్ లో ఉన్న పురాతన ఆలయాల్లో కలపేశ్వర ఆలయం ఒకటి. ప్రతి శివాలయంలో నంది విగ్రహం ఉంటుంది. కానీ ఇక్కడ నంది ఉండదు. అదే ఇక్కడి ప్రత్యేకత.

అగ్నిపరీక్ష జరిగిన ప్రదేశం:

అగ్నిపరీక్ష జరిగిన ప్రదేశం:

రామాయణంలో ఒక ఘట్టం సీతమ్మ తల్లి ఎదుర్కొన అగ్ని పరీక్ష. ఇది శ్రీలంకలోని ‘దివురంపొలా' అనే ప్రాంతంలో జరిగిందంట. ఎక్కడైతే తను ఈ పరీక్షకు సిద్దపడాల్సి వచ్చిందో, సరిగ్గా అక్కడే ఒక పెద్ద చెట్టు కూడా ఉంటుందట. కేవలం ఇవే కాక భద్రాచలంలోనూ కొన్నింటిని రామయణ కాలంనాటి చిహ్నాలుగా పేర్కొంటారు. సీతమ్మ తల్లి నార చీరను అక్కడి కొండపై ఆరేసిన గుర్తులు, సీతారాములు నివసించిన పర్ణశాల...ఇవన్నీ రామాయణం నిజంగానే జరిగిందనడానికి నిలువెత్తు సాక్ష్యాలే అంటున్నాయి పురాణాలు...!

Desktop Bottom Promotion