చిత్రాల విశ్లేషణ గేమ్ ; వీటిల్లో ఏది కుటుంబం కాదు?

Posted By: DEEPTHI T A S
Subscribe to Boldsky

చిత్రాలను విశ్లేషించడం నిజంగా జరుగుతుందనుకుంటున్నారా? సైకాలజీ ప్రకారం, మానవ మెదడు అన్నిటిని అర్థం చేసుకోవటం, విశ్లేషించటం మొత్తం తన సబ్ కాన్షియస్ మైండ్ లో ఏం జరుగుతోందన్న దానిబట్టి ఉంటుంది.

ఇది ఇంకా అర్థం చేసుకోవాలంటే, ఈ కింది పరీక్ష చేసి చిత్రాల వెనుక అర్థం తెలుసుకోండి.

pictures quiz

మీరు చేయాల్సిందల్లా, ఈ చిత్రాలను చూసి వీటిల్లో ఏ చిత్రం ఒక కుటుంబాన్ని పోలి ఉందో తెలపాలి.

అన్ని చిత్రాల్లో ఒక వ్యక్తి, ఒక స్త్రీ, ఒక పిల్లాడు ఉన్నారు కానీ వారి శరీరభాష ప్రకారం వెనుక అర్థాలు దాగివున్నాయి.

చిత్రాలను చూసి ఏ చిత్రం చక్కటి కుటుంబాన్ని సూచిస్తోందో చెప్పండి...

మీరు మొదటి చిత్రం #1 ఎంచుకుంటే

మీరు మొదటి చిత్రం #1 ఎంచుకుంటే

మీరు మొదటి చిత్రాన్ని ఎంచుకుంటే మీరు కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే వ్యక్తి కాదని అర్థం. ఇది మీ జీవితంలో బలమైన తండ్రి పాత్ర ఎవరూ లేరని కూడా సూచిస్తుంది. ఇది ఎందుకంటే ఈ చిత్రంలో ఉన్న తండ్రి ఎవర్నీ పట్టించుకోకుండా, తల్లేమో బిడ్డని అతనికి దూరంగా ఉంచటం కన్పిస్తోంది. మరోవైపు, మీరు ఇతరులకి సాయపడటాన్ని ఇష్టపడతారు, వారి జీవితాల్లో మార్పుకి కష్టపడతారు కానీ వ్యక్తిగతంగా మీకు నిజంగా కుటుంబం అంటే ఏంటో తెలీదు.

మీరు రెండవ చిత్రం #2 ఎంచుకుంటే

మీరు రెండవ చిత్రం #2 ఎంచుకుంటే

మీరు దీన్ని ఎంచుకుంటే మీరు నిజంగా ఒక మంచి కుటుంబ సభ్యుడు. మీరు ఎప్పుడు దీనిపై అవగాహన ఉండాలని భావిస్తారు మరియు కుటుంబం ఎప్పుడూ మీకు ప్రాధాన్యతగా ఉంటుంది. చిత్రంలో సూచించినట్లు, తల్లిదండ్రులు తమ గురించి ఎక్కువ ఏకాగ్రంగా ఉంటారు. మరోవైపు మీరు స్థిరమైన,బలమైన బంధాలను నమ్ముతారు, కుటుంబ సభ్యుల ఆనందంతో ఉన్న వాతావరణం ముఖ్యమని భావిస్తారు.

మీరు మూడవ చిత్రం #3 ఎంచుకుంటే

మీరు మూడవ చిత్రం #3 ఎంచుకుంటే

ఈ చిత్రంలో ఒక సంతోషకరమైన, ప్రేమనిండిన ఒక కుటుంబం, అందులో తల్లిదండ్రులు తమ బిడ్డను ప్రేమగా చూసుకోవడం కన్పిస్తుంది. కానీ నిజానికి ఇదంతా నకిలీ ప్రేమ. మీరు ఈ చిత్రం ఎంచుకుంటే, సైకాలజీ పరీక్షల ప్రకారం మీరేదో కుటుంబం సరిగా లేకపోవటం వల్ల పెద్ద సైకలాజికల్ సమస్యలో ఉన్నారు. ఇది మీ తల్లిదండ్రులకి సంబంధించినది అయి ఉండవచ్చు, మీ తల్లి లేదా తండ్రి మద్యబానిస లేదా డ్రగ్స్ లేదా మానసిక సమస్యతో బాధపడుతూ ఉండవచ్చు.

pictures quiz
English summary

Which Picture Do You Think Is Not A Family?

There are certain personalities that can be analysed with pictures. These picture revelation tricks help us to understand the unknown side of ours. The message our brain sends after seeing the pictures is totally connected to the subconscious side of ours.
Story first published: Sunday, December 24, 2017, 13:01 [IST]