For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బస్టాప్ లో చూపులు, క్యాంటిన్ లో కౌగిలింతలు, సివిల్స్ ఆఫీసర్ అయినా చాలా సింప్లిసిటీ #mystory201

ఢిల్లీకి వెళ్లాక అతను ఫోన్ చేయడం మానేశాడు. నన్ను అస్సలు పట్టించుకునేవాడు కాదు. అందరు అబ్బాయిల మాదిరిగానే ఇతను కూడా అనుకున్నాను. కానీ అతనిపై నమ్మకం ఉండేది. క్యాంటిన్ లో కౌగిలింతలు#mystory201

|

అవి నేను బీటెక్ చదివే రోజులు. మా ఫ్రెండ్స్ అందరికీ ఇంటర్ నుంచే బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ నేను మాత్రం ఎప్పుడూ బాయ్ ఫ్రెండ్ గురించి ఆలోచించలేదు. బీటెక్ లో జాయిన్ అయ్యాక పరిచయమైన అమ్మాయిలంతా బాయ్ ఫ్రెండ్ గురించి అడిగారు. నాకు ఎవ్వరూ లేరని చెప్పాను. కానీ ప్రతి సాయంత్రం వారిని పికప్ చేసుకునేందుకు బైక్స్ పై కాలేజీకి అబ్బాయిలు వచ్చేవారు.

అలా ఓరచూపు చూస్తే

అలా ఓరచూపు చూస్తే

ఇక నా ఫ్రెండ్స్ అంతా కూడా నన్ను ఆటపట్టించేవారు. ఏంటే... నువ్వు అలా ఓరచూపు చూస్తే వందమంది క్యూలో నిల్చుంటారు...నువ్వెందుకు ప్రేమలో పడలేదు అని అడిగారు. మౌనంగా ఉండిపోయాను. కానీ మనస్సులో మాత్రం అవును.. నాకెందుకు ఇంత వరకు ఒక్క బాయ్ ఫ్రెండ్ కూడా లేడని అనుకున్నాను.

ఎందుకు బ్రేకప్ చెప్పుకున్నారంటే...

ఎందుకు బ్రేకప్ చెప్పుకున్నారంటే...

అయితే నేను అప్పటి వరకు చాలా మంది అమ్మాయిల ప్రేమలు చూశాను. అవన్నీ కూడా విఫలమైన ప్రేమ కథలే.

మీరు ఎందుకు బ్రేకప్ చెప్పుకున్నారంటే ఏదో సిల్లీ రీజన్ చెప్పేవారు. అసలు అబ్బాయిలంతా ఇలాగే ఉంటారా అనుకునేదాన్ని. అయితే ప్రతి అమ్మాయి కూడా నాకు అబ్బాయిదే తప్పు అన్నట్లు చెప్పేది. దీంతో నాకు అబ్బాయిలపై నమ్మకం పోయింది.

ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు

ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు

అబ్బాయిలంటే నాకు భయం మొదలైంది. దీంతో నేను బీటెక్ థర్డ్ ఇయర్ వరకు అబ్బాయిలతో ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు. అయితే ఒక రోజు కాలేజీ పూర్తికాగానే బస్సు కోసం వెయిట్ చేస్తూ స్టాఫ్ లో నిల్చున్నాను. అక్కడ వెయిట్ చేస్తున్న ఒక అబ్బాయి కనపడ్డాడు.

తనని కూర్చొమని కళ్లతో చెప్పాను

తనని కూర్చొమని కళ్లతో చెప్పాను

అతనిది కూడా మా కాలేజే. అతను కూడా నా పక్కన వచ్చి నిలబడ్డాడు. సిటీలోకి వెళ్లే బస్సు రాగానే ఇద్దరం ఒకేసారి దాన్ని ఎక్కడానికి ప్రయత్నించాం. తను అడ్డు తప్పుకుని మీరు ఫస్ట్ ఎక్కండి అన్నాడు. తర్వాత అతను ఎక్కాడు. ఆ అబ్బాయి కూర్చొవడానికి సీట్ దొరకలేదు. నా పక్కన సీటు ఖాళీగా ఉంది. అక్కడ వేరే అబ్బాయి కూర్చొవడానికి వచ్చాడు... వెంటనే తనని కూర్చొమని కళ్లతో చెప్పాను. నా ఇబ్బందిని అర్థం చేసుకుని తను వచ్చి కూర్చొన్నాడు.

మేమిద్దరం లేచి సీట్ ఇచ్చాం

మేమిద్దరం లేచి సీట్ ఇచ్చాం

తర్వాత తను ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ కూర్చొన్నాడు. ఇంతలో వృద్ధ దంపతులు బస్ ఎక్కారు. వారిని కూర్చొమంటూ మేమిద్దరం లేచి సీట్ ఇచ్చాం. ఆ క్షణంలో ఇద్దరి కళ్లలో ఏదో తెలియని ఒక ఆనందం. మా ఇద్దరి భావాలు ఒక్కటే అని నా ఫీలింగ్.

ఫస్ట్ వద్దులెండి అంటూ

ఫస్ట్ వద్దులెండి అంటూ

ఆ రోజు నేను మధ్యాహ్నం భోజనం చెయ్యలేదు. పైగా నాకు ఆ రోజు నా హెల్త్ కూడా సరిగ్గా లేదు. నా బ్యాగ్ బరువు మోయలేకపోతున్నానని అతను గ్రహించాడు. బ్యాగ్ తీసుకుంటా ఇటు ఇవ్వు అని తీసుకున్నాడు. అతనికి బ్యాగ్ ఇవ్వాలని నాకూ ఉంది. కానీ వెంటనే ఇస్తే బాగుండదు కదా అందుకే ఫస్ట్ వద్దులెండి అంటూ తర్వాత ఇచ్చేశాను.

అతని గురించే ఆలోచనలు

అతని గురించే ఆలోచనలు

మీరు ఎక్కడి దాకా అని అడిగాడు.. దిల్ షుక్ నగర్ అని చెప్పాను. మీరూ... అని అడిగా, మలక్ పేట్ దాకా అన్నాడు. మీ పేరు అన్నాడు రమ్య అని చెప్పేలోపే నా పేరు రమేశ్ అన్నాడు. ఫస్ట్ నా స్టాఫే వచ్చింది. నేను దిగిపోయాను. కానీ హాస్టల్ వెళ్లాక అన్నీ అతని గురించే ఆలోచనలు.

ఏంటే.. నువ్వు కూడా ప్రేమలో పడ్డావా

ఏంటే.. నువ్వు కూడా ప్రేమలో పడ్డావా

అతని మొబైల్ నంబర్ తీసుకుని ఉంటే బాగుండేది అనిపించింది. అతను మా కాలేజీవాడే. ఏ బ్రాంచ్... ఏ ఇయర్ ఇవన్నీ అస్సలు తెలియదు. కచ్చితంగా అతని అడ్రస్ సంపాదిస్తాననే నమ్మకం ఉంది. మరసటి రోజు ఉదయమే రెడీ అయి కాలేజీకి వెళ్లాను. నేను అంత వరకు రోజూ చూసిన నా ఈసీఈ బ్లాక్ ఆ రోజు నాకు కొత్తగా కనిపించింది. ఇక నన్ను చూసి నా ఫ్రెండ్స్ అంతా ఏంటే.. నువ్వు కూడా ప్రేమలో పడ్డావా ఏంటి అని అడిగారు.. ఎస్.. ఎస్.. ఐ యామ్ ఇన్ లవ్ అంటూ నా ముఖంలోని ఆనందమే వారికి సమాధానం ఇచ్చింది.

కరెంట్ ప్రవహించింది

కరెంట్ ప్రవహించింది

తర్వాత అతన్ని త్రిపుల్ ఈ బ్లాకులో చూశాను. ఓ.. మీరూ ట్రిపుల్ ఈ నా అని అడిగాను. అవునన్నాడు. నేను ఈసీఈ అని చెప్పాను. హాయ్ నైస్ టు మీట్ యూ అని షేక్ హ్యాండ్ ఇచ్చాను. నా శరీరంలోకి కరెంట్ ప్రవహించినట్లు అనిపించింది. నాకు ఆ బ్లాక్ లో ఏ పని లేకపోయినా కూడా అతన్ని చూసేందుకు వెళ్లేదాన్ని.

ఓయ్... ఎవరినో పెళ్లి చేసుకునేటట్లుంటే....

ఓయ్... ఎవరినో పెళ్లి చేసుకునేటట్లుంటే....

ఎక్కడైనా అబ్బాయి అమ్మాయి వెంట పడతాడు.. కానీ నేను మాత్రం ఆ అబ్బాయి వెంట పడ్డాను. అతని సాఫ్ట్ కార్నర్ నాకు నచ్చింది. ఇద్దరం బాగా క్లోజ్ అయిపోయాం. రోజూ క్యాంటిన్ లో చాలా సమయం ముచ్చట్లు పెట్టుకుంటూ గడిపేటోళ్లం. రమేశ్ నాకు ఈ ప్రేమలపై అస్సలు నమ్మకం లేదు. నేను ప్రేమ మొత్తం కూడా పెళ్లయ్యాక నా భర్తకే చూపించాలని ఉంది అని అన్నాను. సరే మరి పెళ్లి చేసుకో అన్నాను. ఓయ్... ఎవరినో పెళ్లి చేసుకునేటట్లుంటే నీకెందుకు చెబుతానోయ్.. నువ్వంటే ఇష్టం. అందుకే నిన్నే పెళ్లి చేసుకుంటాను అన్నాను. చిరునవ్వుతో నన్ను తన కౌగిళ్లలోకి తీసుకున్నాడు.

దాన్ని సాధించాకే

దాన్ని సాధించాకే

అయితే నాకు ఎయిమ్ ఉంది. దాన్ని సాధించాకే మన పెళ్లి అన్నాడు. ఏంటది అన్నాను. సివిల్స్ ర్యాంక్ కొట్టడమే నా లక్ష్యం అన్నాడు. అంత వరకు వెయిట్ చేస్తావా అన్నాడు. కచ్చితంగా చేస్తాను అని చెప్పాను. బీటెక్ తర్వాత తను కోచింగ్ తీసుకునేందుకు ఢిల్లీ వెళ్లాడు. నేను ఎంటెక్ లో జాయినయ్యాను.

ఫోన్ చేయడం మానేశాడు

ఫోన్ చేయడం మానేశాడు

ఢిల్లీకి వెళ్లాక అతను ఫోన్ చేయడం మానేశాడు. నన్ను అస్సలు పట్టించుకునేవాడు కాదు. అందరు అబ్బాయిల మాదిరిగానే ఇతను కూడా అనుకున్నాను. కానీ అతనిపై నమ్మకం ఉండేది. అతను దూరం అయ్యాక అతనిపై ఇంకా ప్రేమ పెరిగింది. అనవసరంగా నమ్మి మోసపోయాను అనుకున్నాను. చాలా బాధపడ్డాను. కానీ అతను అలాంటి వ్యక్తి కాదని నాకు తెలుసు.

మంచి మనస్సున్నోళ్లు మంచిగానే ఉంటారు

మంచి మనస్సున్నోళ్లు మంచిగానే ఉంటారు

ఎంటెక్ ఫైనలియర్ అతను కాలేజీ దగ్గరకు వచ్చాడు. సివిల్స్ మంచి ర్యాంక్ వచ్చింది డార్లింగ్ అన్నాడు. పెళ్లి చేసుకుందామా అన్నాడు. నీలాంటి వాడు నాకు దొరకడం నిజంతా నా అదృష్టం అనుకున్నాను. అతను చూడగానే ఏడ్చేశాను. అతని హోదాను చూసి కాదు ఇప్పటికీ ఎప్పటికీ అతని మనస్సును చూసే ప్రేమిస్తున్నాను. మంచి మనస్సున్నోళ్లు ఎలాంటి స్థితుల్లో అయినా మంచిగానే ఉంటారు.

( ఈ కథనంలో పేర్లు ప్రాంతాలు అన్నీ మార్చాం)

English summary

I Had Tears In My Eyes When He Finally Told Me The One Thing

I Had Tears In My Eyes When He Finally Told Me The One Thing
Desktop Bottom Promotion