For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సేమ్ టు సేమ్ సెలబ్రిటీలు

By Y Bharath Kumar Reddy
|

మనిషిని పోలిన మనుషులుంటారనే అందరూ అంటుంటారు. ప్రపంచంలో ఇలా ఏడుగురు ఉంటారని కూడా చెబుతుంటారు. ఇందులో నిజముందో లేదో కానీ సేమ్ టు సేమ్ అచ్చుగుద్దినట్లు ఉండే మనషులు మనకు చాలా చోట్ల ఇద్దరు వ్యక్తులైతే కనిపిస్తూనే ఉంటారు. సాధారణ వ్యక్తులు కాకుండా కొందరు సెలబ్రిటీలు కూడా అలాగే ఉంటారు. బాలీవుడ్ స్టార్స్ లో కొందరు సేమ్ హాలీవుడ్ స్టార్స్ లా ఉన్నారు. ఇక మన ఫేవరెట్ స్టార్ హాలీవుడ్ హీరో లేదా హీరోయిన్ లాగా కనిపిస్తే అంతకన్నా థ్రిల్లింగ్‌ ఇంకేముంటుంది. అలాంటి వాళ్లు బాలీవుడ్‌లో చాలామందే ఉన్నారు.. మీకూ చూడాలని ఉందా? బాలీవుడ్‌లో హీరోలు, హీరోయిన్లలో చాలామంది హాలీవుడ్ సెలబ్రిటీల మాదిరిగానే ఉన్నారు.

1. ఇలియానా కైరా నైట్లీ మాదిరిగా ఉంటారు

1. ఇలియానా కైరా నైట్లీ మాదిరిగా ఉంటారు

ఇలియానా డిసౌజా హాలీవుడ్ నటి కైరా నైట్లీలాంటి పోలికలతో ఉంటారు. ఇలియానాకు అందం పరంగా మంచి పేరుంది. ఆమె చిట్టినడుముకు లెక్కలేనంత మంది అభిమానులున్నారు. ఇల్లీ బేబీ ఎన్నో గ్లామరస్ పాత్రలతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. హాలీవుడ్ హాట్ హీరోయిన్లలో ఒకరైన కైరా నైట్లీ అక్కడ ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది. కైరా నైట్లీ బ్రిటీష్ యాక్ట్రస్. బెండ్ ఇట్ లైక్ బెక్హాం, పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ తదితర హాలీవుడ్ చిత్రాల్లో నటించారు. కైరా నైట్లీ తన పార్టనర్ జేమ్స్ రింగ్టన్‌ కలిసి 'సీకింగ్ ఎ ప్రెండ్ ఫర్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్' అనే సినిమాలో కూడా నటించారు. కాగా అంతక ముందు గతంలో కైరా నైట్లీ తన కోస్టార్ రూపర్ట్ ప్రెండ్‌తో డేటింగ్ చేసింది. కొన్ని మనస్పర్దల కారణంగా వీరిద్దరూ విడిపోయారు.

2. అలియా భట్ అరియానా గ్రాండే మాదిరిగా..

2. అలియా భట్ అరియానా గ్రాండే మాదిరిగా..

బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ అమెరికన్ పాప్ సింగర్ అరియానా గ్రాండే మాదిరిగా ఉంటారు. కుర్రకారును మత్తెక్కించే బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా భట్. డియర్ జిందగీ,టూ స్టేట్స్‌, హమ్టీ శర్మకి దుల్హనియా, కపూర్‌ అండ్‌ సన్స్‌, ఉడ్‌తా పంజాబ్‌ ఇలా భిన్నమైన సినిమాల్లో ఈమె నటించారు. బద్రీనాద్‌ కి దుల్హనియాలోనూ ఈమె నటించారు. అమెరికన్ పాప్ సింగర్ అరియానా గ్రాండే. యువ హృదయాలు పలికే అందమైన స్వరం, టీనేజర్ల కలల రూపం ఈమె. ఫ్లోరిడాలో ఆమె జన్మించారు. బాల్యంలోనే బీట్‌కు దగ్గరయ్యారు. పెరుగుతున్నకొద్దీ సొంత బాణీలను కట్టడం మొదలుపెట్టారు. 13 ఏళ్లకే నేషనల్‌ యూత థియేటర్‌ అసోసియేషన్‌ అవార్డుని గెలుచుకొన్నారు. ఆమె అందమైన రూపం, ఉచ్ఛారణ..చానెళ్ల నిర్వాహకులను ఆకర్షించాయి. అలా ఆమె చిన్న వయసులో టీవీ నటిగా మారారు. విక్టోరియస్‌ అనే టీవీ సీరియల్‌లో గ్రాండే నటన లక్షలాదిమందిని ఆమెకు అభిమానులుగా మార్చింది. స్పిన్-ఆఫ్, సామ్ అండ్ క్యాట్. అరియాన మ్యూజిక్ కెరీర్ డిస్క్రోగఫీవంటి వాటిలో నటించారు. మొత్తానికి అలియా అరియానా ఒకేరకంగా కనిపిస్తారు.

3. దియా మీర్జా - హేథర్ గ్రాహం

3. దియా మీర్జా - హేథర్ గ్రాహం

బాలీవుడ్ హీరోయిన్ దియా మిర్జా హీథర్ గ్రాహంలాగే ఉంటారు. దియా రహ్నా హై తేరే దిల్ మే సినిమాతో అరంగేట్రం చేశారు. పరిణిత, దస్, ఫైట్ క్లబ్ వంటి సినిమాలలో కూడా నటించారు. ఆసిడ్ ఫ్యాక్టరీ, లవ్ బ్రేక్అప్స్ జిందగీ, చిత్రాల్లోనూ నటించారు. ఈమె మోడల్, మిస్ ఆసియా పసిఫిక్ 2000 విన్నర్ కూడా. సెక్సీ హాలీవుడ్ హీరోయిన్ హీథర్ గ్రాహం ఈమె పోలికల్లో ఒకేరకంగా ఉంటారు. ఈమె ఫెలిసిటీ షాగ్వెల్ పాత్రలో బ్లాక్ బస్టర్ మూవీస్ అయిన ఆస్టిన్ పవర్స్, ది స్పై హూ షగ్డ్ మీలోనూ నటించారు. దియా హేథర్ ఒకేలా కనిపిస్తారు.

4. రణబీర్ కపూర్ - రేయాన్ గోస్లింగ్

4. రణబీర్ కపూర్ - రేయాన్ గోస్లింగ్

బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ రేయాన్ గోస్లింగ్ లాగా కనిపిస్తారు. పలుహిట్ సినిమాలతో బాలీవుడ్ లో తనకంటూ ఒక రేంజ్ తెచ్చుకున్న రణబీర్ చూడడానికి హాలీవుడ్ హీరోలా ఉంటారు. రియాన్ కెనడియన్ నటుడు. సంగీత కళాకారుడు. ఇతను ఇవా మెండేజ్ ను వివాహం చేసుకున్నాడు. ఇక రణబీర్ రేయాన్ ఫేస్, కళ్లు, ముక్కు, నోరు అన్నీ ఒకేమాదిరిగా ఉంటాయి.

5. ఐశ్వర్య రాయ్ - దీపిక పదుకొనే

5. ఐశ్వర్య రాయ్ - దీపిక పదుకొనే

బాలీవుడ్ హీరోయిన్స్ ఐశ్వర్య రాయ్ దీపిక పదుకునే కాస్త ఒకేలా కనిపిస్తారు. 1994లో మిస్ వరల్డ్ పోటీల్లో విజేత నిలచిన ఈమె తరువాత సినిమాల్లో నటించారు. తమిళ సినిమా ఇరువర్ (ఇద్దరు) తో ఈమె తెరంగేట్రం చేశారు. జీన్స్, హమ్ దిల్ దే చుకే సనమ్, దేవదాస్ రెయిన్ కోట్, ధూమ్2, జోధా అక్బర్, గుజారిష్, జజ్బా తదితర సినిమాల్లో నటించారు. 2007లో ఐశ్వర్య ప్రముఖ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకున్నారు. వారికి ఒక పాప ఆరాధ్య. ఇక దీపికపదుకునే అంటే తెలియని వారుండరు. వీరిద్దరూ కాస్త ఒకేరకంగా ఉండడం విశేషం.

6. రామ్ కపూర్- ష్రెక్

6. రామ్ కపూర్- ష్రెక్

కసమ్ సే లో జై వాలియాగా రామ్ కపూర్ గుర్తింపు పొందారు. ఇండియన్ టెలీ పురస్కారాన్ని ఉత్తమ నటుడుగా వరుసగా పొందిన ఏకైక నటుడు ఈయనే. పలు బాలీవుడ్ చిత్రాల్లో పాత్రలను పోషించారు. ఆయన డిస్నీ చలన చిత్రంలోని షెర్క్ పోలికలను రామ్ కపూర్ పోలి ఉంటాడు.

7. అడెలె - ఫియోనా

7. అడెలె - ఫియోనా

ప్రముఖ గాయని అడిలె.. ప్రిన్సెస్ ఫియోనా మాదిరిగా ఉంటారు. ష్రెక్ మూవిలో ష్రెక్ అనే ఓగర్, ఫియోనా అనే ప్రిన్సెస్ ఎలా ప్రేమలో పడతారో, వారి స్నేహితులయిన డాంకీ, పిల్లి తో కలిసి చేసే ప్రయాణంలో ఎలాంటి ఆపత్తులని ఎదుర్కొన్నారో అన్నదే కథ. ఇదంతా యానిమేషన్ ఫిల్మ్. ఈ మూవీలో ఉండే ప్రిన్సెస్ ఫియోనాలాగే ప్రముఖ గాయని అడిలె పోలికలుంటాయి.

8. కృతి సనన్ - సారా కేనింగ్

8. కృతి సనన్ - సారా కేనింగ్

తెలుగులో మహేష్‌కి జోడీగా నటించిన 'ఒన్‌.. నేనొక్కడినే' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలయ్యారు కృతి సనన్‌. కృతి సనాన్ - సారా కేనింగ్ ల పోలికలు ఒకేలా ఉంటాయి. కృతి నాగచైతన్య సరసన 'దోచెయ్' చిత్రంలోనూ నటించింది. వీటితోపాటు బాలీవుడ్‌లో నటించిన 'దిల్‌వాలే', 'హీరోపంటి' చిత్రాలు కృతికి మంచి పేరే తీసుకొచ్చాయి. సారా కేనింగ్ కెనడియన్ నటి. టెలివిజన్ సిరీస్, ది వాంపైర్ డైరీస్ లో ఈమె నటించారు.

9. కరీనా కపూర్ - ప్యారిస్ హిల్టన్

9. కరీనా కపూర్ - ప్యారిస్ హిల్టన్

2000లో రెఫ్యూజీ సినిమాతో తెరంగేట్రం చేసిన కరీనా 2001లో చారిత్రాత్మక చిత్రం అశోకాలో నటించారు. అదే ఏడాది ఆమె నటించిన కభీ ఖుషీ కభీ గమ్ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఆమె నటించిన చమేలీ, దేవ్ సినిమాలు హిట్ అయ్యాయి. జబ్ వియ్ మెట్ సినిమాకు ఫిలింఫేర్ ఉత్తమ నటి, 2010లో నటించిన వియ్ ఆర్ ఫ్యామిలీ సినిమాకు ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటి పురస్కారాలు అందుకున్నారు కరీనా. ఆ తరువాత ఆమె నటించిన 3 ఇడియట్స్, బాడీగార్డ్ , రా.వన్ , భజరంగీ భాయీజాన్ సినిమాలు అత్యంత భారీ వసూళ్ళు సాధించి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. కుర్బానా, హీరోయిన్ సినిమాల్లోన ఆమె నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆమె నటుడు సైఫ్ అలీ ఖాన్ ను వివాహం చేసుకున్నారు. ఈమె ప్రముఖ మోడల్ ప్యారిస్ హిల్టన్ మాదిరిగా ఉంటుంది. ఇద్దరి హెయిర్ స్టైల్ ఒకేరకంగా ఉంటుంది.

10. సోఫియా చౌదరి- కిమ్ కర్దాషియన్

10. సోఫియా చౌదరి- కిమ్ కర్దాషియన్

సోఫియా చౌదరి, హాలీవుడ్ నటి కిమ్ కర్దాషియన్ ఒకే రకంగా కనిపిస్తారు. సోఫియా చౌదరి బ్రిటిష్-భారతీయ నటి. గాయని. ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్ , షాది నం 1 చిత్రాల్లో నటించారు. అలాగే ఎంటీ లో వీజేగా ప్రదర్శనలు ఇచ్చారు. ఈమె హాలీవుడ్ హాట్ బ్యూటీ కిమ్ కర్దాషియన్ మాదిరిగా కనిపిస్తారు.

11. అమీర్ ఖాన్ - టామ్ హాంక్స్

11. అమీర్ ఖాన్ - టామ్ హాంక్స్

బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ అంటే అందరికీ తెలుసు. ఈయన టామ్ హాంక్స్ మాదిరిగా ఉంటారు. టామ్ హాంక్స్ కొన్ని హిట్ సినిమాల్లో నటించారు. ఫారెస్ట్ గంప్, సేవింగ్ ప్రైవేట్ ర్యాన్, ది డా విన్సీ కోడ్ లలో టామ్ నటించారు. టామ్ హాంక్స్, అమీర్ ఖాన్ కు దగ్గరి పోలికలుంటాయి.

12. ఐశ్వర్య రాయ్ బచ్చన్ - స్నేహ ఉల్లాల్

12. ఐశ్వర్య రాయ్ బచ్చన్ - స్నేహ ఉల్లాల్

స్నేహా ఉల్లాల్‌కు చూడ్డానికి ఐశ్వర్య పోలికలుంటాయి... ఇద్దరి రంగు, కళ్లు ఒకేలా ఉంటాయి... ఒక్కో యాంగిల్‌లో చూస్తే స్నేహా ఉల్లాల్‌ను ఐశ్వర్యే అనుకుంటారు.. అందుకేనేమో అప్పట్లో లక్కీ సినిమాతో స్నేహా ఉల్లాల్‌ను బాలీవుడ్‌కి పరిచయం చేశాడు సల్మాన్‌ఖాన్.

13. అక్షయ్ కుమార్ - షాన్ మైఖేల్స్

13. అక్షయ్ కుమార్ - షాన్ మైఖేల్స్

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ షాన్ మైఖేల్స్ మాదిరిగా ఉంటారు. మైఖేల్ షాన్ అత్యంత ప్రసిద్ధ పొందిన ప్రొఫెషనల్ రెజ్లర్. మొత్తానికి షాన్ మైఖేల్స్ , అక్షయ్ కుమార్ పోలికలు కాస్త దగ్గరగా ఉంటాయి.

14. అనుష్క శర్మ - నజీయా హసన్

14. అనుష్క శర్మ - నజీయా హసన్

బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ, పాకిస్తానీ పాప్ గాయని నజీయా హసన్ ఒకే మాదిరిగా ఉంటారు. తన పాటలతో ప్రపంచంలోని ప్రత్యేక పేరు సాధించింది నజియా. ఇక బాలీవుడ్ లో అనుష్క శర్మ టాప్ లో ఉంది. ఈమె నటించిన ప్రతి మూవీ హిట్టే.

15. అశోక్ కుమార్ - ఎర్రోల్ ఫ్లిన్న్

15. అశోక్ కుమార్ - ఎర్రోల్ ఫ్లిన్న్

హాలీవుడ్ లో ఒకప్పటి ప్లేబాయ్ ఎరోల్ ఫ్లిన్ కెప్టెన్ బ్లడ్ సీ హాక్ పాత్రల్లో నటించారు. అలాగే బాలీవుడ్ ఒకప్పటి హీరో అశోక్ కుమార్ కు మంచి పేరుంది. అయితే వీరిద్దరూ పోలికలు ఒకేలా ఉంటాయి. ముఖ్యంగా వీరిద్దరి కళ్ళు సేమ్ టు సేమ్ ఉంటాయి.

16. అసిన్ - కైలా ఇవెల్

16. అసిన్ - కైలా ఇవెల్

తెలుగు, తమిళ్, హిందీ చిత్రాల్లో నటింంచిన ఆసిన్ కైలా ఇవెల్ మాదిరిగా ఉంటారు. కైలా ఇవెల్.. ఇంపాక్ట్ ఆఫ్ పాయింట్, ది టీవీ సిరీస్, ది బోల్డ్ అండ్ ది బ్యూటిఫుల్ వంటి మూవీల్లో నటించారు. వీరిద్దరి రూపురేఖలు ఒకేలా ఉంటాయి.

17. దేవ్ ఆనంద్ - గ్రెగొరీ పెక్

17. దేవ్ ఆనంద్ - గ్రెగొరీ పెక్

1940-60 కాలం నాటి దిగ్గజ చలనచిత్ర నటుడు గ్రెగొరీ పెక్. ది ఓమెన్, రోమన్ హాలిడే, టూ కిల్ ఎ మోకింగ్బర్డ్ వంటి అనేక చిత్రాల్లో నటించారు. గ్రెగొరీ పెక్ దేవ్ ఆనంద్ లాగా కనిపిస్తారు.

18. డొమినిక్ కూపర్ - విరాట్ కోహ్లి

18. డొమినిక్ కూపర్ - విరాట్ కోహ్లి

డొమినిక్ కూపర్ కెప్టెన్ అమెరికా , నీడ్ ఫర్ స్పీడ్ వంటి చిత్రాల్లో నటించారు. ఈయన మన క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లి మాదిరిగా కనిపిస్తారు. వీరిలో ఒకరు క్రీడారంగంలో స్టార్ అయితే మరొకరు సినీ రంగంలో స్టార్ కావడం విశేషం.

19. ఇషా గుప్తా - యాంజెలీనా జోలీ

19. ఇషా గుప్తా - యాంజెలీనా జోలీ

బాలీవుడ్ నటి ఇషా గుప్తా అందరికీ తెలిసిన హీరోయినే. రాజ్ త్రీడీ, జన్నాట్ 2 వంటి చిత్రాలతో తన కెరీర్ ను ప్రారంభించారు. ఈమె హాలీవుడ్ హాట్ బ్యూటీ నటి, యాంజెలీనా జోలీ పోలికలతో ఉంటారు.

20. హైఫా వీహ్బ్ - రాఖీ సావంత్

20. హైఫా వీహ్బ్ - రాఖీ సావంత్

హైఫా వీహ్బ్ లెబనీస్ పాప్ సింగర్, నటి. అలాగే సీ ఆఫ్ స్టార్స్ చిత్రంలో నటించారు. ఇక రాఖీ సావంత్ మంచి డ్యాన్సర్. హిందీ మూవీల్లో నటించారు. టెలివిజన్ స్టార్ కూడా. వీరిద్దరూ ఒకేరకంగా ఉంటారు.

21.హొవార్డ్ వోలోవిట్జ్ - రణబీర్ కపూర్

21.హొవార్డ్ వోలోవిట్జ్ - రణబీర్ కపూర్

టెలివిజన్ సిట్కాం ది బిగ్ బ్యాంగ్ థియరీలో హోవార్డ్ వోలోవిట్జ్ సిమోన్ హెల్బర్గ్ పాత్ర పోషించారు. ఈయన ఒక యూదు ఇంజనీర్, వ్యోమగామి. హోవార్డ్ రణబీర్ ఇద్దరూ సేమ్ సేట్ అనిపిస్తారు.

22. హ్రితిక్ రోషన్ - బ్రాడ్లీ కూపర్

22. హ్రితిక్ రోషన్ - బ్రాడ్లీ కూపర్

బాలీవుడ్ హీరో హ్రితిక్ రోషన్ తెలియని వారుండరు. హ్యాంగోవర్ సీరీస్ చిత్రాల ద్వార బాగా పేరొందిన అమెరికన్ నటుడు బ్రాడ్లీ కూపర్ హ్రితిక్ మాదిరిగానే ఉంటారు. వీరిద్దరూ సేమ్ సేమ్ అచ్చుగుద్దినట్లుగా ఉంటారు. వీరి కళ్లు కూడా ఒకేరకంగా ఉంటాయి.

23. ఇంద్రనీల్ సేన్ గుప్తా - జెఫ్ గోల్డ్ బ్లం

23. ఇంద్రనీల్ సేన్ గుప్తా - జెఫ్ గోల్డ్ బ్లం

ఇంద్రనీల్ సేన్ గుప్తా బెంగాలీ చలనచిత్ర కళాకారుడు. కహానీ మూవీలో అతడు అద్భుతంగా నటించారు. ఇక జేఫ్చ్ గోల్డ్ బ్లం హాలీవుడ్ హీరో. క్లాసిక్ కల్ట్ సీరీస్, జురాసిక్ పార్కు వంటి సినిమాలు మనలో చాలామంది చూసి ఉంటారు. అయితే మీకు జెఫ్ గోల్డ్ బ్లం కచ్చితంగా తెలిసే ఉంటుంది. ఇంద్రనీల్ సేన్ గుప్తా - జెఫ్ గోల్డ్ బ్లం ఇద్దరూ ఒకేరకంగా ఉంటారు.

24. జరీన్ ఖాన్ - కత్రీనా కైఫ్

24. జరీన్ ఖాన్ - కత్రీనా కైఫ్

జరైన్‌ ఖాన్.. కత్రినాకైఫ్‌ను మరిపిస్తుంది కదూ.. వీర్ సినిమా రిలీజ్‌కి ముందు కత్రినా పోలీకలున్న జరైన్ సెన్సేషనే క్రియేట్‌ చేసింది... జరైన్ కళ్లు, పెదాలు, ఫేస్‌కట్‌ అచ్చుగుద్దినట్లు కత్రినలాగే ఉంటుంది... అప్పట్లో కత్రినాతో కటీఫ్‌ చెప్పేందుకు సిద్ధంగా ఉన్న సల్మాన్ జరైన్‌ఖాన్‌ను హీరోయిన్‌గా లాంఛ్‌ చేసినట్లు బాలీవుడ్‌ కోడై కూసింది. చూశారుగా... స్టార్ను పోలిన స్టార్ సంగతులు... పోలికలున్నా ఎవరి క్రేజ్ వాళ్లకుంటుంది.. ఎవరి అవకాశాలు వాళ్లకుంటాయి. సో వీరికి ఈ క్రేజ్ తో ఇంకా మంచి అవకాశాలు రావాలని కోరుకుందాం.

English summary

hollywood bollywood insane look alike celebrities

A look-alike or a doppelganger is a person who resembles another in an uncanny and stark manner. Look-alikes are found everywhere, and it is said that every person has at least one doppelganger in the world. Whether these are long lost twins, siblings from another dimension, or pure coincidence, some on the list really do make you wonder.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more