Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
కొంత మందిలో మీరు నమ్మలేని వింతై-విచిత్రపు ఆహారపు అలవాట్లు
తినటం గురించి మాట్లాడితే అనేక విషయాలు ఉన్నాయి. ప్రజలు తినదగని అంశాలపై కూడా ఇష్టం కలిగి ఉండవచ్చు. అయితే ఇక్కడ గర్భిణీ స్త్రీలు మరియు వారి కోరికల గురించి మాట్లాడటం లేదు.
ప్రజలు కొత్తగా కనిపెట్టిన ఆహార అంశాలు మరియు వంటకాల అన్వేషించడం మీద ప్రేమ కలిగి ఉంటారు. కొన్ని ఆహారపు అలవాట్ల గురించి విన్నప్పుడు షాక్ కలుగుతుంది. ఇక్కడ, మేము ప్రజలు నమ్మలేని వింత ఆహారపు అలవాట్ల గురించి చెప్పుతున్నాం.
ఇక్కడ తినటం గురించి ఊహించని విషయాలు ఉంటాయి. కాబట్టి ప్రజలు తినటానికి ఇష్టపడే జాబితాను తెలుసుకుంటే నిర్ఘాంతపోతారు. అలాగే ప్రజలు తినటానికి ఇష్టపడే జాబితా తెలుసుకుంటే విసుగు కలుగుతుంది. మరింత సమాచారం తెలుసుకోవాలంటే ఈ వ్యాసాన్ని చదవండి.

డ్రై వాల్ తినే అలవాటు
నికోలే అనే డెట్రాయిట్ మహిళకు పొడి గోడ పెచ్చులను తినే అలవాటు ఉంది. ఆమె సుద్ద తినటం ప్రారంభించి 7 సంవత్సరాలు అయింది. ఆమెకు పొడి గోడ సుద్దను తినటం చాలా ఇష్టం. ఇది వింతగా ఉండవచ్చు. కానీ ఆమె తన ఇంటి గోడలు మరియు పొరుగు ఇంటి గోడల మీద ఎక్కువ ప్రేమను కలిగి ఉంటుంది.

ప్లాస్టిక్ బ్యాగ్ తినే అలవాటు
రాబర్ట్ అనే 23 ఏళ్ల వ్యక్తికి ప్లాస్టిక్ సంచులు తినే అలవాటు ఉంది. అతనికి ఇతర రంగు ప్లాస్టిక్ సంచుల కంటే నీలం ప్లాస్టిక్ సంచులు రుచిగా ఉంటాయని చెప్పుతాడు. అతను పరిసరాల్లో సంచులను వెతికి మరీ తింటాడు. ప్రస్తుతం అతను ఈ విచిత్రమైన అలవాటును విడిచిపెట్టే ఆలోచనలో ఉన్నాడు.

క్లే మాస్క్ తినే అలవాటు
నటాషా అనే 40 సంవత్సరాల మహిళ కాలిఫోర్నియాలోని రియాల్టో ఉంటుంది. ఆమె ముఖ మసాజ్ కోసం ఉపయోగించే క్లే పొడిని టన్నుకు పైగా తిన్నది. ఈ వింత అలవాటు సుమారుగా 7 సంవత్సరాల నుండి ఉంది. ఆమె కోరికను సంతృప్తి పరచటానికి క్లే తింటుంది.

టైర్స్ తినే అలవాటు
అల్లిసన్ అనే ఈ 19 ఏళ్ల అమ్మాయికి రబ్బరు ముక్కలు తినే ఒక విచిత్రమైన అలవాటు ఉంది. ఆ అసహజమైన అలవాటు 6 సంవత్సరాల నుండి ఉంది. ఆమె ఈ అలవాటుకు బానిస అయ్యిపోయింది. ఆమెకు రబ్బరు కార్ల టైర్లను తినటం చాలా ఇష్టం.

టేప్స్ తినే అలవాటు
జార్జియాలోని మెరీయెటలో ఉండే ఆండ్రియా అనే మహిళకు టేప్ తినే అలవాటు ఉంది. ఆమె ప్రతి నెల 6000 అడుగుల టేప్ ని తినే వింత అలవాటు కలిగి ఉంది. ఆమెకు ఈ అసహజమైన అలవాటు 9 సంవత్సరాల క్రితం అలవాటు అయింది. అప్పటి నుండి ఆమె ఈ అలవాటు నుండి బయట పడలేదు.

డియోడరెంట్ తినే అలవాటు
ఒక వ్యక్తి యొక్క చాలా వింత ఆహారపు అలవాట్లలో ఇది ఒకటి. నికోలే అనే 19 సంవత్సరాల యువకుడుకి చిన్నతనం నుండి డియోడరెంట్ తినే వింత అలవాటు ఉంది. ప్రతి రోజు డియోడరెంట్ స్టిక్ లో సగం తింటాడు. ఈ వ్యసనం కారణంగా అతనికి నోరు పొడిగా మారటం మరియు కడుపు తిమ్మిరి వస్తాయని అంగీకరించాడు. కానీ ఈ అలవాటును మానటం చాలా కష్టం.
ఇటువంటి అలవాట్లు ఉన్న వారి గురించి మీకు ఏమైనా తెలిస్తే మాతో భాగస్వామ్యం చేయండి.



Click it and Unblock the Notifications
