సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయాలివే!

By: Bharath
Subscribe to Boldsky

సోషల్ మీడియా వచ్చాక ప్రతి ఒక్కరు ప్రపంచానికి ఈజీగా తెలిసేపోయే అవకాశం ఏర్పడింది. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లాంటి వాటిలో ఒక్కసారి చూస్తే కొందరికి ఒక్కసారిగా స్టార్ డమ్ వచ్చి ఉంటుంది.

ఒక్కొక్కరు ఒక్కో కారణం చేత అలా వైరల్ అయిపోతూ ఉంటారు. అందరిలో వినూత్నంగా ఉన్నవాళ్లుగానీ, కాస్త డిఫరెంట్ గా ఆలోచించేవారుగానీ, లేదంటే డిఫరెంట్ గా పోస్టులు పెట్టే వారుగానీ అప్పడప్పుడు వైరల్ అయిపోతుంటారు. మొత్తానికి ఏదో ఒకటి చేసి సోషల్ మీడియాలో తమకంటు ఒకస్థానం సంపాదించుకునే వాళ్లు చాలామందే ఉన్నారు.

అలాగే మనిషిని పోలిన మనిషులు కూడా చాలామందే ఉంటారు. ఒక మనిషి లాంటి మనుషులు మొత్తం ఏడుగురు ఉంటారనే విషయం నిజం అనుకోవొచ్చు. ఎందుకంటే, పుట్టుకతోనే కవలలు కాకుండా, అసలు ఏ మాత్రం పరిచయం లేని ఇద్దరు వ్యక్తులు సేమ్ టు సేమ్ ఉండడం విశేషమే కదా. అలాంటి కొందరు వ్యక్తులు ఇటీవల సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చారు. వీరంతా కూడా వైరల్ గా మారారు. అలాంటి వారిలో కొందరి గురించి ఇప్పుడు మీకోసం..

1. కైనట్ అరోరా

1. కైనట్ అరోరా

ఈమె బాలీవుడ్ హీరోయిన్. గ్రాండీమస్తీ, కట్టా మీట తదితర హిందీ చిత్రాల్లో ఈమె నటించారు. అలాగే తెలుగులో మొగలిపువ్వు చిత్రంలోనూ ఈమె నటించారు. అయితే ఈమె ఇటీవల సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ హల్ చేసింది. అంతా వైరల్ అయింది. హర్లీన్ మన్ అనే పోలీస్ అధికారిణిగా మీ అందరికీ విన్నవించుకునేది ఏంటంటే.. హీరోయిన్స్ సోషల్ మీడియాలో ఏ ఫొటో పోస్ట్ చేసినా అందరూ లైక్ లు కొడుతుంటారు... మరి ఈ పోలీస్ ఆఫీసర్ కి లైక్ కొట్టాలని కోరుకుంటున్నాను.. అంటూ ఇన్ స్టాగ్రామ్ లో ఆమె పోలీస్ ఆఫీసర్ డ్రెస్ లో ఫొటో పెట్టి పోస్ట్ చేసింది. దీంతో లైక్ ల మోత మోగించారు ఫ్యాన్స్. షేర్స్ అదిరిపోయాయి. అయితే తాజాగా ఆమె పంజాబ్ మూవీలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. అందులోని స్టిల్ ను ఇలా పోస్ట్ చేశారు. మొత్తానికి ఈమె ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

2. పెట్రోల్ బంక్ లో సైఫ్ అలీ ఖాన్

2. పెట్రోల్ బంక్ లో సైఫ్ అలీ ఖాన్

పెట్రోల్ బంక్ లో సైఫ్ అలీ ఖాన్ చూడండి ఎలా పని చేస్తున్నారో అంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ కూడా దుమారం లేపింది. వైరల్ గా మారింది. సేమ్ టు సేమ్ సైఫ్ మాదిరిగా కనిపించే ఈయన పేరు డోపెల్ గాంజర్. ఈయన పెట్రోల్ బంక్ లో పని చేస్తూ ఉంటారు. సైఫ్ అలీ ఖాన్ మాదిరిగా ఉండే ఈయన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

3. రైల్వే స్టేషన్ లో మోదీ

3. రైల్వే స్టేషన్ లో మోదీ

మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాదిరిగానే సేమ్ టు సేమ్ ఉన్న వ్యక్తి ఇలా రైల్వే స్టేషన్ లో ట్రైయిన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ మారింది. దీనిపై చాలా జోకులు పేలాయి. కొందరేమో ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో దీన్ని షేర్ చేశారు.

4. యోగి ఆదిత్యనాథ్.. విన్ డీసెల్

4. యోగి ఆదిత్యనాథ్.. విన్ డీసెల్

ఈ ఏడాది మార్చి 26 న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి యోగి ఆదిత్యనాథ్ గురించి మనదేశంలో అందరికీ తెలిసింది. అప్పటి నుంచి ఈయన పలు విషయాల్లో వైరల్ గా మారుతూనే ఉన్నారు. అలాగే హాలీవుడ్ నటుడు విన్ డీసెల్ గురించి కూడా అందరికీ తెలుసు. ఈ మధ్య ఈయనతో బాలీవుడ్ నటి దీపిక పదుకొనె హాలీవుడ్ లో నటించారు కూడా. అయితే వీరిద్దరూ ఫేస్ లు కాస్త ఒకేరకంగా ఉంటాయి. వీరి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

5. రాహుల్ గాంధీ కుక్ గా మారారా?

5. రాహుల్ గాంధీ కుక్ గా మారారా?

కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీలా అచ్చుగుద్దినట్లు కనిపించే ఈ వ్యక్తి మనం అనుకునే రాహుల్ గాంధీకారు. ఈయన పేరు ప్రశాంత్ సేథి. గుజరాత్ లోని సూరత్ చెందిన ఈ 24 ఏళ్ల వ్యక్తికి సొంతంగా ఒక రెస్టారెంట్ ఉంది. ఇక ఇతన్నిఆయతో భార్యతో పాటు స్నేహితులంతా ముద్దుగా రాహుల్ అని పిలుస్తుంటారు. గట్టి పోలికను కలిగి ఉన్నాడని చాలామంది భావిస్తున్నారు, అతని భార్య కూడా రాహుల్ గా పిలుస్తుంది.

6. బాల్ థాక్రే

6. బాల్ థాక్రే

శివసేనను స్థాపించిన నాయకుడు బాల్ కేశవ్ థాక్రే గురించి పరిచయం అక్కర్లేదు. భారతదేశం మొత్తానికి ఈయన తెలుసు. సేమ్ ఇలాంటి పోలికలతో ఉన్న మరో వ్యక్తి మహారాష్ట్రలో ఉన్నారు. ఈయన సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. ఎందుకంటే బాల్ థాక్రే పోలికలతో ఉండే వ్యక్తి అంటే మాటాలా మరి.

7. బాబా రామ్ దేవ్

7. బాబా రామ్ దేవ్

యోగా గురు బాబా రామ్ దేవ్ సోషల్ మీడియాలో ఎప్పుడు వైరల్ గానే ఉంటారు. పతంజలి బ్రాండ్ ద్వారా వ్యాపార రంగంలో అడుగుపెట్టిన బాబా రాందేవ్‌ చాలా రంగంల్లోకి ప్రవేశించారు. ఇండియా టుడే ఫ్రంట్ పేజీపై వచ్చిన ఫొటో ఆ మధ్య తెగ హల్ చల్ చేసింది. యోగా ఫోజులో ఉన్న రామ్ దేవ్ పై నెటిజన్లు కామెంట్లపై కామెంట్స్ చేశారు. కొందరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఆయన కూడా ఫైటర్ అంటూ ఫోటోస్ పెట్టారు. ఒక్కొక్కరు ఒక్కోస్టైల్ బాబా రామ్ దేవ్ ఫొటోలను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు.

8. టైగర్ ష్రాఫ్

8. టైగర్ ష్రాఫ్

బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కు మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యత ఉంది. కుంగ్ ఫూ కూడా నేర్చుకున్నాడు. వీటిని తన సినిమాల్లో సందర్భోచితంగా చూపిస్తుంటాడు. డూప్ లేకుండా స్టంట్స్ చేస్తాడని టైగర్ ష్రాఫ్ కు పేరుంది. అయితే ఈ మధ్య ఆయన తన కాలును స్ట్రైట్ గా పైకి లేపి ఒక ఫొటో దిగాడు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దానికి ఒక రేంజ్ లో స్పందన వచ్చింది. ఒక్కొక్కరు ఒక్కోరకంగా ఆయన ఫోటోను మార్పింగ్ చేసి పోస్ట్ చేశారు. గడియారంలో ముళ్లు తిరుగుతున్నట్లుగా ఆయన కాళ్లను మార్చేశారు. మరొకరరేమో మెట్రోలో ఒంటికాలిపై నిలబడే ఫోటోను పోస్ట్ చేశారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కోస్టైల్లో ఆయనపై ఫొటోపై కామెంట్ చేశారు. జోకులు పేల్చారు.

9. చేతన్ భగత్

9. చేతన్ భగత్

మంచి ఇంగ్లిషు నవలారచయిత చేతన్ భగత్ గురించి చాలామందికి తెలుసు. తాజాగా ఆయన రచించిన వన్ ఇండియన్ గర్ల్ పుస్తకం సోషల్ మీడియాలో వైరల్ గామారింది. వాస్తవానికి ఈ పుస్తకంలో అంతా పోర్న్ ఉంటుంది. చాలా అసభ్యకరంగా ఉంటుంది. అందువల్ల సోషల్ మీడియాలో ఒక్కొక్కరు ఒక్కో వ్యాఖ్య చేస్తూ పోస్టులు చేస్తారు.. కొందరు పాత సామన్ల వారికి తూకానికి బుక్ ను అమ్ముతున్నట్లు, ఒక మహిళ వంట చేయడానికి బుక్ ను ఉపయోగిస్తున్నట్లు ఇలా ఒక్కొక్కరు ఒక్కోరకంగా పోస్ట్ చేశారు.

10. సోనం గుప్తా బేవాఫా హై

10. సోనం గుప్తా బేవాఫా హై

సోనం గుప్తా బేవాఫా హై అనే ట్రెండ్ కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఉంది. డీ మానిటైజేషన్ అప్పుడు ఇది చాలా వైరల్ గా మారింది. నోట్లపై సోనం గుప్తా బేవాఫా హై అంటూ రాసి ఉంచి పోస్ట్ చేసిన పోస్టులు హల్ చల్ చేశాయి.

All Images Source: https://www.indiatimes.com/

English summary

indian people who went on viral mistakenly

Indian People Who Went On Viral Mistakenly! Here’s a list of people who got famous for no good reason at all in social media.
Subscribe Newsletter