For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భీష్ముడు గంగాదేవికి కొడుకు అలా అయ్యాడు, కామాన్ని సహించాడు, అతిసంభోగంతో రాజయక్ష్మం

భీష్ముడనే పేరు దేవవ్రతుడికి రెండో పేరే అయినా, అదే మనందరికీ తెలిసిన ప్రసిద్ధమైన పేరు. భీష్ముడంటే భయంకరుడని అర్థం. ఏవిధంగా ఇతను భయంకరుడు? దేవవ్రతుడు, భీష్ముడు గంగాదేవికి కొడుకు అలా అయ్యాడు.

|

భీష్ముడనే పేరు దేవవ్రతుడికి రెండో పేరే అయినా, అదే మనందరికీ తెలిసిన ప్రసిద్ధమైన పేరు. భీష్ముడంటే భయంకరుడని అర్థం. ఏవిధంగా ఇతను భయంకరుడు? దేవవ్రతుడు తన తండ్రి మనోబాధను తీర్చడానికి రాజ్యాధికారాన్ని విడిచిపెట్టి, వివాహాన్ని కూడా చేసుకోనని భీష్మమైన ప్రతిజ్ఞ చేసిన మీదట, భీష్ముడనే పేరు స్థిరపడిందని చెబుతారు.

కామాన్ని సహిస్తూ

కామాన్ని సహిస్తూ

ఉన్నతోన్నతమైన పదవిని విడిచిపెట్టడమూ కామాన్ని సహిస్తూ వివాహానికి దూరంగా ఉండటమూ రెండూ చాలా పెద్ద ప్రతిజ్ఞలే. భీష్ముడు కారణ జన్ముడు. అష్ట వసువులలో ఒకడు. అష్ట వసువులు అనగా దేవలోకంలో ఇంద్రునికి, విష్ణువుకు సహాయంగా ఉండే శక్తివంతమైన దేవతలు.

వశిష్టుని కామధేనువు

వశిష్టుని కామధేనువు

వీరు బ్రహ్మ ప్రజాపతి పుత్రులు ప్రకృతి తత్వానికి ప్రతీకలు. ధర, అనిల, అనల, అహ, ప్రత్యూష, ప్రభాస, సోమ, ధృవులు. ఓసారి వీరు తమ భార్యలతో కలిసి వనవిహారం చేస్తుండగా దివ్య తేజస్సు గల ఆవు వారికి కనిపించింది. అది వశిష్టుని ఆశ్రమంలో ఉండే కామధేనువు. దానిని వారు దొంగతనంగా తీసుకెళ్లిపోతారు.

శపిస్తాడు

శపిస్తాడు

వశిష్టుడు తన దివ్యదృష్టి ద్వారా జరిగింది గ్రహించి వారిని భూమిపై మానవులుగా జన్మించమని శపిస్తాడు. వారు వశిష్టుని క్షమించమని వేడుకోగా సహాయం చేసిన ఏడుమంది వసువులు భూమిపై కొద్ది రోజులు మాత్రమే జీవిస్తారని, కానీ కామధేవుని తీసుకుని వెళ్ళిన అష్టమ వసువు మాత్రం భూమిపై దీర్ఘకాలం ఉండక తప్పదని చెప్తాడు. ఆపై గంగాదేవి మానవ రూపం ధరించి ఎవరైనా రాజును వివాహమాడి తమకు జన్మనివ్వాలని కోరుతారు. అలా పుట్టిన వెంటనే నదిలో పారేయాలని కూడా చెప్తారు. అందుకు గంగాదేవి అంగీకరిస్తుంది.

కుడి తొడమీద కూర్చుంటుంది

కుడి తొడమీద కూర్చుంటుంది

ఒకనాడు చంద్రవంశానికి చెందిన ప్రతీపుడు అనే మహారాజు గంగానదీలో సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తుండగా గంగాదేవి అందమైన మానవకాంత రూపం ధరించి వచ్చి ఆయన కుడి తొడమీద కూర్చుంటుంది. ఆమె తనను మోహిస్తుందేమోనని ఆయన బాధపడి ఆమె ఎందుకు అలా కూర్చుందో అడుగుతాడు. సాధారణంగా కూతుళ్ళు, కోడళ్ళు మాత్రమే అలా కూర్చుంటారు. తనకు కుమారుడు కలిగితే అతన్ని పెళ్ళాడవచ్చునని సూచిస్తాడు. అది విని ఆమె అంతర్ధానమైపోతుంది.

శంతనుడనే పుత్రుడు

శంతనుడనే పుత్రుడు

కొద్ది కాలానికి ప్రతీపునికి శంతనుడనే పుత్రుడు జన్మిస్తాడు. ఆయన ఒకసారి గంగాతీరంలో విహరిస్తుండగా మానవ రూపంలో ఉన్న ఆమెను చూసి మోహిస్తాడు. శంతనుడు ఆమెను పెళ్ళి చేసుకోవాలంటే కొన్ని షరతులు విధిస్తుంది. దాని ప్రకారం ఆమెను పెళ్లాడే శంతనుడు-గంగాదేవికి ఏడుగురు సంతానం కలుగుతారు. అయితే ఆమె ఒక్కో బిడ్డ పుట్టిన వెంటనే నదిలో పారవేస్తూ ఉంటుంది.

దేవవ్రతుడు

దేవవ్రతుడు

ఆ ఏడుగురి విషయంలోనూ ఎలాగోలా ఊరుకున్న శంతనుడు ఎనిమిదవ బిడ్డ విషయంలో మాత్రం ఆమెను వారిస్తాడు. ఆమె ఆ శిశువును శంతనుడికిచ్చి అంతర్ధానమైపోతుంది. ఆ శిశువే దేవవ్రతుడు. జీవితకాలం భూమి మీద జీవించాలన్న శాపానికి గురైన అష్టమ వసువు. గంగాదేవి జన్మనిచ్చింది కాబట్టి గాంగేయుడు అని కూడా పిలవబడ్డాడు. ఆయనే భీష్ముడు.

రాచకన్నెల్ని రథం ఎక్కించుకొని తెస్తూ

రాచకన్నెల్ని రథం ఎక్కించుకొని తెస్తూ

భీష్ముడు, ఇరవై సార్లు నేలమీద క్షత్రియుల్లేకుండా చేసిన పరశురాముణ్నే ఓడించిన ధనుర్విద్యాపారంగతుడు. తమ్ముడు విచిత్రవీర్యుడికి పెళ్లిచేద్దామని కాశిరాచకన్నెల స్వయంవరానికి తానే స్వయంగా వెళ్లాడు. స్వయంవరానికి వచ్చిన రాజులనందర్నీ గడ్డిపరకల మాదిరిగా తీసేసి, రాచకన్నెల్ని రథం ఎక్కించుకొని తెస్తూ, అడ్డుపడిన రాజుల్ని కూడా మట్టికరిపించాడు. ఆ ముగ్గురు ఆడపిల్లల్లో అంబ అనే పెద్దమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొందామని ఉబలాటపడి వచ్చిన సాల్వుణ్ని కూడా భంగపరిచి ప్రాణాలతో విడిచిపెట్టాడు.

అతిసంభోగంతో రాజయక్ష్మం

అతిసంభోగంతో రాజయక్ష్మం

తీరా ఇంటికి వచ్చిన తరవాత, అంబ తన ప్రేమకథని చెప్పి సాల్వుడి దగ్గరికి పంపించమని అడిగింది. సరే, అంబికా అంబాలికల్ని ఇద్దరినీ విచిత్రవీర్యుడికిచ్చి పెళ్లి చేశారు. అతనేమో ఆ పెళ్లాల రంధిలో మునిగిపోయి రాజయక్ష్మ రోగాన్ని తెచ్చుకొని ఏడేళ్లలోనే చచ్చిపోయాడు. అతిసంభోగంతో రాజయక్ష్మం వస్తుందన్నది ఇక్కడి పాఠం. అతను పోయిన తరువాత, సత్యవతి భీష్ముణ్ని అంబికా అంబాలికలతో కాపురం చేసి పిల్లల్ని కనమంది. కానీ ధర్మానికి కట్టుబడినవాడు గనక ఆ పనికి అతను ఒప్పుకోలేదు.

మగతనం బదలాయింపు

మగతనం బదలాయింపు

ఇక అంబ విషయానికి వస్తే... ఆమెను పెళ్లిచేసుకోవడానికి ససేమిరా అన్నాడు సాల్వుడు. భీష్ముడి మీద కక్షకట్టిన అంబ... పరుశురాముడి సాయాన్ని కోరింది. అయితే క్షత్రియులందర్నీ పనిగట్టుకొని మరీ నాశనం చేసిన పరుశురాముణ్నే ఓడించిన జగజ్జెట్టి భీష్ముడు. ఇక అంబ, దెబ్బతిన్న పాముకి మల్లే కసితో తపస్సు చేసింది. శివుడి వరాన్ని పొంది, చితిలో ఆ శరీరాన్ని ఆహుతి చేసుకొని, ద్రుపద మహారాజుకు కూతురుగా పుట్టింది.

ఆ రాజు కూతురికి మగదుస్తులు వేసి మగవాడిగా పెంచడమేగాక, హిరణ్యవర్మ కూతురికిచ్చి పెళ్లి కూడా చేశాడు. మామగారు అగ్గి గుగ్గిలమై దండెత్తడానికి వస్తున్నాడని తెలిసి, శిఖండి ఒక వనంలోకి పారిపోయింది. ఆ వనాన్ని స్థూణాకర్ణుడనే యక్షుడు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనితో గోడు చెప్పుకొంది. ‘గండం గడిచేంతదాకా నా మగతనాన్ని నీకు బదలాయిస్తాను. నీ మామగారు తృప్తిపడి వెళ్లిపోగానే తిరిగి నా పుంస్త్వాన్ని నాకు ఇచ్చేద్దుగానిలే' అని ఒడంబడిక చేసుకొని శిఖండిని మగవాడిగా చేశాడు.

వేరుతనాన్ని చూడడమే అహంకారం

వేరుతనాన్ని చూడడమే అహంకారం

సత్యవతితో పెళ్లికాగానే సంతోషించిన శాంతనుడు గంగాపుత్రుడైన భీష్ముడికి స్వచ్ఛంద మరణమనే వరాన్నిచ్చాడు. కానీ భగవంతుడు అఘటనఘటనా సమర్థుడు. ఎన్నెన్ని వరాలనైనా పొందనీ చావు ఏదోవిధంగా వచ్చితీరుతుంది. దానికి మార్గాన్ని భీష్ముడే ఏర్పరుచుకొన్నాడు. భీష్ముడికి ఒక వ్రతం ఉంది: ఆడదాన్ని గానీ ముందు ఆడదిగా ఉండి, తరవాత మగవాడిగా మారినవాణ్ని గానీ ఆడదాని పేరుపెట్టుకొన్నవాణ్ని గానీ ఆడదాని రూపమున్నవాణ్ని గానీ చూస్తే బాణాన్ని వేయడు. నిజానికి చైతన్యానికి మగా ఆడా తేడా ఉండదు. అలాగ వేరుతనాన్ని చూడటమే అహంకారమంటే.

అంపశయ్య మీదనే పడుకొని

అంపశయ్య మీదనే పడుకొని

కురుక్షేత్ర యుద్ధంలో ఏ రోజుకారోజు పదివేల మందిని చంపుతూ భీకరమైన యుద్ధాన్ని చేస్తూన్న భీష్ముని దగ్గరికి ఓ రోజు రాత్రి ధర్మరాజే వెళ్లి ‘నువ్వెలాగ చచ్చిపోతావో నువ్వే చెప్పాలి' అని వింతైన కోరిక కోరాడు. అప్పటికే చాలా విసుగెత్తి ఉన్నాడు భీష్ముడు. ‘శిఖండిని అడ్డుపెట్టుకొని అర్జునుడు బాణాలు వేస్తే నేను ప్రతిగా బాణాల్ని వేయను గనక నేను పతనమైపోతాను' అని తన చావును తానే చెప్పుకొన్నాడు. అలాగ బాణాలు గుచ్చుకోగా అంపశయ్య మీదనే పడుకొని ఇంకా కొన్నాళ్లు బతికే ఉన్నాడు. చివరికి యుద్ధమైపోయిన తరవాత, అందర్నీ చంపిన పాపానికి కుమిలిపోతూ ఉన్న ధర్మరాజును తీసుకొని శ్రీకృష్ణుడు వచ్చి ఎదురుగా కూర్చొని, ధర్మాల్ని చెప్పించాడు భీష్ముడి చేత. ఆ పని చేసిన తరవాత ఎదురుగా శ్రీకృష్ణమూర్తిని ధ్యానం చేస్తూ బొందిని వదిలిపెట్టాడు భీష్ముడు.

Image credit

English summary

How was Bhishma born as goddess Ganga's son?

How was Bhishma born as goddess Ganga's son?
Story first published:Monday, June 18, 2018, 18:10 [IST]
Desktop Bottom Promotion