ప్రపంచ దేశాల జెండాల వెనక దాగున్న ఆసక్తికర రహస్యాలు..!!

By Swathi

ప్రతి దేశానికి ఒక్కో జెండా ఉంటుంది. ఆయా దేశాల సంప్రదాయాలు, విశిష్టత, గొప్పదనం, కులమతాలను ప్రతిబింబించేలా జాతీయ జెండాలు రూపొందించబడి ఉంటాయి. అయితే కొన్ని దేశాల జెండాలు.. యుద్ధభూమి నుంచి పుట్టుకొస్తాయి. అలాంటి జెండాలను చూడగానే.. దేశప్రజలంతా గర్వపడేలా ఉంటాయి.

జెండాలపై ఉండే గుర్తులు, రంగులు, ఆకారాలు రూపొందించడానికి రూపకర్తలు కొన్నేళ్లపాటు కష్టపడి నిర్ణయిస్తారు. అలాగే.. దేశాన్ని గుర్తుపట్టే విధంగా జాతీయ జెండాలు రూపొందిస్తారు. మరి వివిధ దేశాల జాతీయ జెండాలు, వాటి వెనక దాగున్న అసలు రహస్యాలేంటో ఇప్పుడు చూద్దాం..

ఇండియా

ఇండియా

మన జాతీయ జెండాను త్రిరంగ అని పిలుస్తారు. అంటే.. మూడు రంగుల జెండా అని అర్థం. భారత జాతీయ జెండా.. మూడు ముఖ్యమైన మతాలను సూచిస్తుంది. నారింజ రంగు హిందువులు, ఆకుపచ్చ రంగు ముస్లింలు, తెలుపు రంగు.. రెండు మతాల మధ్య శాంతి ఉండాలని సూచిస్తుంది.

జాతీయ జెండా

జాతీయ జెండా

అలాగే నారింజ రంగు ధైర్యం, త్యాగాన్ని సూచిస్తే.. తెలుపు రంగు సత్యం, స్వచ్ఛతని సూచిస్తుంది. ఆకుపచ్చ రంగు.. విశ్వాసం, సంతానోత్పత్తి, మంచి లక్షణాలను సూచిస్తుంది. ఇక జెండా మధ్యలో ఉండే చక్రం.. జీవిత చక్రాన్ని సూచిస్తుంది. చక్రం మధ్యలో ఉండే 24 గీతలు.. రోజులో ప్రతి గంటకు ప్రతీకలు. 1947 జూలై 22న జాతీయ జెండా రూపొందింది.

యూనైటెడ్ కింగ్ డమ్ ఫ్లాగ్

యూనైటెడ్ కింగ్ డమ్ ఫ్లాగ్

యూనైటెడ్ కింగ్ డమ్ ఫ్లాగ్ ని యూనియన్ ఫ్లాగ్, ఫ్లాగ్ ఆఫ్ ది యూకే, యూనియన్ జాక్ అని పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే పాత జెండాలలో ఒకటి. మూడు వేర్వేరు జెండాల కలయిక ఇది. మూడు దేశాలను ప్రతిబింబిస్తాయి.

బ్రిటీష్ జెండా

బ్రిటీష్ జెండా

ఇంగ్లాండ్ - వేల్స్, స్కాట్లాండ్ - నార్తన్ ఐర్లాండ్ దేశాలను సూచిస్తాయి. ఇంగ్లాండ్ - వేల్స్ దేశానికి ఎరుపు రంగు, స్కాట్లాండ్ కి వైట్ కలర్ బ్లూ బ్యాక్ గ్రౌండ్, నార్తన్ ఐర్లాండ్ కి వైట్ బ్యాక్ గ్రౌండ్ లో రెడ్ కలర్ క్రాస్ గుర్తు సంకేతం. బ్రిటీష్ ఫ్లాగ్.. 1801 జూన్ 1 న స్వీకరించబడింది.

బాంగ్లాదేశ్

బాంగ్లాదేశ్

బాంగ్లాదేశ్ జెండా గ్రీన్ బ్యాక్ గ్రౌండ్ లో రెడ్ సర్కిల్ తో ఉంటుంది. రెడ్ కలర్ ఉదయించే సూర్యుడిని, దేశ స్వాతంత్ర్యం కోసం.. త్యాగం చేసిన ప్రజలను సూచిస్తుంది. గ్రీన్ కలర్ దేశంలో పచ్చదనం, తేజమును సూచిస్తుంది. బాంగ్లాదేశ్ జెండాలో ఉండే ఎరుపు రంగు సర్కిల్ ఎడమవైపు గా ఉంటుంది. కానీ.. అది ఎగురుతున్నప్పుడు మధ్యలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ జెండాను 1972 జనవరి 17న స్వీకరించబడింది.

నేపాల్ జెండా

నేపాల్ జెండా

కేవలం నేపాల్ ఫ్లాగ్ మాత్రమే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అన్ని దేశాల జెండాలు దీర్షచతురస్రంగా ఉంటే.. కేవలం నేపాల్ ది మాత్రం ఈ ఆకారంలో ఉండదు. నేపాల్ జాతీయ జెండా రెండు త్రిభుజాల మాదిరిగా కనిపిస్తుంది. ఇవి హిమాలయ పర్వతాలను సూచిస్తాయి.

నేపాల్ జాతీయ జెండా

నేపాల్ జాతీయ జెండా

అలాగే రెండు ప్రధాన మతాలైన హిందుత్వం, బుద్ధిజాన్ని ప్రతిబింబిస్తాయి. నీలి రంగులో ఉండే గీత దేశంలోని ప్రశాంతతను సూచిస్తుంది. చంద్రుడు, సూర్యుడి ఆకారాలు.. రాయల్ ఫ్యామిలీ, ప్రధాన మంత్రి కుటుంబాన్ని సూచిస్తాయి. ఈ జాతీయ జెండాను 1962 డిసెంబర్ 12న స్వీకరించారు నేపాలీయులు.

అమెరికా ఫ్లాగ్

అమెరికా ఫ్లాగ్

అమెరికా జెండా.. 13 స్ట్రిప్స్ ని కలిగి ఉంటుంది. ఈ 13 కాలనీలను సూచిస్తాయి. 50 స్టార్స్, 50 రాష్ట్రాలను సూచిస్తాయి. ఎరుపురంగు పుష్టి, ధైర్యాన్ని, బ్లూ కలర్ విజిలెన్స్, న్యాయాన్ని, తెలుపు రంగు స్వచ్ఛత, అమాయకత్వాన్ని సూచిస్తాయి. ఈ జెండాను 1777 జూన్ 14న స్వీకరించారు.

మలేషియా ఫ్లాగ్

మలేషియా ఫ్లాగ్

14 రెడ్, వైట్ కలర్ స్ట్రీప్స్, స్టార్ లో ఉండే 14 వంపులు.. 13 రాష్ట్రాలు, ఫెడరల్ డిస్ట్రిక్ట్ అయిన కౌలాలంపూర్ ని సూచిస్తాయి. అలాగే అన్ని రాష్ట్రాల సమానత్వాన్ని సూచిస్తాయి.

మలేషియా ఫ్లాగ్

మలేషియా ఫ్లాగ్

నెలవంక, స్టార్ గుర్తులు.. దేశంలో ముఖ్యమైన మతం ఇస్లామ్ కి ప్రతీక. పసుపు రంగు.. దేశం యొక్క సంప్రదాయ రంగు. నీలిరంగు దీర్షచతురస్రాన్ని యూనియన్ ఫ్లాగ్ ద్వారా స్వీకరించారు. ఈ జాతీయ జెండాను 1950 మే 26న స్వీకరించారు.

అర్జెంటీనా ఫ్లాగ్

అర్జెంటీనా ఫ్లాగ్

అర్జెంటీనా ఫ్లాగ్ లో కనిపించే బ్లూ బ్యాండ్స్ క్లియర్ స్కైని సూచిస్తే.. వైట్ కలర్ మంచుకి ప్రతీక. మనిషి ముఖంలా ఉండే సూర్యుడి ఆకారాన్ని సన్ ఆఫ్ మే అని పిలుస్తారు. ఇది దేశ స్వతంత్రతను సూచిస్తుంది. ఈ జెండా.. 1812 ఫిబ్రవరి 27 న స్వీకరించారు.

నార్త్ కొరియా

నార్త్ కొరియా

బార్డర్ లో ఉండే రెడ్ కలర్ కమ్యునిజం, విప్లవాన్ని సూచిస్తాయి. రెండు బ్లూ కలర్ స్ట్రిప్స్ సార్వభౌమాధికారం, చిన్న వైట్ బ్యాండ్స్ స్వచ్ఛతను సూచిస్తాయి. రెడ్ స్టార్ కమ్యునిస్ట్ ఫిలాసఫీ, వైట్ సర్కిల్ యున్ యాంగ్ ఫిలాసఫీని సూచిస్తాయి. ఈ జాతీయ జెండాను 1948 సెప్టెంబర్ 8న స్వీకరించారు.

ఫ్రాన్స్ ఫ్లాగ్

ఫ్రాన్స్ ఫ్లాగ్

దీన్ని ఫ్రెంచ్ ట్రైకలర్ ఫ్లాగ్ అని పిలుస్తారు. రెడ్, వైట్ కలర్ ఉంటుంది. వైట్ ట్రెడిషనల్ కలర్, ఫ్రెంచ్ రాయల్టీ, రెడ్, బ్లూ కలర్ పారిస్ భావగీతానికి ప్రతీక. రెడ్, వైట్, బ్లూ కలర్స్ స్వేచ్ఛ, సమానత్వం, కూటమిని సూచిస్తాయి. ఈ జాతీయ జెండాను 1794 ఫిబ్రవరి 15న స్వీకరించబడింది.

చైనా ఫ్లాగ్

చైనా ఫ్లాగ్

చైనా జాతీయ జెండాలో ఉండే నాలుగు చిన్న స్టార్స్ చైనీస్ సమాజంలో సాంఘిక జాతులను, వర్కింగ్ క్లాస్, పీసెంట్రీ, అర్బన్ ప్రిటీ, నేషనల్ బోర్గోజీ ని సూచిస్తాయి. పెద్ద గోల్డ్ కలర్ స్టార్, రెడ్ కలర్ కమ్యునిస్ట్ విప్లవాన్ని సూచిస్తాయి. ఈ ఫ్లాగ్.. 1949 అక్టోబర్ 1 స్వీకరించబడింది.

మెక్సికో ఫ్లాగ్

మెక్సికో ఫ్లాగ్

మెక్సికన్ ఫ్లాగ్.. గ్రీన్, వైట్, రెడ్ కలర్లతో మూడు స్ట్రిప్స్ కలిగి ఉంటుంది. గ్రీన్ సంతోషం, ఆశను సూచిస్తాయి. వైట్ ప్రశాంతత, మతాన్ని, రెడ్ కలర్ దేశ స్వతంత్య్రాన్ని సూచిస్తుంది. వైట్ స్ట్రిప్ పై ఉండే సింబల్ వారసత్వాన్ని సూచిస్తుంది. ఈ ఫ్లాగ్ ని 1968 సెప్టెంబర్ 16న స్వీకరించారు.

Story first published: Thursday, July 7, 2016, 12:15 [IST]
Desktop Bottom Promotion