For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రహ్మ రాసిన తలరాతను చదువుకో, ఎంతకాలం బతుకుతావో తెలుసుకో, తిరునెల్లి ఆలయానికెళ్లి తలరాతను మార్చుకో

రాసిన రాతను చెరపటం మనిషి తలరాత రాసిన బ్రహ్మ కి కూడా సాధ్యం కాదట. మనిషి తలరాత రాయటం వరకే బ్రహ్మ పని. బ్రహ్మ రాసిన తలరాతను చదువుకో, ఎంతకాలం బతుకుతావో తెలుసుకో, తిరునెల్లి ఆలయానికెళ్లి తలరాతను మార్చుకో

By Arjun Reddy
|

రాసిన రాతను చెరపటం మనిషి తలరాత రాసిన బ్రహ్మ కి కూడా సాధ్యం కాదట. మనిషి తలరాత రాయటం వరకే బ్రహ్మ పని. ఆ తర్వాత మనిషి తలరాతకి యముడు ఒక్కడే హక్కుధారుడు అని కొందరు అంటుంటారు. అంతా తలరాత.. ఏది రాసుంటే అదే జరుగుతుందని మనలో చాలా మంది అంటుంటారు. దీనిని ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా అని ఉంటారు.

అయితే ఎవరూ కూడా వారి తలరాత ఎలా ఉంటుందో చదువుకుని ఉండరు. ఎందుకంటే నుదుడిపై ఆ బ్రహ్మ రాసే రాత మనకు కనిపించదని అనాదిగా ఓ నమ్మకం.

తలరాత సరిగ్గా రాయలేదు

తలరాత సరిగ్గా రాయలేదు

ఇక మనకు ఏదైనా చెడు జరిగినప్పుడు... అంతా మన తలరాత.. అని బ్రహ్మ దేవుణ్ణి తలుచుకుంటాం. ఇలా కష్టాలు ఎదురైనప్పుడల్లా బ్రహ్మ దేవుడు నా తలరాత సరిగ్గా రాయలేదు... నా జీవితంలో అన్ని కష్టాలే అని వాపోతుంటారు. నిజానికి ఈ లోకంలో ఉన్న ప్రతీ మనషి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటుంది. అదే ‘బుద్ధి కర్మానుసారిణీ...'

పాపఫలాన్ని మూటగట్టుకుని ఉంటారు

పాపఫలాన్ని మూటగట్టుకుని ఉంటారు

అంటే ప్రతీ మనిషి తను గతజన్మలో చేసిన పాప పుణ్యాలే ఈ జన్మలో తన తలరాతను నిర్దారిస్తుందని అర్ధం. ఎన్నో పుణ్యకార్యాలు చేస్తున్నప్పటికీ కష్టాలు పడుతున్నవారు పూర్వ జన్మలో ఇంతకుమించిన పాపఫలాన్ని మూటగట్టుకున్నారని అర్థం. అలాగే ఇప్పుడు దుష్కర్మలు ఆచరిస్తూ కూడా సుఖంగా జీవిస్తున్నవారు గత జన్మలో సత్కార్యాలు చేసి ఉంటారు. కానీ వచ్చే జన్మకు మోయలేనంత పాపభారాన్ని సిద్ధం చేసుకుంటున్నారని వారు గ్రహించలేరు.

కర్మఫలాన్ని నిష్పక్షపాతంగా ఇవ్వడమే..

కర్మఫలాన్ని నిష్పక్షపాతంగా ఇవ్వడమే..

ఈ కర్మఫలాన్ని నిష్పక్షపాతంగా ఇవ్వడమే ఆ భగవంతుడు చేస్తున్న పని. కానీ పాపపుణ్యాల తేడా తెలుసుకుని విచక్షణా జ్ఞానంతో ప్రవర్తించగలిగే అవకాశం, శక్తి దేవుడు మనిషికి మాత్రమే ఇచ్చాడు. అందుకే ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఈ జన్మలో సత్కార్యాలు చేస్తే మరుజన్మకు పుణ్యం సంపాదించుకోగలరు. మనం చేసే తప్పొప్పులకు పూర్తి బాధ్యత మనదే.

తప్పు చేయాలనుకున్నా చేయలేం

తప్పు చేయాలనుకున్నా చేయలేం

మనకెవరైనా ఏమి చేస్తే అన్యాయం జరిగిందని వాపోతామో ఆ పనిని మనం ఇతరులకి చేయకుండా ఉండడంలోనే పరమార్ధం ఉంది... అదే పరమధర్మం. ప్రతీ ఒక్కరు ఆ ధర్మాన్ని అనుసరిస్తే చాలు.. తప్పు చేయాలనుకున్నా చేయలేం.

అయితే ఇప్పుడు తలరాతను కూడా చదవొచ్చని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు. ఇంతకూ ఎలా చదవాలి, దానిని బట్టి ఎవరు ఎన్ని సంవత్సరాలు జీవిస్తారు? అనేది చూద్దాం..

ఇలా చేయాలి

ఇలా చేయాలి

ముందుగా నుదుటిపై ఆయిల్ రాసి మ‌ర్దన చేయాలి. ఆ తర్వాత అద్దం ముందు నిలబడి కనుబొమ్మలను పైకి కింద‌కు చేయాలి. ఆ స‌మ‌యంలో ఏర్పడ్డ గీత‌లే మీ తలరాతలన్నమాట. వాటి ఆధారంగా మీ ఆరోగ్యాన్నీ, జీవించే వ‌య‌స్సును తెలుసుకోవొచ్చని సాముద్రిక శాస్త్రం చెబుతోంది.

45 నుంచి 50 ఏళ్ల వ‌ర‌కు జీవిస్తారు

45 నుంచి 50 ఏళ్ల వ‌ర‌కు జీవిస్తారు

నుదుటిపై ఎటువంటి గీతలు లేకపోతే.. వాళ్లు 45 నుంచి 50 ఏళ్ల వ‌ర‌కు జీవిస్తారు. అలాగే వీరు జీవితంలో అనేక సమస్యల్ని ఎదుర్కొంటారు. నుదుటిపై ఐదు గీతలుంటే...ఐదు గీతలుండి, అనేక అతుకులు ఉంటే వారు అల్పాయుష్కులు. అకారణంగా చనిపోతారు.

పేరు ప్రఖ్యాతులు

పేరు ప్రఖ్యాతులు

నుదుటిపై గీతలు ఒకదానికొకటి తాకుతుంటే.. వీరు 60 ఏళ్ల వరకు జీవిస్తారట. అంతే కాకుండా అంటువ్యాధులు, చ‌ర్మవ్యాధుల బారిన ప‌డతారు. నుదుటిపై నల్లటి, లోతైన గీతలుంటే వీరు 60 నుంచి 65 ఏళ్లు జీవిస్తారట. మంచి ధ‌న‌వంతులు అయి ఉంటారు. పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారట.

మూడు బలమైన గీతలుంటే

మూడు బలమైన గీతలుంటే

నుదుటిపై మూడు బలమైన గీతలుంటే.. వీరు 75 నుంచి 85 ఏళ్ల వ‌ర‌కు జీవిస్తారట. ప్రశాంత జీవ‌నం గ‌డుపుతారట. నుదుటిపై అయిదు గీత‌లుండి ఒక‌దానికి మ‌రొక దానికి పోలిక లేకుంటే.. వీరు వంద ఏళ్లు బతుకుతారట. పరిపూర్ణ ఆరోగ్య వంతులుగా ఉంటారట. మీరు ఒక ఆలయానికి వెళ్తే మీ తలరాత మారుతుందట. మరి ఆ కథ ఏమిటో కూడా తెలుసుకోండి.

కేరళకు ఎంతో పేరుంది

కేరళకు ఎంతో పేరుంది

దేవుడు తన స్వహస్తాలతో సృష్టించిన ప్రాంతంగా కేరళకు ఎంతో పేరుంది. అక్కడ ఉండే ప్రకృతి రమణీయత చూస్తే అది నిజమే అనిపిస్తుంది. కేరళలో తిరునెల్లి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఇక్కడ పూజాపునస్కారాలు అందుకునేది మహావిష్ణువే అయినా ఆలయం కట్టించింది మాత్రం బ్రహ్మదేవుడు.

వైకుంఠానికి మార్గం

వైకుంఠానికి మార్గం

దీని గురించి ముఖ్యమైన విశేషం ఏమిటంటే... తిరునెల్లి ఆలయం నుంచి వైకుంఠానికి మార్గం ఉందని నమ్ముతారు. ఆ మార్గం ద్వారా విష్ణువును పూజించడానికి నిత్యం బ్రహ్మదేవుడు వస్తుంటాడని చెబుతారు. భక్తులు గనుక ఈ తిరునెల్లి ఆలయాన్ని దర్శిస్తే బ్రహ్మదేవుడు వాళ్ల తలరాతను మళ్లీ తిరిగి రాస్తాడట. అందుకే నిత్యం వందలమంది ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. విదేశాల నుంచి కేరళ పర్యటనకు వచ్చే ఫారెనర్లు ఈ ఆలయాన్ని తప్పక సందర్శిస్తారు.

వేదవ్యాసుడు రాసిన పురాణాల్లో ప్రస్తావన

వేదవ్యాసుడు రాసిన పురాణాల్లో ప్రస్తావన

ఎంతో చరిత్ర ఉన్న ఈ గుడిని క్రీస్తుశకం 962వ సంవత్సరంలో తమిళచక్రవర్తి మొదటి భాస్కర రవివర్మ నిర్మించారని ప్రచారంలో ఉంది. అంతేకాదు, తిరునెల్లి గురించి వేదవ్యాసుడు రాసిన పురాణాల్లో కూడా ప్రస్తావన ఉంది. మశ్చ్య, స్కంధ, నరసింహ, పద్మ పురాణాల్లో తిరునెల్లి వైష్ణవాలయం గురించి ఎన్నో దృష్టాంతాలు కనిపిస్తాయి. ఈ ఆలయ నిర్మాణం వెనుక ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి. ఒకనాడు బ్రహ్మదేవుడు కేరళ మీదుగా విహరిస్తుండగా బ్రహ్మగిరులలో ఉన్న తిరునెల్లి ప్రాంతం ప్రకృతి అందాలకు ముగ్ధుడైపోయాడట.

వైకుంఠమే అక్కడికి దిగివచ్చినట్టు

వైకుంఠమే అక్కడికి దిగివచ్చినట్టు

అక్కడ ఓ ఉసిరి చెట్టుకింద శ్రీమహావిష్ణువు విగ్రహం చూసి ఆశ్చర్య చకితుడయ్యాడట. దాని చుట్టూ జింకలు, కుందేళ్లు, నెమళ్లు వంటి సాధు వన్యప్రాణులే కాకుండా సింహాలు, పులులు, తోడేళ్లు వంటి క్రూరమృగాలు కూడా ఎంతో స్నేహపూర్వకంగా ఆడుకోవడం చూశాడట. వైకుంఠమే అక్కడికి దిగివచ్చినట్టు భావించిన బ్రహ్మదేవుడు ఈ విషయాన్ని దేవతలకు, యక్షులకు కూడా చెప్పి వాళ్లను కూడా తిరునెల్లి ప్రాంతానికి తీసుకువచ్చి అక్కడి వింతలు చూపించాడట.

తలరాత మారుతుందట

తలరాత మారుతుందట

అక్కడ ఉసిరి చెట్టు కాండంలో కొలువై ఉన్న విష్ణుమూర్తి విగ్రహం చుట్టూ ఆలయం నిర్మించి దానికి దైవత్వం ప్రసాదించాడట. అప్పటినుంచి ఈ గుడి ముందు ఉన్న కొలనులో పూజ చేసి స్వామివారిని దర్శిస్తే వాళ్ల తలరాత మారుతుందని భక్తులు విశ్వసిస్తారు.

English summary

death prediction according to forehead lines

death prediction according to forehead lines
Desktop Bottom Promotion