కొత్త ఇజం.. భయంకరమైన నిజాలు!

Written By: Bharath
Subscribe to Boldsky

ఈ ప్రపంచంలో చాలా మతాలున్నాయి. కొన్ని మతాలు ఎప్పుడు పుట్టాయో ఎవరికీ తెలియదు. చాలామతాలు మనుషులు ఆధ్యాత్మికతను పెంపొందించడానికి, నైతిక విలువలు పెంపొందించడానికి, సామాజిక అవసరాలను తీర్చటానికి పుట్టాయి. అయితే ప్రస్తుతం పరిస్థితులకు అనుగుణంగా చాలా కొత్త మతాలు పుడుతూనే ఉన్నాయి. వాటి విశ్వాసాలు చాలా భయంకరంగా ఉంటాయి. వీటిని అనుసరించే వారు కూడా చాలామందే ఉన్నారు. అలాంటి కొన్ని కొత్త మతాల గురించి తెలుసుకుందాం.

1. నువాయ్ బియానిజం

1. నువాయ్ బియానిజం

1970 లలో న్యూయార్క్ లో నల్లజాతీయుల ముస్లింల ద్వారా ఏర్పడిన మతం ఇది. డ్వైట్ యార్క్ అనే ఆయన ఈ మత రూపకర్త. ఈ మతానికి చెందిన వారు తెల్లజాతీయులు జాత్యహంకారానికి వ్యతిరేకంగా ప్రచారాలు చేస్తుంటారు. అలాగే ఏలియన్స్ కు వ్యతిరేకంగా వీరి బోధనలుంటాయి.

2. వ్యామ్ ప్రిజం

2. వ్యామ్ ప్రిజం

వాంపైర్లు అనే వారు ఈ భూమిపైనే ఉన్నారని కొందరు నమ్ముతారు. వాంపైర్లు అంటే రక్తపిశాచులు. వీరు జంతువులు, మనుషుల రక్తాన్ని తాగుతారు. వారిని నమ్మేవాళ్లే క్రియేట్ చేసిందే వ్యామ్ ప్రిజం. ఈ మతాన్ని అనుసరించే వారు 1000 కంటే ఎక్కువ మందే ఉన్నారు.

3. ఫ్రిస్ బీటారియానిజం

3. ఫ్రిస్ బీటారియానిజం

ఫ్రిస్ బీటారియానిజం అనే దాన్ని ప్రసిద్ధ కమెడియన్ జార్జ్ కార్లిన్ తీసుకొచ్చారు. మరణించిన తర్వాత ఆత్మ వాళ్ల ఇళ్లలోనే ఉంటుందని ఈ మత ఉద్దేశం. అయితే ఈ విషయాన్ని మాత్రం చాలామంది ఒప్పుకోరు. కానీ జార్జ్ కార్లిన్ మాత్రం ఆత్మ అలాగే ఉంటుందని నమ్ముతారు. దీన్ని ఫాలో అయ్యేవారు కూడా చాలామందే ఉన్నారు.

4. అగోరాలు

4. అగోరాలు

అగోరాలు ఈశ్వరుని భక్తులు. వీళ్ళు బూడిదనే దుస్తులుగా భావిస్తారు. మనిషి ఎముకలను వాళ్ల మెడ చుట్టూ అలంకరణకు ఉపయోగిస్తారు. పొడవైన జడలు, పెద్దగా పెరిగిన గోళ్లతో వీరు దర్శనమిస్తుంటారు. వీళ్లు నరభక్షకులు అని అంటుంటారు. వీళ్ల దివ్య దృష్టి ఉంటుందని అంటారు. క్రీ.శ 14 వ శతాబ్దం నుంచి ఈ సంస్కృతి హిందూ మతంలో ప్రారంభమైంది. కానీ వీరిని హిందువులు ఎవరూ కూడా విశ్వసించరు.

5. సైతానిజం

5. సైతానిజం

సైతానిజం లేదా సాతానిజం అనేది సైతానును ఆరాధించే వాళ్లు విశ్వసించేది. సాటానిజం అనేది వాస్తవానికి విశ్వాసము, స్వేచ్ఛచిత్తము, వ్యక్తిగతవాదాన్ని సూచిస్తుంది. 1966 లో సాతాను చర్చ్ స్థాపన తరువాత సాతానిజం అనేది ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. సాతానిజం అనుసరించే వారిని లుసిఫెరియన్లు, లావియన్లు అంటారు.

 6. రాలిజం

6. రాలిజం

క్లాడ్ వొరిల్లాన్ 1974 లో దీన్ని స్థాపించారు. ఇది యూఎఫ్ ఓ మతం. దీన్ని రాల్ అని కూడా పిలుస్తుంటారు. ఈ మతం ప్రకారం భూమిపై జీవనం అనేది ఎలోహిం ద్వారానే కొనసాగుతుందని నమ్ముతారు.

గ్రహాంతరవాసుల ద్వారానే భూమిపై మనుషులతో పాటు అన్ని జీవరాశుల సృష్టించబడినట్లు ఈ మతం వారు విశ్వసిస్తారు. ఈ మతాన్ని అనుసంచే వారు స్వస్తిక్ చిహ్నాన్ని శాంతి చిహ్నంగా భావిస్తారు.

7. పనావేవ్

7. పనావేవ్

ఇది జపనీయులకు చెందిన కొత్త మతం. దీన్ని 1200 మందిదాకా ఆచరిస్తుంటారు. ఈ భూప్రపంచాన్ని, ఇక్కడుండే వాతావరణాన్ని కొన్ని శక్తులు నాశనం చేస్తున్నాయని వీరి నమ్మకం. వీరి నాయకుడిని చంపడానికి కమ్యునిస్ట్ లు విద్యుదయస్కాంత తరంగాలను ఉపయోగించారని కూడా వీరు విశ్వసిస్తారు.

8. యూనివర్స్ పీపుల్

8. యూనివర్స్ పీపుల్

యూనివర్స్ పీపుల్ అనేది ఒక గ్రహాంతరవాసులను నమ్మే మతం. ఐవో బెండ దీన్ని 1997 లో రూపొందించారు. ఈ మతానికి చెందిన వారు ఏలియన్ష్ భూ కక్ష్య చుట్టూ తిరుగుతుంటారని, భూమిపై ప్రజలను చూడటానికి ఏలియన్స్ వస్తుంటారని వీరు నమ్ముతారు. అయితే ఈ మతాన్ని నమ్మేవారు రోజురోజుకు పెరిగిపోతున్నారు.

9. సైంటాలజీ

9. సైంటాలజీ

సైంటాలజీ ని రాన్ హబ్బర్డ్ 1952లో స్థాపించారు. ఇందుకు సంబంధించిన బోధనలు రహస్యంగా ఉంటాయి. సైన్స్ కు సంబంధించిన అనేక విషయాలను కూడా ఈ మతం వారు. వివరిస్తుంటారు.

10. పాస్టాఫేరిజమ్

10. పాస్టాఫేరిజమ్

ఈ మతస్తులు ఫ్లయింగ్ స్పఘెట్టి మాన్ స్టర్ ని ఆరాధిస్తుంటారు.

పరిణామ సిద్ధాంతాలతోపాటు, ఫ్లయింగ్ స్పఘెట్టి సిద్ధాంతం గురించి విద్యార్థులను బోధించాలని బాబీ హెండర్సన్ పాఠశాలలకు బహిరంగ లేఖను రాసినప్పటి నుంచి ఈ మతం కాస్త ప్రచారంలోకి వచ్చింది.

English summary

bizarre religions that actually exist around the world

Bizarre religions that actually exist around the world..You will be shocked to see these unusual religions.
Story first published: Wednesday, November 29, 2017, 18:30 [IST]
Subscribe Newsletter