Latest Updates
-
మీరు ఏ వంట నూనె వాడతారు.. ఆరోగ్యానికి ఎక్కువ ఏది మేలు చేస్తుందో తెలుసా.? -
ఆన్లైన్లో విపరీతంగా ఆభరణాలు కొంటున్నారా.. 'మెరిసే' నగలతో మోయలేని ఆరోగ్య సమస్యలు.! -
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.! -
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.!
దహన సంస్కారాలకు మహిళలను ఎందుకు నిషేధించారు ?
హిందూ సంప్రదాయాలు కొన్ని ఎవరికీ అంతుచిక్కవు. ఎందుకు ? ఎలా ? అన్న సందేహాలు క్రియేట్ చేసేవి ఎక్కువగా ఉంటాయి. అందులో ఇప్పుడు ఒక సంప్రదాయం గురించి చర్చించుకుందాం. అంత్యక్రియలకు, స్మశానాలకు మహిళలకు అసలు ప్రవేశమే లేదు. ఎందుకు దహన సంస్కారాలకు మహిళలను దూరంగా పెట్టారు ? దీనివెనక ఉన్న రహస్యం ఏంటి ? తెలుసుకోవాలనుందా ?
మనిషి చనిపోతే కడసారి చూపుకోసం కూడా ఆడవాళ్లకు స్మశానవాటికలోకి ప్రవేశం లేదు. దహన సంస్కారాలకు మహిళలు దూరంగా ఉండాల్సిందే. చితికి నిప్పు పెట్టడానికి కూడా మహిళలకు అసలు హక్కు లేదు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా హిందూ సంప్రదాయం ప్రకారం మహిళలకు ఈ దహన సంస్కారాలు నిర్వహించడానికి నిషేధించారు.
ఎందుకు ? ఈ విషయం తెలుసుకోవడానికి అధ్యయనాలు కూడా జరిగాయి.

మహిళలు అంత్యక్రియలు ఎందుకు నిర్వహించరాదు ?
ప్రస్తుతం ఒకవేళ చనిపోయిన వాళ్లకు మగపిల్లలు లేకపోయినా.. వాళ్ల కుటుంబంలో ఎవరూ మగవాళ్లు లేకపోయినా.. పెద్దవాళ్లంతా కలిసి చర్చించుకుని.. దగ్గరి బంధువులు లేదా బాగా అన్యోన్యంగా ఉండేవాళ్ల ద్వారా చితికి నిప్పు పెట్టిస్తారు. కూతురు, భార్య చితికి నిప్పు పెట్టే అవకాశం లేదు.

మహిళలు అంత్యక్రియలు ఎందుకు నిర్వహించరాదు ?
హిందూ సంప్రదాయంలో అనేక విషయాల్లో మహిళలకు నిషేధం ఉంది. కొన్ని ఆలయాల్లోకి వెళ్లకూడదు, అలాగే గర్భగుడి ప్రవేశం ఉండదు, అలాగే కొన్ని పూజా కార్యక్రమాలకు, అలాగే చితికి నిప్పు పెట్టడానికి, శవాలను మోయడానికి, స్మశానానికి వెళ్లడానికి అనుమతించరు. ఇలాంటి సంప్రదాయాలెన్నో సమాధానం లేని ప్రశ్నలు. కానీ స్మశానంకు మహిళలను నిషేధించడం వెనక ఆసక్తికర నిజాలు, నమ్మకాలున్నాయి.

మహిళలు అంత్యక్రియలు ఎందుకు నిర్వహించరాదు ?
ఎక్కడా మహిళలు తమకు అత్యంత ప్రీతికరమైన వాళ్ల శవాలను కూడా మోయడానికి అవకాశం ఇవ్వరు. అంత్యక్రియలలో భాగంగా.. శవయాత్రలో పాల్గొనడానికి కూడా అంగీకరించరు.

మహిళలు అంత్యక్రియలు ఎందుకు నిర్వహించరాదు ?
మహిళలను అంత్యక్రియల్లో పాల్గొనడానికి నిషేధించడంపై పురాణాల ఆధారంగా స్టడీ చేశారు. అయితే.. మహాభారతం సమయంలో.. వాస్తవానికి మహిళలు ఈ అంత్యక్రియల్లో పాల్గొనేవారట. భీష్ముడి అంత్యక్రియల్లో కౌరవులు, పాండవులతో పాటు.. మహిళలు కూడా పాల్గొన్నట్లు ఈ అధ్యయనాల్లో కనుగొన్నారు.

మహిళలు అంత్యక్రియలు ఎందుకు నిర్వహించరాదు ?
ఇంటిని, పిల్లలను, ఈ కార్యక్రమానికి వచ్చిన బంధువులను చూసుకోవడం కోసం ఈ అంత్యక్రియలకు మహిళలను నిషేధించారనే ఒక నమ్మకం ఉంది.
మగవాళ్లు అంత్యక్రియలకు వెళ్లినప్పుడు మహిళలు ఇంటి బాధ్యతలు తీసుకోవడానికి ఇలా నిర్ణయించారని చాలామంది భావిస్తారు.

మహిళలు అంత్యక్రియలు ఎందుకు నిర్వహించరాదు ?
పూర్వం మరణానికి, స్వర్గానికి కొడుకుని వారధిలా భావించేవాళ్లు. చనిపోయిన వాళ్ల అంత్యక్రియలు, వాళ్ల చితికి నిప్పు పెట్టే ప్రక్రియ కొడుకు నిర్వహిస్తే.. చనిపోయిన వాళ్లు స్వర్గానికి వెళ్తారని ఒక నమ్మకం ఉండేది. అందుకే కొడుకు లేదా కొడుకుతో సమానమైనవాళ్లతో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

మహిళలు అంత్యక్రియలు ఎందుకు నిర్వహించరాదు ?
గతంలో మహిళలు చాలా సున్నితమైన వాళ్లు అని, వాళ్లు చాలా త్వరగా భావోద్వేగానికి గురవుతారని భావించేవాళ్లు. అందుకే.. ఈ అంత్యక్రియలు, చితికి నిప్పు పెట్టే ప్రక్రియ చూసి వాళ్లు తట్టుకోలేరని.. అందుకే వాళ్లను ఈ కార్యానికి దూరంగా పెట్టారని అధ్యయనాలు చెబుతున్నాయి.

మహిళలు అంత్యక్రియలు ఎందుకు నిర్వహించరాదు ?
మరో షాకింగ్ నమ్మకం కూడా దీనివెనక ఉంది. అంత్యక్రియల సమయంలో.. మంచి, చెడూ రెండూ స్మశానంలో ఉంటాయట. అయితే మహిళలు సున్నితంగా ఉంటారు కాబట్టి.. వాళ్లను ఎక్కువ టార్గెట్ చేసే అవకాశముందని.. స్మశాన వాటికలోకి మహిళలను నిషేధించే సంప్రదాయం తీసుకొచ్చారు మన పూర్వీకులు. అంటే అంత్యక్రియల సమయంలో దయ్యాలు మహిళలను చాలా త్వరగా, తేలికగా ఆకర్షిస్తాయని భావించి ఈ ఆచారం తీసుకొచ్చారని చెబుతారు.



Click it and Unblock the Notifications