ఆడవారిలాగా దొంగ ఏడుపులు.. మగవారు ఏడ్వలేరు ఎందుకో తెలుసా?

Written By:
Subscribe to Boldsky

మన పని మనం చేసుకుంటూ ఉన్నా కూడా అవతలి వ్యక్తి మనల్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తే అప్పడు మనకు వచ్చేదే కోపం. మన ప్రమేయం ఏమి లేకుండానే అది కట్టలు తెంచుకుని వస్తుంది. దాన్ని ఆ క్షణంలో కంట్రోల్ లో ఉంచాలాంటే చాలా కష్టం. కోపం ఎక్కువగా మగాళ్లకే వస్తూ ఉంటుంది.

మగవారు తట్టుకోలేరు

మగవారు తట్టుకోలేరు

ఎవరైనా ఏదైనా అంటే మగవారు తట్టుకోలేరు. అవతలి వాడి తల నరుకుదామనే కోపంతో రగిలిపోతుంటారు. కోపం తగ్గాలంటే అతని మనస్సులో ఉన్న విషయం కచ్చితంగా బయటకు కక్కాల్సిందే. ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉన్నా సరే ఆలోచించరు పురుషులు.

కోపాన్ని నియంత్రించుకోలేరు

కోపాన్ని నియంత్రించుకోలేరు

అలా కోప్పడినందుకు ప్రాణాలు పోతాయని తెలిసినా దానికైనా రెడీ అవుతారని గానీ కోపాన్ని మాత్రం మనస్సులో దాచుకుని నటించలేరు. మనస్సులో ప్రతి మాటను కోపం వచ్చినప్పుడు బాహటంగానే చెప్పేస్తారు మగవారు. కొన్ని హార్మోన్న ప్రభావం మగవారు కోపాన్ని నియంత్రించుకోలేరు. ఇదంతా కోపం గురించి. అలాగే మగవారు అవతలి వ్యక్తి గురించి చాడీలు చెప్పరంట. ఏదైనా డైరెక్ట్ గానే చెబుతారు. డైరెక్ట్ గానే మాట్లాడుతారు. మనస్సలో ఒకటి ఉంచుకుని బయటకు ఒకరకంగా నటించే మనసత్వం మగవారికి ఉండదు.

ఏడుపులో ఆడవాళ్లే ఫస్ట్

ఏడుపులో ఆడవాళ్లే ఫస్ట్

మరి ఏడుపు విషయలోకి వస్తే ఆడవాళ్లు దానికి కేరాఫ్ అడ్రస్. అయితే వాళ్లు నిజంగా ఏడుస్తారంటే కూడా అది కూడా అనుమానమే. చాలామంది ఆడవాళ్లు దొంగ ఏడుపులతో నటిస్తుంటారు. అమ్మాయిలు చాలా వరకు వెక్కివెక్కి ఏడుస్తారు. అవతలి వ్యక్తి ఏమి అనుకున్నా కూడా కొందరు ఆకాశానికి చిల్లు పడిందా అనేలా కళ్లలోనుంచి కన్నీరు కారుస్తూ ఉంటారు.

మగవారు దొంగఏడుపులు ఏడ్వరు

మగవారు దొంగఏడుపులు ఏడ్వరు

మరి మగవాళ్లు ఎందుకు అలా దొంగ ఏడుపులతో నటించరు అంటే అది వారి జీన్స్ లోనే ఉంటుంది. మగవారు ఎలాంటి పరిస్థితుల్లో కూడా దాదాపుగా ఏడవరు. అలా అని వారు మగవారికి మనస్సు ఉండదని కాదు. వారు మనస్సు కూడా చాలా సున్నితంగా ఉంటుంది.

కన్నీటి చుక్క రాదు

కన్నీటి చుక్క రాదు

ఎంతకష్టం వచ్చినా, అవతలి వ్యక్తి ఎంత బాధ పెట్టినా కూడా చాలామంది మగవారి కంట్లో నుంచి కన్నీటి చుక్క కూడా రాదు.

మరి ఎందుకంత ధైర్యంగా మగవారు ఉండగలుగుతారనే దానికి చాలా కారణాలున్నాయి.

మగవారికి ఫీలింగ్స్ ఉండవా?

మగవారికి ఫీలింగ్స్ ఉండవా?

మగవారికి మాత్రం ఫీలింగ్స్‌ ఉండవా.. ఇంతకీ మగవారికి ఆడవారికి ఉన్న తేడా ఏంటి? ఇటువంటి ప్రశ్నలన్నింటికీ పరిశోధకులు కారణాలు కనుగొన్నారు. తాజాతా ఒక పరిశోధనలో మగవారి ఎమోషనల్స్ విషయానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

మెదడు ఆకారం వేర్వేరుగా

మెదడు ఆకారం వేర్వేరుగా

అమ్మాయిలు, అబ్బాయిల్లో మెదడు ఆకారం వేరువేరుగా ఉంటుంది. అబ్బాయిల మెదడులో భావోద్వేగాలను అదుపులో ఉంచే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే అబ్బాయిల్లో ఏడుపును నియంత్రించే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది.

ఎమోషనల్ గా చాలా స్ట్రాంగ్

ఎమోషనల్ గా చాలా స్ట్రాంగ్

మగవారు ఏ ఎమోషనల్‌ విషయానికి కూడా పెద్దగా కనెక్ట్ అవ్వరు. అబ్బాయిలకు ఎంత బాధ వచ్చిన కూడా ఏడవకుండా ఉండడానికి కారణం ఇదే. కోపంలో ముందుంటారుగానీ.. ఏడవడంతో మాత్రం చాలా వెనుక ఉంటారు. ఎంత ఇబ్బంది వచ్చినా దాన్ని ఎదుర్కొని సాధిస్తాం అనే ధైర్యం మగవారి నరనరాల్లో ఉంటుంది. అందుకే మగవారు ఏడవరు.

బలహీనత

బలహీనత

కన్నీరుపెట్టుకుని ఏడ్వటాన్ని మగవారు ఒక బలహీనతగా భావిస్తారు. ఒక అధ్యయనం ప్రకారం ఆడవాళ్లు సంవత్సరంలో సగటున నలభైఏడు సార్లు ఏడిస్తే, మగవాళ్లు కేవలం ఏడుసార్లు మాత్రమే ఏడుస్తారట.

హర్మోన్లలో మార్పు

హర్మోన్లలో మార్పు

యవ్వనంలోకి అడుగుపెట్టాక ఆడమగవారిలో హార్మోన్లలో మార్పులు వస్తాయి. అబ్బాయిల్లో ఉండే టెస్టోస్టిరాన్స్ అనే హార్మోన్లు ఏడ్చే గుణాన్ని తగ్గిస్తే, అమ్మాయిల్లో ఉండే ఈస్ట్రోజన్ ప్రొలాక్టిన్స్ అనే హార్మోన్లు ఏడవడానికి కారణమవుతాయి.

English summary

Boys Are Not As Emotional As Girls, Here's Why!

Boys Are Not As Emotional As Girls, Here's Why!
Story first published: Monday, January 8, 2018, 17:30 [IST]