Latest Updates
-
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్‌తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు!
వరంగల్ లో జోరుగా వ్యభిచారం, కాలేజీ అమ్మాయిలతో దందా చేయిస్తున్నారట, సంపన్న కాలనీలే టార్గెట్!
వరంగల్ నగరంలో కొందరు మహిళలు, పురుషులు కొందరి పలుకుబడితో వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నారని సమాచారం. ఇంటికే విటులను రప్పించి మ హిళలను ఎరవేస్తున్నారు.వరంగల్ లో జోరుగా వ్యభిచారం, కాలేజీ అమ్మాయిలతో దందా
తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అంతటి నగరంగా అభివృద్ధి దిశలో పయనిస్తున్న వరంగల్ నగరంలో వ్యభిచారం వైట్‌కాలర్ వ్యాపారంగా సాగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాశ్చాత్య సంస్కృతి పెరిగి, టెక్నాలజీ అభివృద్ధి చెందుతుండడంతో విటులకు వ్యభిచార కూపాల నిర్వాహకులు సకల సౌకర్యాలు కల్పిస్తూ ఆకర్షిస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా వరంగల్ లోని సంపన్నుల కాలనీలే కేంద్రంగా వ్యభిచారం సాగిస్తున్నట్లు సమాచారం.

విటులను కార్లలో తీసుకొచ్చి
కొందరు సుదూర ప్రాంతాల నుంచి విటులను కార్లలో తీసుకొచ్చి మరీ పడుపు వృత్తి చేయిస్తున్నట్లు తెలిసింది. వరంగల్ నగరంలోని కొన్ని ప్రయివేటు లాడ్జీల్లో పలుకుబడిని పెంచుకు నేందుకు చోటా, మోటా రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు దందా కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే కుటుంబా ల్లోని యువతులకు ఎరవేసి ఈ చీకటి వ్యాపారానికి వాడుకుంటున్న దుస్థితి ఉన్నట్లు తెలిసింది. అమాయకులైన కొందరు పేద బాలికలు బలౌతుండగా, కొందరు ప్రేమ పేరుతో వంచించి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం.

బస్టాండ్, రైల్వేస్టేషన్ ప్రాంతాల్లోనే వ్యాపారం
ప్రయాణీకులు రద్దీగా ఉండే ప్రదేశాల్లోని హోటళ్లు, లాడ్జీల్లోనే ఈ వ్యభిచారం నిరాఘాటంగా సాగుతున్నట్టు సమాచారం. ఎక్కువగా బస్టాండ్, రైల్వేస్టేషన్ ప్రాంతాల్లోనే వ్యాపారం కొనసాగిస్తున్నారు. పబ్లిక్ పార్కుల్లో సైతం రహస్యంగా కొనసాగిస్తుండడం, పోలీసులకు చిక్కినా వారిపై కేసులు పెట్టకపోవడంతో సంఘటనలు పునరావృతమవుతున్నాయి.

అమ్మాయిలను తీసుకొచ్చి
కొందరు వ్యక్తులు ఒక బ్యాచ్‌గా ఏర్పడి అమ్మాయిలను ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి మరీ వ్యాపారం కొనసాగిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. హన్మకొండ బస్టాండ్ చుట్టూ ఉన్న లాడ్జీల్లో, హోటళ్లలో, గోపాలపురం శివారులో కొన్ని ఖరీదైన ఇండ్లలో, నక్కలగుట్ట సమీపంలో కొన్ని అపార్ట్‌మెంట్లలో ఈ చీకటి వ్యాపారం యథేచ్ఛగా నిర్వహిస్తున్నట్లుగా సమాచారం.

మాయ మాటలు చెప్పి వ్యభిచారం రొచ్చులోకి
యువతులు, మహిళల అవసరాలను ఆసరా చేసుకుని, వారికి మాయ మాటలు చెప్పి వ్యభిచారం రొచ్చులోకి నిర్వాహకులు దించుతున్నారు. కొంతమందిని కొత్తగా తీసుకొస్తూనే, ముంబాయి, బెంగుళూరుల నుంచి మహిళలను తీసుకొచ్చి వ్యాపారం కొనసాగిస్తున్నట్లుగా ఆ రొంపిలో వారు కూరుకుపోయి తిరిగొచ్చిన విటులే చెబుతుండడం గమనార్హం.

పోలీసులకు చిక్కకుండా టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు
రోజురోజుకు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వాహకులు విటులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. అందమైన యువతుల ఫొటోలు, వీడియోలు ప్రత్యేక 'యాప్'ల ద్వారా పంపిస్తూ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. వీటికి తోడు పోలీసులకు సైతం చిక్కకుండా ఉండేందుకు స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీని ఉపయోగించుకుని సంభాషణలు లేని సమాచారం చేరవేస్తున్నట్లుగా సమాచారం.

డోర్ డెలివరీ
డబ్బులిస్తే అమ్మాయిలను విటులు కోరుకున్న చోటుకు నిర్వాహకులు పంపిస్తున్నారు. అవసరమైతే డోర్ డెలివరీ కూడా నిర్వహిస్తున్నారు. విటుల అభిరుచిని బట్టి వారిచ్చే పారితోషికాన్ని బట్టి అమ్మాయిలను ఇండ్లకు పంపిస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ముఖాలకు ముసుగులు, స్కార్ఫ్‌లను వేసి ఖరీదైన ఏసీ కార్లలో పంపిస్తూ వ్యాపారాన్ని గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తున్నారని సమాచారం.

వీడియో పుటేజీలుండవు
పోలీసులు నిబంధనల ప్రకారం ప్రతి లాడ్జీ, హోటల్‌లో సీసీ కెమెరాలు అమర్చుకోవాలి. ఇటీవల అధికారుల చొరవ వలన కొంతమంది ఆపని చేసినా, అసలు సమయంలో అవి పనిచేయకుండా ఉంటాయి. వీడియో పుటేజీలుండవు. వ్యాపారమంతా హోటల్స్, బస్టాండ్, రైల్వే స్టేషన్లు, పబ్లిక్ పార్కుల్లో సాయంత్రం వేళల్లో మాట్లాడుకుని రాత్రి ఒంటిగంట నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు కొనసాగిస్తున్నట్లుగా సమాచారం.

ఇంటికే విటులను రప్పించి
వరంగల్ నగరంలో కొందరు మహిళలు, పురుషులు కొందరి పలుకుబడితో వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నారని సమాచారం. ఇంటికే విటులను రప్పించి మ హిళలను ఎరవేస్తున్నారు. పోలీసుల భయంతో పర్మినెంటుగా మహిళలను ఉంచకుండా అప్పటికప్పుడు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా విటుల కోరిక మేరకు హాస్టల్ అమ్మాయిలను కేటాయిస్తున్నారని చాలా సార్లు ప్రముఖ పత్రికల్లోనూ వార్తలు ప్రచురితం అయ్యాయి.

కొన్ని కళాశాలలు, వసతి గృహాల నిర్వాహకులతో పరిచయం పెంచుకుని
గ్రామీణ ప్రాంతాల నుంచి నగరానికి చదువుకోవడానికివచ్చిన కాలేజీ అమ్మాయిలను కొన్ని వ్యభిచార ముఠాలు ట్రాప్ చేస్తున్నట్టు సమాచారం. కొన్ని కళాశాలలు, వసతి గృహాల నిర్వాహకులతో పరిచయం పెంచుకుని అక్కడ ఉంటున్న అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నారు. డబ్బు, బంగారం, విలువైన బట్టలు, స్మార్ట్ ఫోన్లు ఆశ చూపిస్తూ అమాయక అమ్మాయిలను ఉచ్చులోకి లాగుతున్నారు.

లగ్జరీగా బతకవచ్చనే ఆశలు చూపిస్తున్నారు
వారి ఆర్థిక స్థితిగతులు తెలుసుకుని ఎంపిక చేసిన వ్యక్తులతో కొంత సమయం గడిపితే తోటి విద్యార్థుల కంటే లగ్జరీగా బతకవచ్చనే ఆశలు చూపిస్తున్నారు. హన్మకొండ, వరంగల్, కాజీపేట ప్రాంతాలలో కళాశాలలు, సాంకేతిక విద్యాసంస్థల సమీపంలో ఉన్న బాలికల హాస్టల్స్ వీరికి కేరాఫ్ అడ్ర్‌సగా మారుతున్నాయి. సాయంత్రం వేళల్లో విలువైన కార్లు, బైక్‌లపై కాలేజీ అమ్మాయిలను తీసుకెళ్లి మర్నాడు తెల్లవారక ముందే హాస్టళ్లకు కొంత దూరంలో దింపి వెళుతున్నారు. ఈ మేరకు అమ్మాయిలకు రోజుకు తక్కువ డబ్బు ఇస్తూ నిర్వాహకులు మాత్రం వేలల్లో దండుకుంటున్నారని సమాచారం.



Click it and Unblock the Notifications