భార్య నగ్న ఫొటోలు ఫేస్ బుక్ లో పెట్టిన భర్త

Written By:
Subscribe to Boldsky

ఆమె భర్త మతం వేరు. ఆమె మతం వేరు. అయితే భర్త తన మతంలోకి భార్యను మార్చుకునేందుకు నానా రకాలుగా ప్రయత్నించాడు. అయినా భార్య మారలేదు. దీంతో భర్త భార్యకు నిత్యం నరకం చూపిస్తున్నాడు.

సోషల్ మీడియాలో పోస్ట్

సోషల్ మీడియాలో పోస్ట్

చివరకు తన సొంత భార్య నగ్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇలా చేసి పైశాచిక ఆనందం పొందుతున్నాడు.

హర్యానాలోని పంచకులలో ఓ హిందూ యువతి స్థానిక ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకుంది.

కొట్టేవాడు

కొట్టేవాడు

కొన్ని రోజులు వీరి కాపురం సజావుగానే సాగింది. తర్వాత రోజూ భర్త భార్యను వేధించడం మొదలుపెట్టాడు. ఏదో ఒక కారణంతో ఆమెను కొట్టేవాడు.

ఇస్లాం మతంలోకి మారాలంటూ

ఇస్లాం మతంలోకి మారాలంటూ

రోజురోజుకు భర్త నుంచి వేధింపులు పెరిగిపోయాయి. భార్యను ఇస్లాం మతంలోకి మారాలంటూ ఆ యువకుడు రోజూ వేధించేవాడు. అయినా ఆమె ఒప్పుకోలేదు.

నగ్నంగా ఉన్నప్పుడు ఫొటోలు తీశాడు

నగ్నంగా ఉన్నప్పుడు ఫొటోలు తీశాడు

దీంతో ఆ భర్త తన స్నేహితుడితో కలిసి భార్యను నగ్నంగా ఉన్న సమయంలో ఫొటోలు తీశాడు. వాటిని ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తానని ఆమెను బెదిరించాడు. కానీ భయపడలేదు. తాను మతం మారనని చెప్పింది.

పోలీసులను ఆశ్రయించారు

పోలీసులను ఆశ్రయించారు

ఆమె భర్త ఆమె అశ్లీల ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వాటిని చూసిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కాగా ఇందుకు సహకరించిన మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.

ఎలా మారాలి?

ఎలా మారాలి?

తాను మతం మారకపోతే తన భర్త విడాకులు ఇస్తానని రోజూ వేధించేవాడని ఆమె బాధపడుతోంది. చిన్నప్పటి నుంచి తాను పుట్టి పెరిగిన మతాన్ని ఎలా మారాలంటూ ఆ భార్య కన్నీటి పర్యాంతం అవుతుంది.

పరువు తీశాడు

పరువు తీశాడు

తన భర్త మతాన్ని చూసి తాను పెళ్లి చేసుకోలేదని, ఆయన మంచి వ్యక్తి అని పెళ్లి చేసుకున్నానంది ఆమె. అయితే పెళ్లి అయిన తర్వాత ఇలా నిత్యం వేధిస్తాడని తనకి తెలియదని పేర్కొంది. ఏకంగా తన నగ్న ఫొటోలను అందరూ చూసేటట్లు పోస్ట్ తన పరువు తీశాడని బాధపడుతోంది ఆ బాధితురాలు.

English summary

husband posts Hindu wife's nude photos, threatens with talaq on her refusal to convert to Islam

husband posts Hindu wife's nude photos, threatens with talaq on her refusal to convert to Islam
Story first published: Saturday, April 7, 2018, 11:59 [IST]