For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  1990నాటి జ్ఞాపకాలివే ! వీటిని చూస్తే మీ చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి..

  By Y. Bharath Kumar Reddy
  |

  వర్తమానం కన్నా చాలామంది గతాన్నే ఎక్కువ ఇష్టపడతారు. జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆనందిస్తారు. ప్రతి ఒక్కరికీ చాలా మెమోరీస్ ఉంటాయి. ఇక మీరు 1980 చివర్లో లేదా 1990 ప్రారంభపు సంవత్సారాల్లో జన్మించినట్లయితే మీకు చాలా స్వీట్ మెమోరీస్ ఉంటాయి. అప్పట్లో ఇప్పటి మాదిరిగా స్మార్ట్ ఫోన్స్ ఉండేవి కావు. ఇంత ఇంటర్ నెట్ సౌకర్యం ఉండేది కాదు. అయినా ఇవన్నీ అప్పుడు అవసరం ఉండేవి కూడా కాదు. సాంకేతిక పరిజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందని రోజుల్లో గడిపిన ప్రతి క్షణం ఒక జ్ఞాపకంగా మిగిలి ఉంటుంది ప్రతి ఒక్కరికీ. గతంలో ఉపయోగించిన పరికరాలు, చూసిన టీవీ షోస్, ఆడిన ఆటలు, విన్న పాటలు ఇలా ఒకటేమిటి చాలానే మీ జ్ఞాపకాల్లో గూడు కట్టుకుని ఉంటాయి. మరి అలాంటి వాటిలో కొన్నింటిని చూద్దామా.

  చైనాపెన్, రేనాల్డ్స్ పెన్

  చైనాపెన్, రేనాల్డ్స్ పెన్

  మీరు 1990 అటు ఇటు సంవత్సారాల్లో పుట్టినట్లయితే మీకు కచ్చితంగా చైనా పెన్ గురించి తెలిసి ఉంటుంది. ఇక చైనా పెన్నుల్లో ఇంకును ఎలా నింపాలనే విషయాలను మీ నాన్న లేదా మీ ఫ్రెండ్స్ మీకు వివరించి ఉంటారు. అలాగే మీకు రేనాల్డ్స్ పెన్స్ కూడా గుర్తుండిఉంటాయి. మీరు చిన్నప్పుడు పరీక్షల కోసం దీన్ని తప్పకుండా ఉపయోగించి ఉంటారు. అందువల్ల మీకు ఈ పెన్నులు మీకు బాగా గుర్తు ఉండి ఉంటాయి.

  Image Courtesy

  కిస్మీ బార్, చాక్లెట్స్

  కిస్మీ బార్, చాక్లెట్స్

  కిస్మీ బార్, చాక్లెట్స్ కూడా మీకు బాగా గుర్తుండి ఉంటాయి. ఒక్కసారి మీరు వాటిని గుర్తుకు తెచ్చుకోగానే మీ నాలుకపై వాటి రుచి కదలాడుతూ ఉంటుంది. అలాగే మీకు బిగ్ బబూల్, బూమర్లు కూడా గుర్తుండి ఉంటాయి. ఇప్పటికీ కూడా మనం వీటిని తింటూ ఉండొచ్చుగానీ మొదట్లో వీటి వెంట కొన్ని స్టిక్టర్స్ కూడా ఇచ్చేవారు. వాటిని చేతిపై టాటూస్ గా వేసుకునే వాళ్లం కదా. ఈ విషయాలన్నీ మీకు గుర్తొచ్చాయా.

  పెప్సీ

  పెప్సీ

  ప్రస్తుతం లభించే పెప్సీ కూల్ డ్రింక్ గురించి కాదు మేము చెప్పేది. మీరు చిన్నతనంలో చిన్నప్యాకెట్స్ లో ఉండే పెప్సీని తిని ఉంటారు కదా. దాని గురించి. పెప్సియో అంటూ అప్పట్లో వీటిని అమ్మేందుకు వచ్చే వారు అనేవారు. 50 పైసల నుంచి ఒక రూపాయ ధర వరకు లభించే వీటిని అప్పట్లో భలే కొనుక్కోని తినేవారు. మీరూ ఇలా తినే ఉండి ఉంటారు. ఎండకాలంలో వీటికి భలే గిరాకీ ఉండేది. అప్పట్లో మీరు జేబులో ఉన్న డబ్బునంతా వీటిని కొనుక్కునేందుకే ఉపయోగించేవారు కదూ.

  వీడియో గేమ్స్

  వీడియో గేమ్స్

  1990 చివరి దశలో వీడియో గేమ్స్ చాలా పాపులర్. అప్పట్లో ప్రతి ఒక్కరి దగ్గర వీడియో గేమ్స్ పరికరాలుండేవి. వీటిని అందరూ బాగా ఇష్టపడేవారు. ఇక గేమ్ ఆడేటప్పడు వచ్చే శబ్దాలు భలే ఉండేవి. ఆడినప్పుడల్లా స్కోర్ ఎక్కువ సాధించేందుకు భలే కష్టపడేవారు కదా.

  ట్రంప్ కార్డులు

  ట్రంప్ కార్డులు

  ఈ ఆటను ఎక్కువగా అబ్బాయిలు ఆడేవారు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ [ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ] ఆటకు సంబంధించి ఈ కార్డుల గేమ్ ఉండేది. 1990 దశకంలో ఇది బాగా పాపులర్ గేమ్. భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఆ సమయంలో కచ్చితంగా ఈ ఆటను ఒక్కసారైనా ఆడి ఉంటారు.

  Image Courtesy

  ఇన్లాండ్ లెటర్స్

  ఇన్లాండ్ లెటర్స్

  అప్పట్లో లెటర్స్ రాయడం అనేది ఒక కళ. ఏ సమాచారమైనా లెటర్ ద్వారానే అవతలి వ్యక్తులకు చేరేది. మొబైల్ ఫోన్లు, ల్యాండ్ లైన్ ఫోన్ల వాడకం విస్తృతంగా ప్రచారంలో రాకముందు ఎక్కువగా ఇన్లాండ్ లెటర్స్ అందుబాటులో ఉండేవి. వాటి ద్వారానే కమ్యూనికేషన్ సాగేది. ఒకవేళ మీరు ఆ సమయంలో మీ కుటుంబానికి, మీ తల్లిదండ్రులకు దూరంగా ఉండి ఉంటే మీరు కచ్చితంగా ఇన్లాండ్ లెటర్స్ అందుకోని ఉంటారు.

  గోటీలు, గోలీలు

  గోటీలు, గోలీలు

  మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా గోలీ లేదా గోటీల ఆట ఆడే ఉంటారు. ఇక ఈ ఆట ఆడేటప్పుడు మీ తోటివారితో మీరు గొడపడి కూడా ఉంటారు.

  ఇక తల్లిదండ్రులేమో ఈ ఆట ఆడవద్దంటూ పిల్లలకు సూచించేవారు. అయినా వినేవారు చాలా తక్కువ.

  క్యాసెట్స్, టేప్ రికార్డర్

  క్యాసెట్స్, టేప్ రికార్డర్

  అప్పట్లో టేప్ రికార్డర్ లో పాటలు వినడమంటే అందరికీ భలే ఇష్టం ఉండి ఉంటుంది. క్యాసెట్ వేసి పాటలు విన్నవారు చాలామందే ఉంటారు. ఇక కొందరేమో ఫ్రెండ్స్ కోసం లేదా ప్రియురాలి కోసం వారికి నచ్చిన పాటను రికార్డ్ చేసి గిఫ్టుగా కూడా ఇచ్చి ఉంటారు. ఒక్కసారి మీ మెమోరీస్ లోకి వెళ్తే ఇవన్నీ గుర్తొస్తాయి.

  సైకిల్

  సైకిల్

  ఇక ప్రతి మధ్యతరగతి కుటుంబంలో ఆ రోజుల్లో సైకిల్ ఉండేది. ఇంట్లో సైకిల్ ఉంటే దాన్ని నేర్చుకునేందుకు మీరు కచ్చితంగా ప్రయత్నించి ఉంటారు. ఇక మీ చిన్నినాటి జ్ఞాపకాల్లో సైకిల్, సైకిల్ కు సంబంధించిన విషయాలు కచ్చితంగా ఉండే ఉంటాయి.

  ఆర్ ఎక్స్ 100

  ఆర్ ఎక్స్ 100

  యమహా

  ఆర్ ఎక్స్ 100 బైక్ అంటే అప్పటి వారికే కాదు ఇప్పటి యూత్ కు భలే ఇష్టం. దానిపై జివ్వుమని వెళ్తుంటే ఆ మజానే వేరు. ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఈ బైక్. ఇక దీని సౌండ్స్ కూడా ఒక రేంజ్ లో వచ్చేవి. అందుకే అందరూ ఈ బైక్ ను ఇష్టపడేవారు. అయితే యమహా కంపెనీ వీటి తయారీని నిలిపివేసింది. ఇప్పటికీ అప్పట్లో మార్కెట్ లోకి వచ్చిన బైక్ లనే రిపేరీ చేయించుకుని ఉపయోగించే వాళ్లు చాలా మంది ఉన్నారు.

  Image Courtesy

  ఆదివారం వచ్చిందటే బ్యాక్ టు బ్యాక్ షోస్

  ఆదివారం వచ్చిందటే బ్యాక్ టు బ్యాక్ షోస్

  1990 దశకంలో ఆదివారం వచ్చిందంటే చాలు అందరికీ పండుగే. కుటుంబం మొత్తం టీవీలో వచ్చే సీరియల్స్, ప్రోగ్రామ్స్, సినిమాల కోసం వేచి చూసేది. జంగిల్ బుక్, చంద్రకాంత, మహాభారతం వంటి కార్యక్రమాలను ఆనాడు కుటుంబ సభ్యులంతా కలిసి వీక్షించేవారు.

  Image Courtesy

  ట్వింకిల్, చంపక్

  ట్వింకిల్, చంపక్

  ట్వింకిల్, చంపక్ బుక్స్ ఇప్పటికీ కూడా లభిస్తాయి. అయితే ఇప్పటి పిల్లలు ఈ పుస్తకాలు చదవడం చాలా అరుదు. అప్పట్లో ఎక్కువగా పిల్లలు వీటిని చదివేవారు. వీటిలో నీతితో కథలు, నైతిక విలువలకు సంబంధించిన కథలుండేవి. అయితే ప్రస్తుతం పిల్లలంతా ఎక్కువగా కంప్యూటర్లకు సంబంధించిన నాలెడ్జ్ మాత్రమే పొందుతున్నారు.

  Image Courtesy

  యాడ్స్

  యాడ్స్

  ఇక మీ చిన్ననాటి జ్ఞాపకాల్లో కచ్చితంగా కొన్ని యాడ్స్ కూడా ఉండి ఉంటాయి. కాడ్బరీ, బజాజ్, ధారా యాడ్స్ వంటి ప్రకటనలు అప్పట్లో భలే ఆసక్తికరంగా ఉండేవి. ఇప్పటికీ ఒకసారి ఆ యాడ్స్ గుర్తొచ్చాయనుకుకో మీరు ఆనందంలో తేలిపోతారు.

  Image Courtesy

  హాయినిచ్చే సంగీత ఆల్బమ్స్

  హాయినిచ్చే సంగీత ఆల్బమ్స్

  1990 దశకంలో మనదేశంలో అనేక బ్యాండ్స్ ఉండేవి. యుఫోరియా, లక్కీ అలీ, అలీషా చినాయి, ది కలోనియల్ కజిన్స్ ఇలా పలువురి పాటలు వింటే మైమరిచిపోయే వాళ్లు. మీరు కచ్చితంగా ఇలాంటి పాటలు మీరు వినే ఉంటారు.

  Image Courtesy

  హిప్ హిప్-హుర్రే.. మహబత్

  హిప్ హిప్-హుర్రే.. మహబత్

  హిప్ హిప్-హుర్రే , జస్ట్ మహబత్ అనే రెండు సీరియల్స్ ను మీరు కచ్చితంగా చూసే ఉంటారు. మీరు 1990వ దశకానికి చెందిన వారైతే హమ్ పాన్చ్, బ్యోముకేష్ బక్షి, ఫారిన్ ఇంపోర్ట్, స్మాల్ వండర్ వంటి అనేక అద్భుతమైన సీరియల్స్ ఉన్నాయి. మీరు వీటిని కచ్చితంగా చూసే ఉంటారు.

  Image Courtesy

  కెమెరా రోల్స్

  కెమెరా రోల్స్

  ఇప్పుడంటే అన్నీ డిజిటల్ కెమెరాలున్నాయి. కానీ అప్పట్లో అన్నీ రీల్ కెమెరాలే. ఇక ఫొటో తీసిన తర్వాత మీకు నచ్చకుంటే డిలీట్ చేసుకునే ఆప్షన్ ఉండేది కాదు. ఫొటోలు తీశాక ఆ రీల్స్ ను స్టూడియోకి తీసుకెళ్తే ఫొటోస్ ప్రింట్ తీసి ఇచ్చేవారు. కానీ ఇప్పుడు కెమరా రీల్స్ మార్కెట్లో అస్సలు లేవు. అంతా డిజిటల్ కెమరాలే.

  Image Courtesy

  నోకియా ఫోన్ గేమ్స్

  నోకియా ఫోన్ గేమ్స్

  ఇక 2000 దశకం ప్రారంభంలో ఒకవేళ మీరు నోకియా ఫోన్ కొన్నట్లయితే అందులో మీరు కచ్చితంగా స్నేక్ గేమ్ ఆడి ఉంటారు. స్పేస్ ఇంపాక్ట్ అనే ఆట కూడా ఆడి ఉంటారు. అప్పట్లో ఫోన్లలో నోకియా అంటే కింగ్ . ఆండ్రాయిడ్ ఫోన్స్ రాకముందు వీటికి భలే క్రేజీ ఉండేది. ఇక ఎంతసేపు గేమ్స్ ఆడిన బ్యాటరీ ప్రాబ్లం కూడా వచ్చేదికాదు. ఒక్కసారి ఫుల్ గా చార్జింగ్ పెడితే చాలా సమయం పాటు వచ్చేది. 1990వ దశకంలో పుట్టిన వారికి వీటన్నింటితో మంచి అనుబంధం ఉంటుంది. ఇది చదివాక వాటన్నింటినీ మీరు కూడా ఇప్పడు ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నారు కదా.

  Image Courtesy

  English summary

  90'S Indian Kid | Nostalgic Feeling | Childhood Memories

  In the 90's things were quite different from now. Read on to find out how different it was and see if it brings back memories.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more