Latest Updates
-
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్‌షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే! -
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు!
రొనాల్డిన్హో ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకుంటున్నావ్.. వాళ్లు నీతో ఫుట్ బాల్ ఆడుకోకుండా చూస్కో
బ్రెజిల్ ఫుట్ బాల్ ప్లేయర్ రొనాల్డిన్హో గురించి ఫుట్ బాల్ ప్రేమికులందరికీ తెలుసు. రొనాల్డిన్హో భార్యల పేర్లు ప్రిసిల్లా కోయిల్హో, బీట్రెజ్ సౌజా. రొనాల్డిన్హో ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకుంటున్నావ్.
బ్రెజిల్ ఫుట్ బాల్ ప్లేయర్ రొనాల్డిన్హో గురించి ఫుట్ బాల్ ప్రేమికులందరికీ తెలుసు. ఫుట్‌బాల్ స్టార్‌గా రొనాల్డినో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఈయన ఆటను కాస్త పక్కకు పెడితే.. రొనాల్డినో వక్తిగత జీవితం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. రొనాల్డినో ఇద్దరు అమ్మాయిలతో సహజీవనం చేస్తున్నాడు.
ఇద్దరూ కావాలంటా
వారి పేర్లు ప్రిసిల్లా కోయిల్హో, బీట్రెజ్ సౌజా. ఈ ఇద్దరంటే
రొనాల్డినోకు బాగా ఇష్టం. ఇద్దరిలో ఏ ఒక్కరినీ వీడలేనంత ప్రేమ రొనాల్డినోకు ఉంది. మరి ఇద్దరూ కావాలంటే కాస్త కష్టం కదా అని అనుకోవొచ్చు. కానీ రొనాల్డినోకు ఇద్దరూ కావాలంటా. ఇద్దరినీ పెళ్లి చేసుకుంటా.. ఇద్దరమ్మాయిలతో సంసారం చేస్తా అంటున్నాడు. వారిద్దరికీ అన్నింట్లో సమన్యాయం చేస్తాను. ఇద్దరి మధ్య ఏ గొడవలు రాకుండా సుఖపెడతా అంటున్నాడు. మరి ఆ కథ ఏమిటో చూద్దామా.

రొనాల్డిన్హోకు ఇద్దరు అమ్మాయిలతో పెళ్లి
బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం రొనాల్డిన్హో ఒకేసారి ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకోకున్నట్లు సమాచారం. 38 ఏళ్ల రొనాల్డిన్హో గత ఏడాది డిసెంబరు నుంచి రియోడిజనారియాలో తన ఇద్దరు ప్రియురాళ్లతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాడు.

ప్రేమగా చూసుకుంటున్నాడు
ప్రిసిల్లాతో కొన్నేళ్లుగా ప్రేమలో(2012 నుంచి) ఉన్న ఈ స్టార్ ప్లేయర్, బియాట్రిజ్‌తో మాత్రం 2016 నుంచి అఫైర్ కొనసాగిస్తున్నాడు. తన ఇద్దరి ప్రియురాళ్లను రొనాల్డిన్హోఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు.

ఎంగేజ్‌మెంట్ రింగ్స్
గత ఏడాది జనవరిలో ఇరువురి ముందు పెళ్లి ప్రస్తావన తీసుకురాగా వారు ఒప్పుకున్నారు. ఆ తర్వాత వారికి ఎంగేజ్‌మెంట్ రింగ్స్ కూడా తొడిగాడు. అంతేకాదు ఇద్దరికి ప్రతి నెల రొనాల్డిన్హో కొంత పాకెట్ మనీ కూడా ఇస్తుంటాడట.

ఎటువంటి గొడవలూ లేవు
ఇక ప్రస్తుతానికి ఈ అమ్మాయిలిద్దరి మధ్యా ఎటువంటి గొడవలూ లేవని రొనాల్డినో క్లారిటీ ఇచ్చాడు. రొనాల్డినో సైతం వీరిద్దరినీ ఒకేలా చూస్తుంటాడట. ఇటీవలి తన విదేశీ పర్యటన తరువాత ఇద్దరికీ ఒకే రకమైన పర్ఫ్యూమ్ తెచ్చాడని తెలుస్తోంది.

1500 డాలర్లు
అయితే ఇద్దరు గర్ల్‌ఫ్రెండ్స్ కు రొనాల్డిన్హో నెలనెలా 1500 డాలర్లు ఇస్తున్నాడట. ఆ డబ్బును వాళ్లు నచ్చినట్టుగా ఖర్చు చేయవచ్చు. ఇలా తాను ఎక్కడికి వెళ్లినా ఇద్దరికి ఒకేలాంటి కానుకలు తెస్తుంటాడు. గత ఏడాది రొనాల్డిన్హో తన ఇద్దరి ప్రియురాళ్లతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. దీనిపై అప్పుడు అతడ్ని వివరణ అడగ్గా.. ఎంగేజ్‌మెంట్ జరిగితే తప్పక చెబుతానని చెప్పాడు.

మరోసారి పెళ్లి చేసుకుంటే
బ్రెజిల్‌లో ఒక నియమం ఉంది. ఒకసారి పెళ్లి అయిన వ్యక్తి మరోసారి పెళ్లి చేసుకుంటే అక్కడ చట్ట విరుద్ధం. దీన్ని అతిక్రమించిన వారికి సుమారు ఆరేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తారు. ఈ కారణంగానే రొనాల్డిన్హో ఒకేసారి ఇద్దరు ప్రియురాళ్లను పెళ్లి చేసుకుంటున్నట్లు సమాచారం.

ఆగస్టులో పెళ్లి
ఇద్దరమ్మాయిలతో రొనాల్డినో పెళ్లికి పలువురు సెలబ్రిటీలు, ప్రముఖులు రానున్నారట. రియోలోని శాంటా మొనికా కండోమినియంలో ఆగస్టులో పెళ్లి జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. అయితే రోనాల్డిన్హో పద్ధతులు నచ్చని అతని సోదరి, తాను మాత్రం ఆ వివాహానికి హాజరుకాబోనని ప్రకటించారు.

998లో ఆరంగ్రేటం
1998లో అంతర్జాతీయ ఫుట్‌బాల్ మ్యాచ్‌ల ఆరంగ్రేటం చేసిన రోనాల్డిన్హో.. సొంత దేశం బ్రెజిల్ తరపున 97 మ్యాచ్‌లు ఆడి 33 గోల్స్ చేశాడు. 2002లో బ్రెజిల్‌కు వరల్డ్ కప్ దక్కటంలో రోనాల్డిన్హోదే కీలక పాత్ర. తర్వాత బార్సిలోనా తరపున 2003 నుంచి 2008 వరకు ఆడాడు. గతేడాది భారత్‌లో నిర్వహించిన ప్రీమియర్ ఫుట్ సాల్ లీగ్‌లో ఢిల్లీ డ్రాగన్స్ తరపున రోనాల్డిన్హో ఆడాడు.

ఇద్దరితో అంటే కాస్త చూస్కో
ఈ ఏడాది జనవరి16న సోదరుడి ద్వారా రోనాల్డిన్హో తన రిటైర్‌మెంట్ ప్రకటన చేయించాడు. కాగా రోనాల్డినో ఫుట్ బాల్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు కానీ ఇక భార్యల విషయంలో మాత్రం ఎలా ఉంటుందో మరి. ఇద్దరూ భార్యలు కలిసి ఈయన్ని ఫుట్ బాల్ మాదిరి ఆడుకోకుంటే మేలని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఒక్కరితో వేగడమే కష్టం.. ఇద్దరితో అంటే కాస్త చూస్కో అంటున్నారు.



Click it and Unblock the Notifications