Latest Updates
-
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Independence Day 2026: ఆగస్టు 15న ప్రధాని ప్రసంగానికి, జెండా వందనానికి ఎర్రకోటనే ఎందుకు ఎంచుకుంటారో తెలుసా? -
శ్రావణ మాసంలో ఈ ఐదు నక్షత్రాల వారికి తిరుగే ఉండదు.. గోల్డెన్ డేస్ ఆరంభం.! -
ఉదయం నిద్ర లేవగానే ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు.! -
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే!
ఒక స్త్రీ తన భర్త యొక్క జననాంగాలను ముక్కలు ముక్కలుగా నరుకుదాం అని ఎందుకు నిశ్చయించుకుందంటే
ఒక వ్యక్తి కోపంలో ఉన్నప్పుడు ఏమి చేయడానికైనా సిద్ధపడతాడు మరియు ఆ కోపానికి అడ్డు అదుపు ఉండదు అనే విషయాన్ని మనం అందరూ అర్ధం చేసుకోవాలి. ఆ సమయంలో ఆ వ్యక్తులు ఎలాంటి విపరీతమైన పనులు చేయడానికి కూడా వెనకాడరు.
కోపం ఎక్కువైపోయి దానిని అణుచుకోలేక సొంత కుటుంబ సభ్యులనే చంపిన వ్యక్తుల గురించి వార్తలు ఈ మధ్యకాలం లో వెలుగులోకి వచ్చాయి. ఏ వ్యక్తులైతే అలా చేశారో వాళ్ళందరూ ఆ సమయంలో తమ కోపాన్ని నియంత్రించుకోలేక అలా ప్రవర్తించారు. మళ్ళీ జీవితంలో ఒకానొక్కప్పుడు ఎందుకు అలా చేశామా అని పశ్చాత్తాప పడ్డారు. కానీ అప్పటికే సమయం మించిపోయింది.
అలాంటి ఒక సంఘటనే ఒక మహిళా జీవితంలో చోటు చేసుకుంది. ఎదో చిన్న విషయం లో సమస్యలు తలెత్తడంతో ఒక భార్య తన భర్త యొక్క పురుషాంగాన్ని ముక్కలు ముక్కలుగా నరికేసింది. ఈ ఘోరమైన సంఘటన ఎప్పుడు, ఎలా, ఎక్కడ జరిగిందంటే....

ఈ దంపతులు దక్షిణ కొరియాకు చెందినవారు :
ఈ దంపతులు ఇద్దరు ఎంతో అన్యోన్యంగా జీవించేవారు. ఈ సంఘటన జరిగిన సమయంలో కూడా వీరిద్దరూ చుట్టుపక్కల ఉన్న ఇరుగుపొరుగు వారి నుండి ప్రేమ ఆప్యాయతలను పొందేవారు. ఏమోసు ప్రాంతానికి చెందిన ఒక మహిళ, 50 యేళ్ళ తన భర్త నిద్రిస్తుండగా, వంటింట్లో నుంచి కత్తి తీసుకొచ్చి అతని పై దాడి చేసింది.

దాడి చేయడానికి గల కారణం ఏమిటంటే :
అక్కడ కొన్ని వర్గాల నుండి వెలువడిన సమాచారం ప్రకారం, ఆ భర్త గోల్ఫ్ ఆటను విపరీతంగా ఆడేవాడు. తన భార్య ఎక్కువ సేపు ఆడవద్దని చెప్పినా వినేవాడు కాదు. దీంతో తన భర్త తన పై దృష్టి పెట్టడంలేదని భావించింది భార్య. ఇక తనకి ఓపిక నశించిందని భావించి ఈ దాడి చేసింది.

తన పురుషాంగాన్ని ముక్కలు ముక్కలుగా నరికింది :
తన భర్త పడుకున్నంత వరకు వేచి చూసింది, ఆ తర్వాత ఒక్కసారిగా దాడి చేసింది. ఈ ఘోరం అక్కడితో ఆగిపోలేదు. ఇంకా ముందుకు సాగి ఆమె ఆ దాడి తీవ్రతను పెంచింది. తన భర్త పురుషాంగాన్ని తెగ నరికింది. బాధతో విలవిలలాడుతున్న భర్తను పట్టించుకోకుండా ఆ పురుషాంగాన్ని ముక్కలు ముక్కలు చేసి బాత్ రూమ్ లోకి తీసుకెళ్లి ఫ్లష్ చేసేసింది.

ఇంటి పరిసరాల్లో ఉన్న ఒక వ్యక్తి సహాయం చేసాడు :
ఇంట్లో నొప్పితో విలవిలలాడుతున్న అతని ఏడుపు అక్కడ చుట్టుప్రక్కల ఉన్న ఒక వ్యక్తికి వినపడింది. ఇది గమనించిన వ్యక్తి , ఆ ఇంటికి వెళ్లి తలుపు తీసాడు. నేల పై బాధతో విలవిలలాడుతూ అరుస్తున్న ఒక మనిషి కనిపించాడు. ఈ ఘోరమైన సంఘటన గురించి తెలుసుకొని ఇరుగుపొరుగు వారందరూ నిశ్చేష్టులయ్యారు. ఇద్దరి మధ్య మంచి సంబంధ బాంధవ్యాలే ఉండేవని ఇలా ఎందుకు జరిగిందో అర్ధం కావడం లేదని చెప్పారు.

ఈ నేరం చేసినందుకు ఆమెను అరెస్ట్ చేశారు :
ఈ ఘోరమైన పని చేసినందుకు ఆ మహిళను అరెస్టు చేశారు మరియు ఆ పురుషుడు ఇప్పుడు నెమ్మదిగా కోలుకుంటున్నాడు. నిరాశ ఎక్కువైపోయి ఏమి చేయాలో అర్ధంకాని స్థితిలో ఆ పని చేశానని ఆ మహిళ చెప్పుకొచ్చింది. ఈ మహిళ మాత్రమే కాదు, ఇలా ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది చేశారు, ఇటువంటి ఘోరమైన సంఘటనలు ఇంకా ఎన్నో చోటు చేసుకున్నాయి.

అచ్చం అలాంటి సంఘటనే భారతదేశంలో చోటుచేసుకుంది :
తమిళనాడుకు చెందిన దంపతులు విపరీతంగా పోట్లాడుకున్నారు. కోపం మరీ ఎక్కువైపోయి దానిని నియంత్రించుకోలేక భర్త యొక్క జననాంగాలను కోసేసింది ఆ భార్య. ఆ భర్తకు అక్రమ సంబంధం ఉందని అందుకనే ఇలా చేశానని చెప్పుకొచ్చింది. తన భర్త పురుషాంగాన్ని పర్సులో పెట్టుకొని మరీ తిరిగింది.

భర్తపై భార్య ఎందుకు దాడి చేసిందంటే :
కొన్ని వర్గాల దగ్గర నుండి అందిన సమాచారం ప్రకారం, ఆ భర్త తరచూ ఆ భార్యని, నువ్వు ముసలిదానివి అయిపోయావని, నీతో కాపురం చేయలేనని వేరొకరిని పెళ్లి చేసుకొని వెళ్లిపోతానని చెబుతుండేవాడంట. ఇలా విపరీతంగా వేధిస్తుండటంతో ఏమి చేయాలో తెలియక ఇలా చేశానని చెప్పుకొచ్చింది ఆ మహిళ .

తప్పు చేసిన వాళ్ళందరూ చెబుతున్న కారణాలు వల్ల చేసిన పని న్యాయబద్దం అయిపోదు.
ఎవరైతే మానభంగం చేస్తారో అటువంటి పురుషుల యొక్క పురుషాంగాన్ని నరకాలని మనలో చాలా మంది భావిస్తుంటారు. ఇంతకు మించిన కఠినమైన శిక్ష ఇంకొకటి లేదని భావిస్తుంటారు. ప్రతి రోజు ఇలాంటి సంఘటనలు వినవలసి వచ్చినప్పుడల్లా మన సమాజానికి ఏమౌతోంది అని అనిపించక మానదు. ఇలాంటి కారణాలన్నీ, ఆ ఘోరమైన పనిని న్యాయబద్దం చేస్తాయా ? వీటి గురించి మీ స్పందన ఏంటి ? మీ స్పందనను కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి.



Click it and Unblock the Notifications