For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చట్టాలు చేసి నిషేధింపబడినప్పటికి, భారతదేశంలో విచ్చలవిడిగా సాగుతున్న కొన్ని అసాంఘిక కార్యకలాపాలు.

|

ప్రజాస్వామ్య దేశం అయినప్పటికీ, భారతదేశం నియమాలను ఉల్లంఘించటానికి చాలా ప్రసిద్ది చెందింది. రోజురోజుకు అనేక కొత్త నియమాలు పుట్టుకొస్తున్నప్పటికి, ఆ నియమాలను నిర్విఘ్నంగా అతిక్రమించే ఘనాపాటులు కూడ కోకొల్లలుగా పుట్టుకొస్తున్నారు.

ఇక్కడ, ఈ వ్యాసంలో, భారతదేశంలో నిషేధించిన కొన్ని విషయాల గురించి మీతో పంచుకోబోతున్నాము. కానీ ఈ నిషేదాజ్ఞలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయా? లేదా నిజంగా నిషేధించబడ్డాయా? అని మీరు తప్పక ఆశ్చర్యానికి గురి అవ్వకమానరు!

భారతదేశంలో అధికారికంగా నిషేధించిన ఆ విషయాలు ఏమిటో, వాటిని గురించి కనీస అవగాహన లేని ప్రజలు ఏ తీరుగా ఉల్లంఘిస్తున్నారో తెలుసుకోవాలంటే, చదవండి ఇక!

1. బాల కార్మికులు:

1. బాల కార్మికులు:

మనం బయటకు వెళ్ళినప్పుడు, రోడ్డు పక్కాగా ఉండే రెస్టారెంట్లు, కాఫీ బార్లు, దుకాణాలు మరియు ఇళ్లలో అన్ని చోట్లా పని చేస్తున్న బాలబాలికలను చూడవచ్చు. ఇందులో గణనీయమైన సంఖ్య, వారి స్థానిక ప్రదేశాల్లో కూడా పనిచేయడం లేదు. బాల కార్మిక (నిషేధం మరియు నియంత్రణ) చట్టం 1986 నుండి అమలు చేయడం మొదలు అయ్యింది మరియు దీనిని 2006 మరియు 2008 సంవత్సరాలకు కూడా విస్తరించారు. ఇంత చేసినప్పటికీ, దేశంలో కార్మిక వ్యవస్థలో మగ్గుతున్న బాలల యొక్క పరిస్థితిలో పెద్ద మార్పు కనపడలేదు.

సమస్యను అధికారికంగా గుర్తించినప్పటికీ, నిపుణులు, పెద్దలను ఒప్పించి పిల్లలను పనిలోకి కాకుండా బడి దారి పట్టించడంలో దారుణంగా విఫలమయ్యారు. ఎందుకంటే, ఈ బాలలలో అధిక శాతం పేద మరియు బడుగు వర్గాలకు చెందిన కుటుంబాలలోని వారే!

అత్యంత కఠినతరమైన వైఖరిని ప్రదర్శిస్తేనే, ఈ సమస్యను అణగదొక్కడం సాధ్యమవుతుంది. కఠినతరమైన నిబంధనలు చేస్తేనే పెద్దలు తమ పిల్లలను బడిబాట పట్టిస్తారు.

2. పైరసీ:

2. పైరసీ:

ఈ అక్రమ కార్యకలాపం చాప కింద నీరులాగా వ్యాపించి, ఊహ కందని స్థాయికి చేరుకుంది. స్వేచ్ఛగా ఎదిగే సంగీత పరిశ్రమ యొక్క ఆనవాళ్లు భారతదేశంలో ఇంచుమించుగా తుడిచిపెట్టుకు పోయాయి. సంగీత కళాకారుల యొక్క రికార్డులను వారి పేరు లేకుండానే నకిలీ కాపీలను తయారుచేసి విచ్చలవిడిగా విక్రయాలు జరుపుతున్నారు. దీని వలన సంగీత కళాకారులకు వారి ఆర్జనను నష్టపోతున్నారు.

ఈ రకమైన దోపిడీ వలన బాలీవుడ్ పరిశ్రమ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ దురదృష్టకర పరిస్థితి మూలంగా రూ .16,000 కోట్లు బాలీవుడ్ నష్టపోయింది దర్యాప్తులో తేలింది.

ఇంకొక నివేదిక, పైరసీ మూలంగా సంగీత పరిశ్రమకు అనుబంధంగా పనిచేసిన 800,000 మంది తమ జీవనభృతిని కోల్పోయారు.

3. రెడ్ లైట్ ప్రాంతాలు:

3. రెడ్ లైట్ ప్రాంతాలు:

ప్రతి నగరంలో ఈ సమస్య వేళ్ళానుకుని ఉంది. సంఘ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపి, రెడ్ లైట్ ప్రాంతాలలో శృంగారాన్ని వ్యాపారంగా మార్చినప్పటికి, దీనిని నిలువరించడంలో అధికారుల పాత్ర నామమాత్రంగా ఉందనేది సుస్పష్టమే!

ఎటువంటి అనుమతులు లేకుండా వ్యభిచార కార్యకలాపాలు నిర్వర్తించడం, అనైతిక వ్యవహారాలు నడపడం మరియు సెక్స్ రాకెట్లు నిర్వహించడం ప్రతి చోట సర్వసామాన్యం అయిపోయాయి. ఇలాంటి అనారోగ్యకర వాతావరణం ఉన్న ఇళ్ళలో, వేశ్యల మధ్య ఎదిగే యువకులు, ఈ వ్యవహారాన్ని మరీంత ముందుకు తీసుకువెళుతున్నారు.

4. గర్భస్రావాలు మరియు లైంగిక నిర్ధారణ:

4. గర్భస్రావాలు మరియు లైంగిక నిర్ధారణ:

భారతదేశంలో ఈ రెండూ అక్రమ వ్యవహారాలు అయినప్పటికీ, ఈ వ్యవహారాలు నడిపే కేంద్రాలు ఎక్కడికక్కడ పుట్టగొడుగుల్లాగా పుట్టుకు వస్తున్నాయి. ఒకప్పుడు భారతదేశంలో ఆడబిడ్డను భారంగా భావించి, వారి ప్రాణాలను మొగ్గలోనే తుంచివేసే సంప్రదాయానికి, చరమగీతం పాడటానికి ఉద్దేశించి తయారు చేయబడిన చట్టాలను కొన్ని ప్రాంతాల్లో ఉల్లంఘిస్తున్న సంఘటనలు నేటికి కోకొల్లలు.

లైంగిక నిర్ధారణ సంబంధించిన చట్టాలను 1994 నుండి అమలు చేయబడుతున్నప్పటికీ, ఆడ పిండాలను గర్భస్రావం ద్వారా తొలగించడం ఏ మాత్రం తగ్గలేదు.

5. అక్రమంగా నాటుసారా మరియు మద్యాన్ని అమ్మడం:

5. అక్రమంగా నాటుసారా మరియు మద్యాన్ని అమ్మడం:

మనుషుల ప్రాణాలతో చెలగాటమాడే అక్రమ మద్యంలో ప్రాణాంతకమైన బ్యాటరీ ఆమ్లాలు, సమ్మేళన ద్రావకాలు, మరియు మిథైల్ ఆల్కహాల్ ఉంటాయి.

అలాంటి మద్యపాన తయారీ మరియు అమ్మకాలకు వ్యతిరేకంగా కఠినమైన చట్టాలు భారతదేశంలో ఉన్నప్పటికీ, ఈ వ్యాపారం నిరాటంకంగా దినదిన ప్రవర్ధమానం చెందుతున్నది.

కల్తీ మద్యానికి అలవాటు పడి ప్రాణాలు కోల్పోయిన పేద ప్రజల సంఖ్య, గుబులు రేప్పేట్టు ఉంది.

భారతదేశంలో నిషేధించబడిన ఇలాంటి అనేక అంశాలు ఉన్నాయి. వాటిని గురించి మీ అభిప్రాయాన్ని మాకు తెలపండి.

English summary

Banned Things That Are Still Being Used In India

India is one of those nations where banning something is not taken seriously while other countries follow all the rules regularly. From prohibiting child labour to even piracy, the business does not seem to go down as people still tend to do or use these things, despite them being banned in the nation.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more