మీరు గుప్పిట మూసే విధానం మీ గురించి ఎంతో తెలియచేస్తుంది

Posted By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

మన శరీర భాష మనం మాట్లాడకుండానే మన గురించి అవతలి వారికి తెలియచేస్తుంది. అలాగే, గుప్పిట మూసే విధానం ద్వారా ఒకరి వ్యక్తిత్వాన్ని అంచనా చేయవచ్చు. కోపాన్ని నియంత్రించడం దగ్గరనుంచి సాధారణ మనోభావాలను వ్యక్తపరిచే అనేక సందర్భాల్లో అనేక విధాలుగా గుప్పిటను మూస్తాము.

personality tests

వ్యక్తిత్వ పరీక్షలు

ఒకరి వ్యక్తిత్వాన్ని విశ్లేషించడానికి వారు గుప్పిట మూసే విధానాన్ని గమనించి ఒక అంచనాకు రావచ్చు.

1. ఒకవేళ మీరు టైపు ఏ అయితే:

1. ఒకవేళ మీరు టైపు ఏ అయితే:

ఈ విధంగా మీరు గుప్పిటను మూస్తే మీరు చాలా కారుణ్య హృదయం కలిగిన వారని అంచనాకి రావచ్చు. అలాగే ఆలోచనా శక్తి కలిగిన సున్నితమైన వ్యక్తి మీరు. మిగతావారికంటే మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెట్టేది మీలోనున్న భావోద్వేగ అవగాహనా సామర్థ్యం. మీలోనున్న సృజనాత్మకతకు మెరుగులు దిద్దడానికి మీరిష్టపడతారు. అలాగే, మీరు చాలా వ్యూహాత్మకమైన వ్యక్తి. అంతే కాదు, మీరు చాలా ఆర్గనైజ్డ్ కూడా.

2. ఒకవేళ మీరు టైపు బీ అయితే:

2. ఒకవేళ మీరు టైపు బీ అయితే:

ఒకవేళ మీరు ఈ విధంగా గుప్పెటను మూస్తే మీ గురించి మీ కంటే మీ ప్రతిభ, మీ మనోజ్ఞత అలాగే మీలోని ఆకర్షణాశక్తి మాట్లాడతాయి. మీ బొటనవేలు మిగతా నాలుగు వేళ్ళను కవర్ చేయడానికి ఏ విధంగా సాగిందో అదే విధంగా మీరు మీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడానికి మీరిష్టపడరు. మీరు చేయాలనుకున్న పనుల కోసం మీ దృష్టిని కేంద్రీకరిస్తారు.

మరో వైపు, మీ ప్రతికూలత ఏంటంటే మిమ్మల్ని ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకుంటారు. అయితే, మీరీ విషయం గుర్తుపెట్టుకోవాలి. మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం అవతలి వారి సమస్య.

3. ఒకవేళ మీరు టైపు సీ అయితే:

3. ఒకవేళ మీరు టైపు సీ అయితే:

మీరీ కోవకు చెందిన వారైతే మీ భావాలను మిగతా ప్రపంచంతో పంచుకోవడానికి మీరిష్టపడరు. మిమ్మల్నే మీరు బాగా ఇష్టపడతారు. మీతో మీరు గడపడానికే మొగ్గు చూపుతారు. ఎదుటి వ్యక్తులలోని నెగటివ్ యాటిట్యూడ్ ని మీరిష్టపడరు. అందుకు బదులుగా మీరు వ్యక్తులలో నిజాయితీకి, ముక్కు సూటితనానికి ఆకర్షితులవుతారు.

మరోవైపు, మీకు ఉపశమనం కలిగించేంది మీలోనున్న ప్రశాంతతేనని మీరు గమనించాలి. ఆ ప్రశాంతత మీరిష్టపడే ఏకాంతంలోంచి మీకు అలవాటైనదేనని మీరు గ్రహించాలి.

ఇప్పుడు మీరు గుప్పిట మూసే విధానాన్ని గమనించండి.

ఇప్పుడు మీరు గుప్పిట మూసే విధానాన్ని గమనించండి.

దిగువనున్న కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాలను తెలియచేయండి. ఇటువంటి ఆసక్తికరమైన మరిన్ని క్విజ్ లకోసం అలాగే వ్యక్తిత్వ పరీక్షల కోసం ఈ సెక్షన్ ని చెక్ చేస్తూ ఉండండి.

English summary

Is This The Way You Fold Your Wrist?

How do you clench your fist? With the thumb out or the thumb held tightly inside? The way you hold your thumb is said to reveal a lot about your personality. According to research, people are believed to clench their wrists in 3 different ways.
Story first published: Monday, December 25, 2017, 16:00 [IST]