Latest Updates
-
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. !
భూమిపై ఇప్పటివరకు పుట్టని మనుషులెవరో తెలుసా.. అయితే ఈ ఫొటోలపై ఓ లుక్కేయండి
మనిషిని పోలిన మనుషులు ఈ భూమిపై ఏడు మంది ఉంటారంటారు. ఈ ఏడుమంది ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతంలో ఉంటారని కూడా చాలా మంది నమ్ముతారు. అప్పుడప్పుడు మనం సేమ్ పోలికలతో ఉన్న మనుషులను చూస్తూ ఉంటాం. అయితే అసలు భూమిప
మనిషిని పోలిన మనుషులు ఈ భూమిపై ఏడు మంది ఉంటారంటారు. ఈ ఏడుమంది ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతంలో ఉంటారని కూడా చాలా మంది నమ్ముతారు. అప్పుడప్పుడు మనం సేమ్ పోలికలతో ఉన్న మనుషులను చూస్తూ ఉంటాం.
అయితే అసలు భూమిపై లేని మనుషులను, ఇంత వరకు పుట్టని మనుషులను కూడా చూసే అవకాశం వచ్చింది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా చాలా విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి.

కొత్త టెక్నాలజీని ఉపయోగించి
అందులో భాగంగానే ఇప్పుడున్న ఒక కొత్త టెక్నాలజీని ఉపయోగించి రకరకాల మనుషుల ఫొటోలను క్రియేట్ చేస్తున్నారు కొందరు.

ఫొటోలను క్రియేట్ చేస్తూ
అసలు ఈ ప్రపంచంలోని లేని మనుషుల ఫొటోలను క్రియేట్ చేస్తున్నారు. టెక్నాలజీ సాయంతో ఇలాంటి ఈ చిత్రాలను క్రియేట్ చేస్తున్నారు.

చాలా రకాల ఫొటోలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా రకాల ఫొటోలను సృష్టిస్తూ ఉంది. కొన్ని రకాల వాహనాల ఫొటోలను, జంతువుల ఫొటోలను కూడా ఈ విధంగా క్రియేట్ చేస్తున్నారు.

ప్రాణం పోస్తున్నారు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో ఎన్ విఐడీఐఏ పరిశోధకులు ఇలాంటి రూపాలకు ప్రాణం పోస్తున్నారు. అసలు ఈ భూమి మీద లేని కొందరి ఫొటోలను వీరు క్రియేట్ చేసి వెబ్ సైట్లలో ఉంచతున్నారు.

ఎన్ విఐడీఐఏ పరిశోధకులు
కొన్ని రకాల సాఫ్ట్ వేర్స్ ఉపయోగించిఎన్ ఎన్ విఐడీఐఏ పరిశోధకులు ఇలాంటి ఫొటోలు క్రియేట్ చేస్తున్నారు. మనుషులతో పాటు కార్లు, పిల్లులు, ఫర్నీచర్ ఇలాంటి చాలా ఫొటోలను వీరు క్రియేట్ చేస్తున్నారు.
ప్రపంచం మొత్తం వెతికినా
వీళ్లు క్రియేట్ చేసిన ఫొటోల్లోని మనుషులు మొత్తం కూడా ఎక్కడో చోట ఉంటారేమో అన్నట్లుగా ఉంటారు. కానీ మీరు ప్రపంచం మొత్తం వెతికినా కూడా అలాంటి మనుషులను పట్టుకోలేరు. అదే మరి క్రియేటివిటీ అంటే.
ఫొటోలపై ఓ లుక్కేయండి
మొత్తానికి NVIDIA రీసెచర్స్ generative adversarial network (GAN) ద్వారా కొన్ని వేల రకాల ఫేక్ ఫేస్ లను వీరు క్రియేట్ చేశారు. మీరు ఆ ఫొటోలపై ఓ లుక్కేయండి.










Click it and Unblock the Notifications
