Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
లేడి రిపోర్టర్లపై ముద్దులతో దాడులు, ఎక్కడంటే అక్కడ పట్టుకుంటున్నారు, ఫుట్ బాల్ పోటీల్లో దారుణాలు
రష్యాలో జరుగుతున్న వరల్డ్ కప్ ఫుట్ బాల్ పోటీలను లైవ్ కవరేజ్ ద్వారా అందించాలని వెళ్లిన మహిళా రిపోర్టర్లకు వేధింపులు కొనసాగుతున్నాయి. ఆకతాయిలు అమ్మాయిలపై ముద్దులతో దాడులు చేస్తున్నారు. ఫుట్ బాల్ పోటీలు
రష్యాలో జరుగుతున్న వరల్డ్ కప్ ఫుట్ బాల్ పోటీలను లైవ్ కవరేజ్ ద్వారా అందించాలని వెళ్లిన మహిళా రిపోర్టర్లకు వేధింపులు కొనసాగుతున్నాయి. ఆకతాయిలు అమ్మాయిలపై ముద్దులతో దాడులు చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఫుట్‌బాల్ ప్రపంచ కప్ పోటీలకు సంబంధించిన లైవ్ ప్రోగ్రామ్ ఇస్తున్న రిపోర్టర్ జూలియట్‌ను ఓ వ్యక్తి ముద్దాడిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను జూలియట్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. అయితే మళ్లీ మరో లేడీ రిపోర్టర్ ను ముద్దాడేందుకు ప్రయత్నించాడు ఒక ఫుట్ బాల్ అభిమాని. కానీ ఈసారి తనను ముద్దాడేందుకు వచ్చిన వ్యక్తి నుంచి తప్పించుకుని.. ఆ వ్యక్తికి ఓ మహిళా జర్నలిస్ట్ చివాట్లు పెట్టగా, ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

జూలియా గుమారాస్
వివరాల్లోకి వెళితే.. బ్రెజిల్‌కు చెందిన స్పోర్ట్స్ జర్నలిస్ట్ జూలియా గుమారాస్ అనే మహిళా జర్నలిస్ట్ యోకాటెరిన్ బర్గ్ నుంచి రిపోర్టును ఇస్తున్న సమయంలో ఓ ఆకతాయి ఆమెను సమీపించి ముద్దు పెట్టబోయాడు. అతన్నుంచి తప్పించుకున్న జూలియా, ఇది మంచి పద్ధతి కాదని చివాట్లు పెట్టింది. ఓ అమ్మాయి పట్ల ఇలా చేయడం తగదని, ఇంకోసారి ఇలా చేయవద్దని మండిపడింది. మహిళలకు మర్యాద ఇవ్వడం నేర్చుకోమని ఫైర్ అయ్యింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

లైవ్‌లోనే తిట్టేసింది
జూలియా గుమారాస్ ముద్దు పెట్టడానికి ప్రయత్నించిన ఆకతాయి నుంచి తప్పించుకున్నారు. లైవ్‌లోనే అతన్ని చెడామడా తిట్టేసింది. ఇంకెప్పుడు ఇలా చేయకు అంటూ జూలియా అతనిపై మండిపడ్డారు. ‘ఇది మంచి పద్దతి కాదు.. ఓ మహిళ పట్ల ఇలా ప్రవర్తించడం సరైనది కాదు.. దీనిని రిపీట్ చేయకు' అంటూ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జూలియా ట్విటర్‌లో స్పందించారు.
రష్యాలో ఇలా జరగడం రెండోసారి
‘ఆ ఘటన గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు. అదృష్టవశాత్తు నేను తప్పించుకున్నాను. బ్రెజిల్‌లో తనకు ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురుకాలేదని, రష్యాలో మాత్రం ఇలా రెండుసార్లు జరిగిందని ఆమె తన ట్విటర్‌లో ఆవేదన వ్యక్తంచేసింది. రష్యాలో ఇలా జరగడం రెండోసారి.. రష్యా, ఈజిప్ట్ మధ్య జరిగిన ప్రపంచకప్ తొలి మ్యాచ్ సమయంలో కూడా మాస్కోలో ఇదే రకమైన అనుభవం ఎదురైంది. రష్యాలో కొన్ని పరిస్థితలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయ'ని ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో జూలియాకు మద్దతుగా నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.
A post shared by Julieth Therán (@juliethgonzaleztheran) on
జూలియట్ గోంజాలెజ్ థెరాన్ కు ముద్దు పెట్టేశారు
ఇక ఈ నెల 15న ఓ జర్మన్ న్యూస్ ఛానల్‌లో పనిచేస్తున్న జూలియట్ గోంజాలెజ్ థెరాన్ లైవ్ రిపోర్ట్ చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి వచ్చి ముద్దు పెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆ జర్నలిస్టు సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ తర్వాత ముద్దు పెట్టిన వ్యక్తి స్పందించి క్షమాపణ కోరాడు. స్నేహితులతో పందెం కాసినందుకే ముద్దు పెట్టానని వివరణ ఇచ్చాడు.
ఛాతీ భాగంలో తగులుతూ
‘డెట్‌స్చే వెల్లె' న్యూస్ చానెల్‌లో జులియెత్ గాంజలెజ్ థెరాన్ పనిచేస్తుంది. లైవ్ కవరేజీలో నిమగ్నమైన ఆమెను ఒక ఆకతాయి ఛాతీ భాగంలో తగులుతూ చెంపపై ముద్దుపెట్టి వెళ్లిపోయాడు.తనకు ఎదురైన ఈ చేదు అనుభవానికి సంబంధించిన వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. తనపై జరిగిన లైంగిక వేధింపులపై వాపోయింది.
అంతరాయం కలగకూడదని
‘ప్రత్యక్ష ప్రసారం కోసం నేను రెండు గంటల పాటు కసరత్తు చేశాను. లైవ్‌లో ఎలాంటి అంతరాయం కలగకూడదని ఇలా ప్రవర్తించినప్పటికీ నా పని (న్యూస్ ప్రజంటేషన్) పూర్తి చేశాకే ఆకతాయి కోసం వెతికాను. కానీ ఆ వ్యక్తిని నేను కనుక్కోలేకపోయాను' అని గాంజలెజ్ థెరాన్ అందులో పేర్కొంది. లైవ్‌లో అలా చేస్తే తాను వెంటనే రియాక్టయ్యే అవకాశం ఉండదని భావించి పక్కా ప్రణాళికతోనే అతడిలా చేసినట్లు జూలియెత్ తెలిపింది.
A post shared by Julieth Therán (@juliethgonzaleztheran) on
కలలో కూడా ఊహించలేదు
‘నేను ఇలాంటి ఘటన ఎదుర్కొంటానని కలలో కూడా ఊహించలేదు. మేము ఫుట్‌బాల్ గురించి ఎంతో కొంత సాకర్ అభిమానులకు తెలియజేయాలని అనుకున్నాం. కానీ అభిమానం ప్రేమగా స్వీకరించేలా ఉండాలి కాని వేదింపుగా ఉండకూడదు'అంటూ థెరాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆ యువకుడి చర్యపై సోషల్ మీడియాలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.
ముద్దులతో ఆకతాయిల దాడులు
రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ పోటీల్లో ఇలా మహిళా జర్నలిస్ట్ లపై ముద్దులతో ఆకతాయిలు దాడులు చేస్తూనే ఉన్నారు. మహిళల పట్ల ఇలా అసభ్యంగా ప్రవర్తించకండి... వారికి గౌరవం ఇవ్వండి అంటూ మహిళా జర్నలిస్ట్ లు కోరుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మెగా టోర్నీ జరిగే సమయంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కావడంపట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



Click it and Unblock the Notifications
