For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చాణక్య నీతి: మీ బంటుతో పాటు బంధువుల యొక్క నిజస్వరూపాన్ని అలాగే మీ భార్య యొక్క అసలు స్వభావాన్ని కనుగొనడమెలా?

చాణక్య నీతి: మీ బంటుతో పాటు బంధువుల యొక్క నిజస్వరూపాన్ని అలాగే మీ భార్య యొక్క అసలు స్వభావాన్ని కనుగొనడమెలా?

|

సేవకుడి యొక్క పనితీరు గురించి ఎప్పుడైనా సందేహం వచ్చిందా? మీ బంధువులను మీరు అతిగా నమ్మారా? మీ భాగస్వామి మీకు ఎంత మద్దతుగా నిలుస్తుందో తెలుసుకోవాలని ఉందా? వారి నుంచి మీకు లభించే సున్నితమైన అలాగే లాలిత్యమైన మాటలు పరిస్థితులు అడ్డం తిరిగితే అంతే లాలిత్యంగా అంటే సౌమ్యంగా ఉండకపోవచ్చు.

ఒకవేళ మీరు రాంగ్ పెర్సన్ పై విపరీతమైన నమ్మకాన్ని పెట్టుకుని ఉంటే పరిస్థితులు అడ్డం తిరిగినప్పుడు వారి నిజస్వరూపం బయటపడుతుంది. వారి అసలు రూపం తెలియడానికి కొంత సమయం పడితే, అప్పటికే మీరు ఆర్థికంగా చితికిపోయే ప్రమాదం ఉంది. మానసిక కృంగుబాటుకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. మరింకేం అవకాశం లేదా అన్నది ఇక్కడి ప్రశ్న.

How To Test Your Servant, Relatives And Your Wife - Learn From Chanakya

మీ శ్రేయాభిలాషులను అలాగే సంబంధబాంధవ్యాలలోని పటిష్టతను పరీక్షపెట్టగలిగే శక్తి కేవలం కాలానికే ఉందని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇది నిజమే. మీ బంటులోని నిజాయితీ, మీ బంధువర్గంలో సహాయాగుణం అలాగే భార్య యొక్క సుగుణశీలత వంటి విషయాలను కూడా కాలమే సరిగ్గా పరీక్షించగలుగుతుంది.

కష్టకాలంలో మీరు ఇబ్బందులు పడవచ్చు. ఐతే, అనేక గుణపాఠాలను నేర్చుకునే అవకాశం మీకు లభిస్తుంది. తప్పులను గుర్తించే అవకాశం లభిస్తుంది. నిజమైన శ్రేయాభిలాషులెవరో తెలుస్తుంది. దీనికి సంబంధించి చాణక్యుడు ఒక గొప్ప విషయాన్ని వివరించాడు. మీరు చుట్టుపక్కల లేనప్పుడు మీ బంటును, కష్టకాలంలో బంధువులను అలాగే శ్రేయాభిలాషులను అలాగే పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మీ భార్యను మీరు పరీక్షించడానికి సరైన సమయం.

బంటు మనస్తత్వం మీరు చుట్టుపక్కల లేనప్పుడు బయటపడుతుంది:

మీ పరిసరాలలో లేనప్పుడు, బంటు చాలా సౌకర్యంగా అలాగే ప్రశాంతంగా ఉండగలడు. ఈ సమయంలోనే, అతని సహజ స్వభావం వ్యక్తమవుతుంది. మీరు టేబుల్ పై పెట్టిన కొంత డబ్బును దొంగిలించేందుకు ప్రయత్నించవచ్చు. లేదా మీరు ఎదురుపడగానే తిరిగి ఇవ్వడానికి ఆ డబ్బును ఏదైనా సేఫ్ ప్లేస్ లో దాచి ఉండవచ్చు. ఆ డబ్బును ఏదైనా సురక్షిత ప్రాంతంలో ఉంచి మీకు ఆ విషయాన్ని తెలియచేయవచ్చు.

సందర్భం ఏదైనా బంటు యొక్క నిజాయితీ అనేది ఇక్కడ పూర్తిగా తెలుస్తుంది. చిన్న చిన్న విషయాలకే ఒక వ్యక్తిని నమ్మలేనప్పుడు వారి పనులను మీరు అస్సలు నమ్మలేరు. చిన్న మొత్తాన్ని దొంగిలించగలిగినప్పుడు కాస్త ఆలోచించండి పెద్ద మొత్తాన్ని తీసుకునే ధైర్యాన్ని ఏర్పరచుకునే సన్నాహాలు జరుగుతూ ఉండొచ్చు కదా? మీకు తెలియకుండానే మీ సొమ్ము ఆ విధంగా మాయమైపోతుంది. కాబట్టి, అలర్ట్ గా ఉండి మీ బంటు యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకుని మరింత జాగ్రత్తగా ఉండండి.

How To Test Your Servant, Relatives And Your Wife - Learn From Chanakya

కష్టకాలంలో బంధువుల సహాయగుణాన్ని పరీక్షించండి

మీకు కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు, మీకు సహాయం అవసరపడుతుంది. బంధువులను సహాయం అడగటం తప్పనిసరి. అయినా, ఇది మీ మనసులో మొదటి ఆప్షన్ గా అనిపించదు. ఎందుకంటే, బంధుత్వాలు సజావుగా నిలవాలన్నా మీ గౌరవానికి ఎటువంటి భంగం వాటిల్లకుండా ఉండాలన్నా వారి నుంచి డబ్బును ఆశించకూడదని మీరు గట్టిగా తీర్మానించుకుని ఉండుంటారు. అందువలనే, మన తల్లిదండ్రులు బంధువుల నుండి ఆర్థిక సహాయం ఆశించవద్దని గట్టిగా చెప్పారు. ఎందుకంటే, వారి నుంచి కష్టకాలంలో ఆర్థిక సహాయం ఆశిస్తే బంధుత్వాలు చెడవచ్చు. నిజమే కదా?

అయితే, ఆర్థిక సమస్యలు తలెత్తినప్పుడు బంధువులను ప్రశ్నించమని చాణక్యుడు చెప్తున్నాడు. వారిని సహాయం అడగటం ద్వారా ఫలితం ఈ రెండిటిలో ఒక విధంగా ఉండవచ్చు. వారి నుంచి మీకు సహాయం అందవచ్చు. వారిని నమ్మాలో లేదో మీకు అర్థం అవవచ్చు. లేదా వారి నుంచి సహాయం అందకపోవచ్చు. సహాయం చేయడానికి వారు నిరాకరించి ఉండవచ్చు. అప్పుడు, మీరు బంధువుల మనస్తత్వంపై ఒక అవగాహనకు రావచ్చు.

స్వార్థపూరితమైనవారు తమ స్వంత ప్రయోజనాలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తారు. మీరు ఆర్థిక ఇబ్బందులలో ఉన్నప్పుడు మీతో దూరాన్ని మెయింటెయిన్ చేయడం ప్రారంభిస్తారు. అయితే, మార్పు సహజం కదా. పరిస్థితులు ఎల్లకాలం ఒకేలా ఉండవు. పరిస్థితులు చక్కబడతాయి. మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.

అయితే, రాంగ్ రిలేషన్ షిప్స్ పై మనం ఎక్కువగా నమ్మకం పెట్టుకోవడం మనల్ని తిరిగి బాధిస్తుంది. కాబట్టి, ముందుగానే, వ్యక్తుల యొక్క స్వభావాల్ని తెలుసుకోవాలి. వారిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి. అందువలన, చాణక్యుడు బంధువులను పరీక్షించే అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దని హెచ్చరిస్తున్నాడు.

How To Test Your Servant, Relatives And Your Wife - Learn From Chanakya

ప్రతికూల సమయంలో భార్యను పరీక్షించాలి:

దురదృష్టకరమైన వ్యక్తికి అతని భార్య నుంచి కూడా మద్దతు అందదు. ఒక వ్యక్తి తనకున్నవన్నిటినీ కోల్పోయినప్పుడు తన జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న భార్య నుంచి తీవ్రమైన విమర్శలు ఎదురవుతాయి. ఇంటికి డబ్బు తేవడం లేదని వాదించడం మొదలుపెడుతుంది. మానసికంగా కృంగిపోయేలా చేస్తుంది. ఆ వ్యక్తితో ఇంక జీవించడం సాధ్యం కాదని విడిచిపెట్టి వెళ్లే ఆలోచన కూడా చేస్తుంది.

సుఖదుఃఖాలలో సమానంగా పాలుపంచుకునే భార్యను విడువరాదు. అయితే, కేవలం సుఖాలలో మాత్రమే పాలుపంచుకుంటానని దుఃఖంలో మిమ్మల్ని వేధించే భార్య పట్ల మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒక పురాణ గాధ ప్రకారం, తులసీదాసు అనే ప్రముఖ కవి సరైన సంపాదన లేక ఇంటికి తగినంత సొమ్మును తీసుకువచ్చే వాడు కాదు. అందువలన, అతని భార్య అతనిని మాటలతో హింసిస్తూ వచ్చేది. చివరికి, ఇల్లు వదిలివేయాలని నిర్ణయించుకుని దేవుడి భక్తుడిగా మారిపోయాడు. దేవుడు మాత్రమే తిరిగి ప్రేమను అందిస్తాడని నమ్మాడు.

కష్టకాలంలో మనకు అనేక గుణపాఠాలు వస్తాయి. ఇవి జీవితానికి కొత్త దిశను చూపిస్తాయి. ఈ విధంగా, తులసీదాసు ఈ ప్రపంచానికి ఒక గొప్ప కవిగా పరిచయమయ్యాడు.

English summary

How To Test Your Servant, Relatives And Your Wife - Learn From Chanakya

Ever doubted the services of your servant? Ever trusted your relatives too much. Ever wanted to know how supportive your life partner is? Those promises and comforting words which make you believe, might not be so promising actually.
Desktop Bottom Promotion