Latest Updates
-
నోరూరించే వెల్లుల్లి పచ్చడి..పక్కా కొలతలతో ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటది.. -
లొట్టలేసుకుంటూ తినేలా చేసే హైదరాబాద్ ఖట్టీ దాల్.. సాంబార్ కంటే రెట్టింపు రుచి.! -
ఇంట్లోనే అచ్చమైన స్వీట్ షాప్ స్టైల్ పాలకోవా..కేవలం రెండే పదార్థాలతో చేసుకోండిలా.. -
తెల్ల జుట్టుకి చెక్ పెట్టి, యవ్వన శక్తిని పెంచే ఆమ్లా మురబ్బా.. ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ.! -
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.!
మీ చిటికెన వేలు మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్తుందా?
మీ గురించి మీకు కొత్త విషయాలు చెప్పే కొన్ని వ్యక్తిత్వ పరీక్షలు వున్నాయి. వాటిల్లో కొన్ని శాస్త్రీయ పరిశోధనలకు సంబంధించినవి అయితే, కొన్నేమో విషయపరమైనవి. దక్షిణ కొరియాలో కనుగొనబడ్డ ఈ పరీక్ష, ప్రాచీన హస్తసాముద్రికం నుంచి అభివృద్ధి చెందినది.
ఈ పరీక్షలో, కేవలం ఒక్క విషయంతో మీ వ్యక్తిత్వాన్ని, దాని లక్షణాలను చెప్పేయవచ్చు. అదే మీ చిటికెన వేలు !
ఇదెలా సాధ్యం అని ఆశ్చర్యపోతున్నారా? ఒక వ్యక్తి తీరును స్వభావాన్ని చిటికెన వేలు చూసి నిర్ణయిస్తారా? అవును, అది తెలుసుకోగలం. చిటికెన వేలు పరిమాణం ముఖ్యంగా ఒక వ్యక్తి స్వభావాన్ని, ప్రవర్తనను, చుట్టూ వారితో ఎలా మెలగుతాడు వంటి విషయాలు తెలియచేస్తుంది.

మీ చిటికెన వేలు పొట్టిదా?
మీ చిటికెన వేలు చివర, మీ ఉంగరపు వేలు పై కణుపు కన్నా కింద ఉన్నట్లయితే మీరు సిగ్గరి, ఇతరులతో కలవడానికి ఇబ్బందిపడే వ్యక్తి అని అర్థం. మీరు పెద్దకలలను కనే వ్యక్తి కానీ మీ మౌనస్వభావంతో వాటిని నెరవేర్చుకోడానికి కష్టపడుతుంటారు.

మీ చిటికెన వేలు సమానఎత్తులో ఉంటే?
మీ చిటికెన వేలు చివర, ఉంగరపు వేలు పై కణుపుతో సరిసమాన ఎత్తులో ఉంటే, మీరు సంతులిత, మృదు స్వభావి అని అర్థం. మీ చుట్టూ ఉన్నవారు మీరెంత స్నేహస్వభావో, అద్భుత వ్యక్తో తెలుసుకోటానికి మిమ్మల్ని బాగా ఎరిగి ఉండాలని కూడా అర్థం.

మీ చిటికెన వేలు పొడుగు!
మీ చిటికెన వేలు ఉంగరపు వేలు పై కణుపుకన్నా దాటి పొడుగ్గా ఉంటే, దాని అర్థం మీరు ఆకర్షణీయులు మరియు స్నేహశీలి. కానీ అన్నిట్లో మీకు అదృష్టం కలిసిరాదు. అందుకని మిగతా రకాల వారికన్నా మీరు కష్టపడి పనిచేసి మిమ్మల్ని మీరు నమ్మకస్తులుగా నిరూపించుకోవాలి.

మీ చిటికెన వేలు మరింత పొట్టిగా ఉంటే?
ఈ రకాన్ని విశ్లేషించటానికి, మీ అరచేయిని ఒకసారి చూడండి. అన్ని వేళ్ళూ కలిసి అర్ధవృత్తంగా కన్పిస్తూ, మీ చిటికెన వేలు మిగతా వేళ్ళకన్నా చిన్నగా కన్పిస్తుందా? దాని అర్థం మీరు అనేక ఆలోచనలతో, ఆశయాలతో కలల ప్రపంచంలో విహరిస్తుంటారు.కానీ ఈ ప్రపంచంలో వాటిని నిజం చేయటానికి కష్టపడుతుంటారు.

మీ చిటికెన వేలు ఒకే పొడవుతో ఉంటే?
ఇది అరుదైన రకం. కొంతమందికి వారి చిటికెన వేలు,ఉంగరపు వేలుతో సమాన ఎత్తులో ఉంటుంది. దాని అర్థం ఆ వ్యక్తులు అన్నిట్లో ఆధిపత్యం కోరుకుంటారు. వారికి అన్నీ ఒకేసారి కదిలించివేసి నాశనం చేయగల శక్తి కూడా ఉంటుంది.

మీ చిటికెన వేలు చతురస్రంగా ఉంటే?
మీ చిటికెన వేలు చివర బల్లపరుపుగా ఉండి, అడ్డగీతలా కన్పిస్తుంటే, మీ చిటికెన వేలును చతురస్ర రకంగా చెప్పవచ్చు. దాని అర్థం మీవద్ద ప్రశంసించదగ్గ లక్షణాలున్నాయి. మీరు సూటిగా మాట్లాడే వ్యక్తి కావచ్చు. మీ నిజాయితీ, ముక్కుసూటి తత్వం మిమ్మల్ని నమ్మకస్తులుగా మారుస్తాయి.

మీ చిటికెన వేలు కొనదేలి ఉంటే?
మీ చిటికెన వేలు కొనదేలి ఉంటే దాని నలువైపులా ఏటవాలుగా కన్పిస్తుంది. ఇలా ఉన్న వ్యక్తులు రచయితలుగా రాణిస్తారు. ఎంతో వాక్పటిమ కలిగి ఉండి, సందర్భానుసారం వ్యవహరిస్తారు.

మీ చిటికెన వేలు వంపు తిరిగి ఉంది !
మీ చిటికెన వేలు మిగతా వేళ్ళ వైపు కానీ, దూరంగా కాని వంపు తిరిగి ఉన్నట్లయితే, దాన్ని వంకర చిటికెన వేలు అంటారు. దాని అర్థం భయం లేదా సంఘర్షణ. అంటే మీరు సాధారణంగా సంధి కుదిర్చేవారు, శాంతి పెంచేవారు, విడిపోయిన వారి మధ్య వారధిలా నిలబడేవారు.



Click it and Unblock the Notifications
