Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
యజమానికి సహకరించిందని పని మనిషి దుస్తులు చింపి దారుణంగా కొట్టారు, అర్ధనగ్నంగా పరుగులు (వీడియో)
యజమానికి సహకరించిందని పని మనిషి దుస్తులు చింపి దారుణంగా కొట్టారు, అర్ధనగ్నంగా పరుగులు పెట్టించారు, ఢిల్లీ పాలమ్, దిల్లీ పాలమ్, పనిమనిషిపై దారుణం, ఢిల్లీ పని మనిషి
తనకు ఉపాధి కల్పించిన యజమానికి ఆ పని మనిషి ఆసరాగా నిలుద్దామనుకుంది. ఎన్నో ఏళ్లుగా ఉపాధిని కల్పిస్తూ.. కష్టాల్లో తోడుగా ఉన్న యజమానిపై విశ్వాసం చూపిన ఓ పనిమనిషిపై అమానుషంగా ప్రవర్తించారు. యజమానికి సహకరించిందన్న కారణంతో ఆ మహిళపై దాష్టీకానికి పాల్పడ్డారు. ఆమె గుడ్డలూడదీసి అర్ధనగ్నంగా మార్చారు. ఆమెను రోడ్డుపై పరుగులు పెట్టించారు కర్కశులు.

వీడియోను సోషల్ మీడియాలో
స్థానికులు కొందరు ఆ వీడియోను తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయగా.. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. వివరాల్లోకి వెళ్తే...దక్షిణ ఢిల్లీ పాలమ్ ప్రాంతంలో 62 ఏళ్ల ఆశ తన కొడుకు-కోడలితో నివసించేంది.
తల్లి ఇంటి నుంచి వెళ్లగొట్టింది
అయితే కోడలి వైఖరితో ఆ ఇంట్లో గొడవలు చెలరేగగా.. కొన్ని రోజుల క్రితం ఆ జంటను సదరు తల్లి ఇంటి నుంచి వెళ్లగొట్టింది. ఆ తర్వాత కొడుకు తరచూ తల్లిని కలుస్తూ ఉండేవాడు. ఇటీవల కోడలు అత్త ఇంటి వద్ద గొడవకు దిగింది. ఈ క్రమంలో ఆ ఇంట్లో పని మనిషి(45) ఆమెను అడ్డుకునేందుకు యత్నించింది.

పని మనిషిపై దాడి
కోపంతో ఆ కొడుకు-కోడలు పని మనిషిపై దాడికి పాల్పడ్డారు. ఆమె దుస్తులు చించి, పిడి గుద్దులు గుప్పించారు. రోడ్ల వెంబడి పరుగులు పెట్టించారు. అడ్డుకోవటానికి యత్నించిన తల్లిపై కూడా దాడికి యత్నించారు.

వీడియోలు తీశారు
స్థానికులు చూస్తూ ఉండిపోయారే తప్ప(వీడియోలు మాత్రం తీశారు).. సాయానికి ముందుకు రాలేదు. చివరకు అక్కడి నుంచి పారిపోయిన బాధితురాలు ఫిర్యాదు చేయటంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ దంపతుల కోసం గాలింపు చేపట్టారు.



Click it and Unblock the Notifications
