మహిళ మరణించిందని మార్చురీలో పెట్టారు, కానీ ప్రాణాలతో లేచి కూర్చుంది

Posted By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

కేరళ రాష్ట్రంలో ఒక మహిళ మరణించిందని భావించి ఆమెను మార్చురీలో పెట్టారు. కానీ ఆమె బ్రతికే ఉందని తెలిసి అందరూ నిర్ఘాంతపోయారు, భయపడిపోయారు. ఇది ఎలా సాధ్యం అంటూ ఆశ్చర్యపోయారు.

ఒక సారి ఇలా ఊహించుకోండి, బ్రతికి ఉన్న మనిషిని మరణించారనుకొని మార్చురీలో ఉన్న ఫ్రీజర్ లో పెడితే ఎలా ఉంటుంది?. ఇది ఏ వ్యక్తికైనా పీడకల లాంటింది. ఇది ఎవ్వరికీ ఎప్పటికీ జరగకూడదు అని అందరూ అనుకుంటారు. కానీ, ఇది భారత దేశంలో జరిగింది.

అంతుబట్టని రహస్యాలు: మరణం తర్వాత ఏం జరుగుతుంది..?

మరణించిందని భావించి మహిళను మార్చురీలో ఉన్న ఫ్రీజర్ లో పెట్టారు. ఆ మహిళ కుటుంబ సభ్యులు ఆమె మరణించింది అనుకున్నారు. అయితే మార్చురీ లో ఫ్రీజర్ లో ఉన్న మహిళ బ్రతికే ఉంది.

ఈ ఆందోళన కలిగించే సంఘటన గురించి మర్రిన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం.

ఆ మహిళ వయస్సు 51 సంవత్సరాలు :

ఆ మహిళ వయస్సు 51 సంవత్సరాలు :

కేరళ కు చెందిన ఈ మహిళ వయస్సు 51 సంవత్సరాలు, ఈమె పేరు రత్నం. ఈమెకు పచ్చకామెర్ల వ్యాధి రావడంతో చికిత్స నిమిత్తం ఒక ఆసుపత్రిలో చేర్పించారు. ఈమె స్థితిని క్షుణ్ణంగా పరిశీలించిన వైద్యులు ఈమె బ్రతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అందుచేత ఇంటికి తీసుకెళ్ళిపోమన్నారు.

మార్గం మధ్యలో వెళ్తూ ఉండగా :

మార్గం మధ్యలో వెళ్తూ ఉండగా :

కుటుంబ సభ్యులు ఆమెను ఇంటికి తీసుకు వెళ్తుండగా మార్గమధ్యలో ఆమెలో చలనం లేదని మరియు దేనికి ప్రతిస్పందించడం లేదని గుర్తించారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు ఆమె మరణించిందని భావించి, ఆమె దేహాన్ని దగ్గరలో ఉన్న మార్చురీలో పెట్టారు. బంధుమిత్రులందరికీ ఆమె మరణించిందని చెప్పి, దహన సంస్కారాలు చేద్దామని మళ్ళీ ఆ మార్చురీ వద్దకు వచ్చారు.

జీవితంలో ఎప్పుడూ ఎదురు కానీ ఒక షాక్ కి గురయ్యారు :

జీవితంలో ఎప్పుడూ ఎదురు కానీ ఒక షాక్ కి గురయ్యారు :

దహన సంస్కారాలు చేద్దామని ఆ మార్చురీ చేరుకున్న రత్నం కుటుంబసభ్యులకు, వాళ్ళ జీవితంలో ఎప్పుడూ ఎదురుకాని గట్టి షాక్ తగిలింది. అందుకు కారణం చనిపోయిందని అనుకున్న ఆ మహిళ గంట తర్వాత వచ్చి చుస్తే బ్రతికే ఉంది. వాళ్ళ బంధువుల్లో ఒక వ్యక్తి, రత్నం ఊపిరి తీసుకుంటున్న విషయాన్ని గమనించి అది వారికి చెప్పాడు. దీంతో ఆమెను దగ్గరో ఉన్న ఆసుపత్రికి తరలించారు.

చివరికి మరణించింది :

చివరికి మరణించింది :

పచ్చ కామెర్ల వ్యాధి వల్ల ఆమె శరీరంలోని అవయవాలన్నీ విఫలమయ్యాయి, పని చేయకుండా పోయాయి. ఆమెను కాపాడటానికి వైద్యులు ఏమి చేయలేని స్థితికి పరిస్థితి దిగజారిపోయింది. అదే రోజు సాయంత్రం ఆమె మరణించింది.

ఒకవేళ ఆమె కుటుంబం ఆమెను ఆ గంట సేపు మార్చురీలో గనుక పెట్టకపోయి ఉంటే, మరికొన్ని రోజులు ఆమె ఆ వ్యాధి పై పోరాడి బ్రతికి ఉండేదేమో, అయితే చివరిగా విధిని ఎవ్వరు మార్చలేరు కదా !

English summary

Woman Was Assumed To Be Dead And Kept In A Mortuary Freezer

She was presumed to be dead, but was alive while she laid in the mortuary freezer, until her relatives noticed that she was still breathing.
Story first published: Tuesday, September 12, 2017, 20:00 [IST]