Latest Updates
-
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.? -
పూజ గదిలో దీపం ప్రతిసారీ ఆరిపోతుందా.. మీ ఇంట్లో ఈ కష్టాలు తప్పవు.! -
రోజూ అవే చపాతీలు, రోటీలు తిని బోర్ కొట్టిందా? మట్కా రోటీ ఇలా చేస్తే పిచ్చెక్కించే టేస్ట్! -
స్వీట్, హాట్ తినాలనే కోరికలు విపరీతంగా ఉన్నాయా.. మీ బాడీలో ఈ లోపాలే కారణం.!
రాశి రహస్యాలు: కుంభ రాశిలో కనిపించే గుడ్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్..!!
ధనిష్ట 3,4 పాదములు, శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదములు మీ పేరులో మొదటి అక్షరము. గూ, గే, గో, సా, సీ, సు, సే, సో, దా అను అక్షరములలో ఒకటి అయినచో మీది కుంభరాశి.ధనిష్ట 3,4 పాదములు, శతభిషం 4 పాదాలు,
ధనిష్ట 3,4 పాదములు, శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదములు మీ పేరులో మొదటి అక్షరము. గూ, గే, గో, సా, సీ, సు, సే, సో, దా అను అక్షరములలో ఒకటి అయినచో మీది కుంభరాశి.
కుంభ రాశి వారికి ఆగష్టు వరకు జన్మము నందు కేతువు, సప్తము నందు రాహువు, ఆ తదుపరి అంతా షష్ఠమము నందు రాహువు, వ్యయము నందు కేతువు, సెప్టెంబరు 12వ తేదీ వరకు అష్టమము నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా భాగ్యము నందు జూన్ వరకు లాభము నందు శని, ఆ తదుపరి వక్ర గతిని అక్టోబరు వరకు రాజ్యము నందు, ఆ తదుపరి అంతా లాభము నందు సంచరిస్తాడు. 12 రాశుల్లో ఒకటైన కుంభ రాశివారికున్న మంచి చెడు గుణాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం...!

ఈ రాశివారి గోచారం పరీక్షించగా
ఈ రాశివారి గోచారం పరీక్షించగా "జిహ్వగ్రే వర్తతే లక్ష్మీః జిహ్వాగ్రే మిత్ర బాంధవా" అన్నట్లుగా మీ మంచి మాట, తీరు వల్ల ఎదుటివారిని తేలికగా ఆకట్టుకోగలుగుతారు. ప్రతి వ్యవహారం ఒకటి రెండుసార్లు ఆలోచించి మందుకుసాగిన మంచిది.

ముఖ్యుల పట్ల ఆరాధన పెరుగుతుంది
ముఖ్యుల పట్ల ఆరాధన పెరుగుతుంది. ఆదాయవృద్ధి కావడంతో పెట్టుబడులు, పొదువు పథకాలపై దృష్టిసారిస్తారు.

కుంభరాశి వారు చాలా అసాధారణంగా ఉంటారు
కుంభరాశి వారు చాలా అసాధారణంగా ఉంటారు. వీరి ఆలోచనా విధానం కూడా మిగితా రాశి వారి కన్నా భిన్నంగా ఉంటుంది.

కుంభరాశి వారు ఎంతో స్వతంత్రంగా జీవిస్తారు.
కుంభరాశి వారు ఎంతో స్వతంత్రంగా జీవిస్తారు. వీరికి పనులు ఎలా చేయించుకోవాలో బాగా తెలుసు. ఒకరి కోసం ఎదురు చూసి సమయాన్ని వృధా చేసుకోడం కన్నా సొంతంగా చేసుకోవడమే మేలు అని నమ్ముతారు.

ఎదుటి వ్యక్తిలో ఉన్న లోపాల్లో,
ఎదుటి వ్యక్తిలో ఉన్న లోపాల్లో, ఆ వ్యక్తి చేస్తున్న తప్పులలో కూడా అందాన్ని చూడగలుగుతారు కుంభరాశి వారు. మీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు.... కాని మిమ్మల్ని మార్చడానికి మాత్రం ప్రయత్నించరు.

కుంభరాశి వారు ఎక్కువగా ఆలోచిస్తారు.
కుంభరాశి వారు ఎక్కువగా ఆలోచిస్తారు. వారి ఆలోచనలో ద్వారా వచ్చే ఊహల్లో తెలిపోడానికి ఇష్టపడతారు. కొన్ని సార్లు చాలా క్రియేటివ్ గా, తెలివైన వారిలా అనిపిస్తారు. ఇంకొన్ని సార్లు ఎక్కువగా ఆలోచించడం వల్ల వెర్రి వాడిలా ప్రవర్తిస్తారు.

ప్రేమకు హద్దులు ఉండవు అనే దాన్ని గట్టిగా నమ్ముతారు
ప్రేమకు హద్దులు ఉండవు అనే దాన్ని గట్టిగా నమ్ముతారు కుంభరాశి వారు. ఒకే వ్యక్తిలో లవర్, బెస్ట్ ఫ్రెండ్ మరియు సోల్ మేట్ ఉండాలని కోరుకుంటారు.

కుంభరాశి వారికి నలుగురిలో కలిసిపోయే తత్వమున్నా..
కుంభరాశి వారికి నలుగురిలో కలిసిపోయే తత్వమున్నా.. వారు అలాంటి వారు కాదని అనుకుంటారు. వారు ఎలాగైతే ఉన్నారో అలానే ఉండడంలో సంతృప్తి పొందుతారు.

కుంభరాశి వారు మిమ్మల్ని ఏదో ఒకటి అడుగుతారు.
కుంభరాశి వారు మిమ్మల్ని ఏదో ఒకటి అడుగుతారు. దానికి మీరు సమాధానం ఇస్తున్నప్పుడు మధ్యలో బోర్ గా ఫీలవుతారు. అసలు వారు అడిగిన ప్రశ్నను కూడా మరచిపోతారు. అసలు దేని గురించి మాట్లాడుతున్నారో కూడా గుర్తుండదు.

కుంభరాశి వారికి వెటకారం చాలా ఎక్కువ.
కుంభరాశి వారికి వెటకారం చాలా ఎక్కువ. వీరి సెన్స్ అఫ్ హ్యుమర్ ని తట్టుకోవడం కాస్త కష్టం. కొన్ని సార్లు కడుపు చెక్కలయ్యేలా నవ్విస్తారు.

కుంభరాశి వారు ఎమోషన్స్ ని దాచిపెట్టేస్తారు.
కుంభరాశి వారు ఎమోషన్స్ ని దాచిపెట్టేస్తారు. వారి కన్నీటిని చూడటం చాలా అరుదు. ఒకవేళ చూస్తే ఏదో పెద్ద భాద పడుతున్నారనే అర్ధం.

కుంభరాశి వారికి కోపం వచ్చిందంటే సైలెంట్ గా ఉండిపోతారు.
కుంభరాశి వారికి కోపం వచ్చిందంటే సైలెంట్ గా ఉండిపోతారు. ఆ సమయంలో వారిని ఏమైందని అడగకుండా... దూరంగా ఉండటమే మంచిది.

వీరిలో లీడర్ క్వాలిటీస్ అమోగంగా ఉంటాయి.
కుంభరాశి వారికి వారు చెప్పాలనుకునే దానిపై గట్టి నమ్మకం ఉంటుంది. వీరిలో లీడర్ క్వాలిటీస్ అమోగంగా ఉంటాయి. ఒకరికి అనుచరుడిగా మారడం వీరికి అలవాటు ఉండదు.

సాధారణంగా కుంభరాశి వారికి ఎమోషన్స్ ఉండవని అనుకుంటారు.
సాధారణంగా కుంభరాశి వారికి ఎమోషన్స్ ఉండవని అనుకుంటారు. కాని లోలోతుల్లో ఎమోషన్స్ తో కూడిన తూఫాన్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తూ ఉంటుంది.



Click it and Unblock the Notifications