ఆశ్యర్యం: ఒక మహిళ చెవిలోంచి వైద్యులు 30 ఈగ గుడ్లు బయటకి తీసారు!

By: DEEPTHI T A S
Subscribe to Boldsky

మానవశరీరం ఎలాంటిదంటే అతిచిన్న ప్రేరణకి కూడా స్పందిస్తుంది. ఉదాహరణకి,చిన్న చీమ కుట్టినా,సూది గుచ్చుకున్నా మనకి అసౌకర్యం తెలుస్తుంది. అయితే మరి ఒక ఈగ మీ చెవిలో దూరితే ఎలా వుంటుంది??

మీ చెవిలో ఈగ ఉండటం మీకు అసౌకర్యంగానే ఉంటుందని మాకు తప్పక తెలుసు. కానీ ఇలాంటి కేసులు ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతాయి.

ఇక్కడ చెవి నొప్పి వచ్చిన ఒక స్త్రీకి వైద్యులు పరీక్షించాక వారు హతాశులయ్యారు. ఎందుకంటే ఆమె చెవిలో బతికే ఉన్న ఈగ గుడ్లు పెరుగుతూ ఉన్నాయి !

చెవి నెప్పి వచ్చిన స్త్రీ

చెవి నెప్పి వచ్చిన స్త్రీ

చైనాలో నివసించే 70 ఏళ్ళ స్త్రీ తీవ్ర చెవి నెప్పితో బాధపడుతూ ఉండి, వైద్యులకి ఒక ఈగ చెవిలో దూరినప్పటి నుండీ అలా ఉందని తెలిపింది. ఆమె ఆ ఈగ చెవిలో ఇరుక్కుపోయిందని భావించింది.

ఆ ఈగ చేయాల్సిందల్లా చేసింది

ఆ ఈగ చేయాల్సిందల్లా చేసింది

ఆ ఈగ చెవిలోకి దూరి అక్కడ గుడ్లను పెట్టింది. ఆమె చెవిలో గుడ్లు పెరిగి చాలా అసౌకర్యం, నొప్పిని కలిగించాయి. వైద్యులు ఆమె చెవిని పరీక్షించి హతాశులయ్యారు.

కుటుంబం ఆమె నొప్పిని పట్టించుకోలేదు

కుటుంబం ఆమె నొప్పిని పట్టించుకోలేదు

మాకు తెలిసిన వివరాల ప్రకారం, పేషెంట్ క్రానిక్ సపోర్టివ్ ఓటిటిస్ మీడియా అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధిలో రోగి మధ్యచెవిలో భరించలేనంత నొప్పి ఉండి, చీము బయటకి స్రవిస్తుంది. కానీ ఆమె కుటుంబం ఈ ఈగ కథను పట్టించుకోకుండా వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్ళలేదు.

గుడ్లు మొత్తం పెరిగిపోయాయి

గుడ్లు మొత్తం పెరిగిపోయాయి

ఈగ ఆమె చెవిలోకి వెళ్ళి,గుడ్లు పెట్టి, అవి మొత్తం పెరిగిపోయాయి. వైద్యులు చెవిలోంచి వేలితో గుడ్లను తీయగలిగారు,అంత పూర్తిగా పెరిగిపోయాయి!

ఆమెకి ఎట్టకేలకి ఆపరేషన్ చేసారు

ఆమెకి ఎట్టకేలకి ఆపరేషన్ చేసారు

వైద్యులు ఎట్టకేలకు ఆమెకి ఆపరేషన్ చేసామని తెలిపారు. ఇప్పుడు ఆమె కోలుకుంటోంది. ఆమె త్వరగా కోలుకోవాలని మనం కూడా కోరుకుందాం!!

English summary

Doctors Removed 30 Maggots From A Woman's Ear!

A 70-year-old woman complained of ear pain and told the doctors that she felt a fly being stuck inside her ear. She was in severe pain, unless doctors checked in to find live maggots dwelling in her ear! She was operated immediately.
Subscribe Newsletter