Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
మీరు కనీసం ఊహించుకోలేని వింతైన అంత్యక్రియలు
మరణాన్ని తప్పించుకోలేము.హాయిగా జీవితాంతం సుఖంగా బ్రతికి అనాయాస మరణం పొందినవారు అదృష్టవంతులనచ్చు.ఈరోజు మేము మీకు ప్రపంచం నలుమూలల్లో జరిగిన వింతైన అత్యక్రియల గురించి పంచుకోబోతున్నాము.అత్యక్రియలని ఇలా విభిన్నంగా నిర్వహించడం వల్ల వారు ఎప్పటికీ గుర్తుండిపోతారు.ఆప్తుల అంత్యక్రియలు విభిన్న రకాలుగా నిర్వహించడం సరికొత్త ట్రెండ్.ఇలా చెయ్యడం ద్వారా ఆప్తులని కోల్పోయినవారి దుకః కాస్తైనా ఉపశమించి, మరణించినవారు తమని ఎంతగా ప్రేమించేవారో గుర్తుంచుకోగలరు.
మరణించిన వారి వృత్తి లేదా ఇష్టానికనుగుణంగా అంత్యక్రియలని డిజైన్ చెయ్యడం ద్వారా ఫ్యునెరల్ హోంస్ బాగా సంపాదిస్తున్నాయి. గ్యాంబ్లర్లు, అంబులెన్స్ డ్రైవర్, ర్యాపర్ ఇలా విచిధ వృత్తులలో ఉన్నవారు మరణించినప్పుడు వారి అంత్యక్రియలు ఎలా జరిపారో మేము మీకు తెలియచేస్తున్నాము.
మరింక ఆలశ్యమెందుకు, ఈ విభిన్న రకాల అంత్య క్రియల గురించి చదవండి మరి. ఇది చదివాకా మీకూ మీ అంత్య క్రియలు ఇలా ఉండాలి అని అనిపించవచ్చు కూడా.
క్రిస్టోఫర్ రివేరా అమోరా:బాక్సింగు ని అమితంగా ప్రేమించిన ఒక క్రీడాకారుడికి ఇంత కన్న ఘనమైన వీడ్కోలు ఉంటుందా?? అతని శవం చేతికి బాక్సింగ్ గ్లవ్స్ తొడిగి తల వంచి బాక్సింగు రింగులో నిలబడ్డ రీతిలో నిలబెట్టారు.

చాడిల్ డెఫీ:
ఒక కారు యాక్సిడెంటులో మరణించిన డెఫీని ఆమెకి కాబోయే భర్త ఆమె శవాన్నే పెళ్ళాడి, ఆమెని తన వెడ్డింగ్ గౌనుతోనే పూడ్చిపెట్టాడు. ఆహా ఎంత ప్రేమించాడో కదా ఆమెని.

ఎడ్గార్డో వెలాజ్‌క్వెజ్:
అంబులెన్స్ డ్రైవరుగా పని చేసిన ఇతను తన పనిని అమితంగా ప్రేమించేవాడు.రోగులని ఆసుపత్రులకి చేర్చడంలోనే ఇతనికి ఆనందం ఉండేది. అలాంటి మనిషి మరణించాకా అతని అంబులెన్స్‌లోనే కూర్చోబెట్టారు పూడ్చిపెట్టేముందు.

డేవిడ్ మొరాలెస్:
22 సంవత్సరాలా ఈ మోటార్ బైకర్ ని తన సూపర్ బైకుతో పాటే పూడ్చిపెట్టారు.ఇతనికి సాధారణ రీతిలో జరిగే అంత్యక్రియలంటే ఇష్టం ఉండేది కాదు. అందుకే మరణించాకా అతని బైక్ మీదే శవాన్ని మూడు రోజులపాటు ప్రదర్శనకి ఉంచి బైకుతో సహా పూడ్చి పెట్టారు.

యేంజెల్ పెంటోజా మెడీనా:
24 సంవత్సరాలా ఈ యువకుడిని కాల్చి చెరువులో పారేసారు.చనిపోయిన తన కొడుకుకి ఆఖరుసారిగా ఏదైనా ఇవ్వాలనుకుంది అతని తల్లి.అందుకే అతని శవానికి ర్యాపర్ లాగ దుస్తులు వేసి క్యాప్ పెట్టారు.ఇలా చెయ్యడం ద్వారా తన కొడుకు ఆనందంగా నిల్చుని ఉన్నాడని ప్రపంచానికి చాటింది ఆ తల్లి.

బిల్లీ స్టాండ్లీ:
82 సంవత్సరాల వయసులో ఊపిరి తిత్తుల క్యాన్సరుతో మరణించిన ఈ పెద్ద మనిషిని తన హార్లీ డేవిడ్‌సన్ బైకుతో సహా పూడ్చిపెట్టారు.

జీసస్ డియాజ్ బేటో:
24 సంవత్సరాల ఈ యువకుడి మీద 15 సార్లు కాల్చడంవల్ల మరణించాడు.అతని కుటుంబం అతనికి ఘనంగా వీడ్కోలు ఇవ్వదలచి ఒక కుర్చీ మీద కూర్చుని తన చుట్టూ ఉన్నవారిని చూస్తున్నట్లుగా అతని దేహాన్ని అమర్చారు. చూసేవారికి అది అసలు అంతిమ యాత్రలాగ కాకుండా జీవించి ఉన్న మనిషి తన చుట్టూ ఉన్నవారిని తదేక దృష్టితో చూస్తున్నట్లుంది.



Click it and Unblock the Notifications
