Latest Updates
-
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.?
గతంలో సంభవించిన అత్యంత దారుణమైన ప్రకృతి విపత్తులు
మనం శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంత అభివృద్ధి చెందినా కొన్ని ప్రకృతి విపత్తులు సంభవించకుండా ఆపలేము.ప్రకృతి ప్రకోపించాలని నిశ్చయించుకుంటే మనం భయపడాల్సిందే.
గతంలో సంభవించిన అత్యంత భయంకరమైన ప్రకృతి విపత్తుల గురించి ఈ ఆర్టికిల్ ద్వారా మీకు అందిస్తున్నాము.
వీటిని చూస్తే జీవితం క్షణ భంగురమనీ, కొన్ని సెకన్లలోనే జీవితం తలక్రిందులవుతుందనీ తెలుస్తుంది.అసలు ఈ విపత్తులు సంభవించినప్పుడు కొన్ని క్షణాలలో ప్రపంచమే ఎలా మారిపోతుందో చదవండి.మన చుట్టూ ఉన్నదంతా అశాశ్వతమనీ , ఇవనీ ఏ క్షణంలోనైనా శిధిలమయిపోతాయనీ మనకి ఈ విపత్తులని చూస్తే అర్ధమవుతుంది.
ప్రకృతి వైపరీత్యాల వల్ల కొన్ని కోట్ల జీవితాలు ఎలా మారిపోయాయో చూడండి,

హైతీ భూకంపం(2010):
జనవరి 12 , 2010 లో రిక్టర్ స్కేలు మీద 7.0 గా నమోదైన భూకంపం హైతీని కుదిపేసింది.1770 తరువాత హైతీలో సంభవించిన భూకంపాలలో ఇదే అత్యంత పెద్దది.ఇందులో దాదాపు 20,000 మంది చనిపోయారనీ 2 మిలియన్ల ప్రజలకి నిలువు నీడ లేకపోయిందనీ రిపోర్టులు తెలియచేస్తున్నాయి.

నర్గీస్ తుఫాను(2008):
హిందూ మహా సముద్రం ఉత్తర భాగంలో సంభవించిన తుఫానుల్లో ఇదే మొదటిది.దాదాపు 84,500 మంది ఈ తుఫాను వల్ల చనిపోయారు, 53,800 మంది ఆచూకీ గల్లంతయ్యింది.

పాకిస్తాన్ భూకంపం(2005):
రిక్టర్ స్కేలు మీద 7.5 గా నమోదైన ఈ భూకంపం ముజఫర్రబాద్ నగరానికి దగ్గర కాశ్మీరు కేంద్రంగా సంభవించింది.అధికారిక అంచనాల ప్రకారం 75,000 మంది చనిపోయారు, 106,000 మంది గాయపడ్డారు.

హరికేన్ కత్రీనా(2005):
2005 లో గల్ఫ్ తీరంలో సంభవించిన ఈ హరికేన్ అత్యంత దారుణమైనది.అమెరికాని తాకిన దారుణమైన హరికేనుల్లో ఇది ఆరవ స్థానాన్ని ఆక్రమిస్తుంది.

హిందూ మహా సముద్ర భూకంపం(2004):
9.15 గా నమోదైన ఈ భూకంపాని సుమాత్రా-అండమాన్ భూకంపని కూడా పిలుస్తారు. దీని తీవ్రతకి ఇండోనేషియా, శ్రీలంక, దక్షిణ భారత దేశం, థాయ్‌లాండు తీరాలలో దాదాపు 2 లక్షల నుండీ మూడు లక్షల పదివేల మంది ప్రాణాలు కోల్పోయారు.

సునామీ(2011):
మార్చ్ 11 2011 లో జపాన్ తూర్పు తీరాన్ని తాకిన సునామీ తాకిడికి 15 మిలియన్ల మంది చనిపోయారు. కనీసం 2814 మంది ఆచూకీ తెలియలేదు.జపాన్‌లో సంభవించిన భూకంపాలలో ఇదే అత్యంత పెద్ద భూకంపం.

న్యూజిలాండ్ భూకంపం(2011):
ఫిబ్రవరి 22 ,2011 లో సంభవించిన ఈ భూకంప తీవ్రత 6.3 గా నమోదయ్యింది. న్యూజిలాండ్‌లో రెండవ అతి పెద్ద నగరమైన క్రైస్ట్ చర్చ్ ఈ భూకంప తాకిడికి బాగా దెబ్బతింది. న్యూజిలాండులోని కాంటెర్‌బరీ రీజియన్ కూడా భూకంపం వల్ల దెబ్బ తిన్న ప్రదేశాల్లో ఒకటి.



Click it and Unblock the Notifications