Latest Updates
-
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ
మంచి ఆస్తి, పెళ్లయి పిల్లలున్నా తనకన్నా పదేళ్లు చిన్నవాడైన వ్యక్తితో గోవాలో రొమాన్స్ చేస్తున్న ఆంటీ
హైదరాబాద్ అమీర్‌పేట్‌కు చెందిన ఒక బిజినెస్ మ్యాన్ భార్య ఇలా వివాహేతర సంబంధం ఏర్పరుచుకుని వార్తల్లోకి ఎక్కింది. మంచి ఆస్తి, పెళ్లయి పిల్లలున్నా తనకన్నా పదేళ్లు చిన్నవాడైన వ్యక్తితో గోవాలో రొమాన్స్
రానురాను మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. అక్రమ సంబంధాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వివాహేతర సంబంధాలతో ఒకరినొకరు మోసం చేసుకునే దంపతుల సంఖ్య పెరిగిపోతుంది. దీంతో నేరాలు కూడా పెరుగుతున్నాయి. వివాహేతర సంబంధాలతో జీవితాలు నాశనం అవుతున్నాయి. క్షణికకాలం సుఖం కోసం భర్త, పిల్లల్ని వదిలి బరి తెగించే ఆడవాళ్లు ఈ మధ్య ఎక్కువై పోతున్నారు. అన్నీ సుఖాలున్న కూడా ఇంకా ఏదో తెలియని సుఖం కోసం వెంపర్లాడుతున్నారు.

తనకన్నా పదేళ్లు చిన్నవాడైన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ, పుట్టింటికి వెళుతున్నానని చెప్పి ప్రియుడితో కలసి గోవాకు చెక్కేసింది. కోట్లాది రూపాయాల ఆస్తి కలిగి పెద్ద పెద్ద బిజినెస్ లు చేసే భర్తను వదిలి ప్రియుడితో ఎంజాయ్ చేయడానికే ఆమె ఇష్టపడుతోంది.


కోటీశ్వరుడైన భర్త
ఆమె ఒక వివాహిత. పెళ్లి అయి చాలా ఏళ్లు అయ్యింది. చూడడానికి అందంగా చిన్నగా కనిపించే ఆమె వయస్సు 35. ఆమె భర్త ఒక బిజినెస్ మ్యాన్. ఆమెకు ఇద్దరు కుమార్తెలున్నారు. ఇక బిజినెస్ పనిమీద హైదరాబాద్, నెల్లూరు, విజయవాడకు క్యాంపులకు వెళ్తుంటాడు. ఈమె కూడా పలు వ్యాపారాలు చేస్తుంది. భర్తకు కోట్లాది రూపాయలు ఆస్తి ఉంది.

ప్రియుడితో ఎంజాయ్
సంతోషంగా సాగిపోతున్న కాపురంలో మూడో వ్యక్తి ప్రవేశించాడు. తనకంటే వయస్సులో పదేళ్ల చిన్నోడైన యువకుడితో గుట్టుగా ప్రేమాయణం సాగిస్తోంది ఆ వివాహిత. భర్త లేనప్పుడల్లా ప్రియుడితో ఎంజాయ్ చేసేది.

పదేళ్లు చిన్నోడు
ఇక ఆమె ప్రియుడి వయస్సు 25. వయస్సులో పదేళ్ల చిన్నోడితను. పేరు మాధవ్. ఇతనికింకా పెళ్లి కాలేదు. హైదరాబాద్ అమీర్‌పేట్‌కు చెందిన ఒక బిజినెస్ మ్యాన్ భార్య ఇలా వివాహేతర సంబంధం ఏర్పరుచుకుని వార్తల్లోకి ఎక్కింది. ఆమె భర్త వ్యాపార నిమిత్తం తరుచూ క్యాంపులకు వెళ్తుంటాడు.

కారు వాష్ చేయించుకునేందుకు వెళ్లి
భర్త లేని సమయంలో భార్య వ్యాపార పనులు నిర్వహించేది. కాగా ఓ రోజు కారు వాష్ చేయించేందుకు వెళ్లిన ఆమెకు మాధవ్తో పరిచయం ఏర్పడింది. వీరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ప్రియుడి ధ్యాసలో భర్త, పిల్లల్ని సైతం పట్టించుకునేది కాదు.

రహస్యంగా రాసలీలలు
ఇద్దరూ కలిసి చాటింగ్‌లు చేసుకోవడం, రహస్యంగా రాసలీలలు కొనసాగించేవారు. భర్త, పిల్లల్ని పట్టించుకునేది కాదు. ఓ రోజూ అమీర్‌పేట్ ధరంకరం రోడ్డులో కలుసుకున్న వీరిద్దరిని భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అయితే అప్పటి నుంచి తాను మారుతానని.. తప్పుడు పనులేవీ చేయబోనని భర్తను వేడుకుంది. అనుమానించిన భర్త ఆమె కారుకు జీపీఎస్ అమర్చాడు.

గోవాకు పారిపోయింది
ఇటీవల భర్తతో పుట్టింటికి వెళ్లిపోతానని చెప్పి ఆమె కారులో ప్రియుడ్ని ఎక్కించుకుని గోవాకు పారిపోయింది. గోవాలో ఓ హోటల్లోకి కారు చేరుకున్నట్టు జీపీఎస్ ద్వారా భర్త తెల్సుకుని ఎస్.ఆర్. నగర్ పోలీసులను ఆశ్రయించాడు. తనని మోసం చేసి నమ్మకద్రోహానికి పాల్పడ్డ తన భార్యను, ఆమె ప్రియుడు మాధవ్‌ను పట్టుకోవాలని పోలీసుల్ని వేడుకుంటున్నాడు బాధితుడు.

చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి
ఆమె దగ్గర తన కూతుళ్లు ఉంటే వారు చెడుదోవలోకి వెళ్లే ప్రమాదం ఉందని..పిల్లల్ని తనకు ఇప్పించాలంటున్నాడు బాధితుడు. తనను మోసం చేసిన తన భార్యపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని.. తన కూతుళ్లను తనదగ్గరే పెంచుకునేందుకు అనుమతివ్వాలంటూ.. పోలీసులికిచ్చిన కంప్లైంట్‌లో పేర్కొన్నాడు.



Click it and Unblock the Notifications