Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
మీ రాశి ప్రకారం మీకున్న బలమైన కోరికలు ఏంటి..??
ప్రతి ఒక్కరూ తమ గురించి తమకు చాలా బాగా తెలుస్తుంది. మన గరించి మనం తెలుసుకోవడానికి లిమిట్ అంటూ ఉండదు. అలాగే.. మన చుట్టూ ఉన్నవాళ్ల గురించి కూడా తెలుసుకోవాలి. మన చుట్టు ఉన్న వాళ్ల గురించి గమనిస్తుంటాం.
అలవాట్లు, యాక్టివిటీస్, వ్యక్తిత్వం, కోరికలు వంటివి తెలుసుకుంటూ ఉంటాం. ఇలాంటి విషయాలన్నింటినీ.. ఆస్ట్రాలజీ చాలా బాగా వివరించింది. ఇది చాలా లాజికల్ గా.. వివరించింది. ఏ రాశి వాళ్ల ఇష్టాలు ఎలా ఉంటాయి, ఏ రాశి వాళ్లు దేనికి ఎక్కువ ఎట్రాక్ట్ అవుతారో వివరించింది.

మేషరాశి
మేషరాశి వాళ్లు చాలా ధైర్యవంతులు, దూకుడు స్వభావం కలిగి ఉంటారు. వీళ్లకు షాపింగ్ అంటే ఎక్కడలేని పిచ్చి. కొత్తవాటిని పొందాలనే కోరిక వీళ్లలో ఎక్కువగా ఉంటుంది.

వృషభ రాశి
వృషభ రాశి వాళ్లకు స్టామినా ఎక్కువ. వీళ్లు లగ్జరీగా ఉండాలని.. డబ్బులు ఎక్కువగా ఉండాలని కోరుకుంటారు.

మిధున రాశి
మిధున రాశి వాళ్లు స్టైలిష్ గా ఉండటానికి చాలా ఇష్టపడతారు. అలాగే డివైజెస్ కి ఎక్కువ ఎట్రాక్ట్ అవుతారు.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వాళ్లు సక్సెస్ పొందాలని.. చాలా గట్టి కోరిక ఉంటుంది. దాన్ని సాధించడం కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధపడతారు.

సింహరాశి
ఆధిపత్యం సాధించాలనే కోరిక సింహరాశి వాళ్లలో చాలా ఎక్కువగా ఉంటుంది.

కన్యారాశి
కన్యారాశి వాళ్లు ఖచ్చితత్వాన్ని కోరుకుంటారు. వీళ్లు చాలా క్రమశిక్షణతో ఉంటారు.

తులారాశి
తులారాశి వాళ్లు చాలా తెలివైనవాళ్లు. లైఫ్ ని చాలా బ్యాలెన్స్ చేస్తారు. ఎప్పుడూ.. టేస్టీగా ఉండే వాటిని పొందాలని కోరుకుంటారు.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వాళ్లు చాలా పాజిటివ్ గా, ధైర్యంగా ఉంటారు. వీళ్లు లాయల్టీ పొందాలనే కోరిక బలంగా ఉంటుంది. నాలెడ్జ్ పొందాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది.

ధనస్సు రాశి
ధనస్సు రాశి వాళ్లు ఎప్పుడు సాహసాలు చేయడానికి, ఆత్మ గౌరవంపై ఎక్కువ ఆసక్తి ఉంటుంది.

మకర రాశి
మకరరాశి వాళ్లు డబ్బు కోసం, పవర్ కోసం.. చాలా కష్టపడతారు. డబ్బు సంపాదన, పదవి పొందడమే.. వీళ్లకున్న పెద్ద కోరికలు.

కుంభరాశి
కుంభ రాశి వాళ్లు చాలా రెబల్ గా ఉంటారు. క్రియేటివిటీపై ఎక్కువ ఆసక్తి ఉంటుంది. వీళ్లు చాలా ఇమాజినేటివ్ గా ఉంటారు.

మీన రాశి
మీనరాశి వాళ్లు.. పగటికలలు కంటారు. ప్రపంచంలోనే అందమైన, పర్ఫెక్ట్ ప్రాంతం కావాలని కోరుకుంటారు. కొన్నిసార్లు బ్యాడ్ హ్యాబిట్స్, అన్ హెల్తీ హ్యాబిట్స్ పై కోరిక ఉంటుంది.



Click it and Unblock the Notifications
