ఇక్కడ చీమ కుడితే మనం చంపుతాం... అక్కడ చీమ కుడితే మనం చనిపోతాం

Written By:
Subscribe to Boldsky

మనల్ని చీమ కుడితే వెంటనే నలిపేస్తాం. చంపేస్తాం. కానీ కొన్ని చీమలు మనల్నే చంపేస్తాయి. విషపూరిత చీమ కుడితే ఎంతటి వారైనా సరే చనిపోతారు. తాజాగా ఇలాంటి సంఘటనే సౌదీ అరేబియాలో జరిగింది. కేరళలోని అడూర్‌ ప్రాంతానికి చెందిన సూసీ జెఫ్ఫీ అనే మహిళ చీమ కుట్టి చనిపోయింది.

సూసీ జెఫ్ఫీ

సూసీ జెఫ్ఫీ

ఈమె వయస్సు 36 ఏళ్లు. సూసీ జెఫ్ఫీ తన భర్త జెఫ్ఫీ మాథ్యూ తో కలిసి రియాద్‌లో ఉండేది. జెఫ్ఫీ మాథ్యూ బిజినెస్ చేసేవారు. ఇక సూసీ ఇంటి దగ్గరే ఉండేది. ఇంట్లో పని చేస్తూ ఉండగా ఆమె కాలికి ఏదో కుట్టినట్లు అనిపించింది.

గట్టిగా కేకలు

గట్టిగా కేకలు

దాంతో సూసీ నొప్పి భరించలేక గట్టిగా కేకలు వేసింది. ఇంట్లోనే ఉన్న సూసీ భర్త మాథ్యూ ఆమె దగ్గరకు పరుగెత్తి వెళ్లాడు. ఆమె కాలి మీద నుంచి చీమ కిందకు వెళ్లడం గమనించాడు. చీమ కుట్టిందిలే ఏమవుతుంది అనుకున్నారు.

శరీరం మొత్తం వాపు

శరీరం మొత్తం వాపు

చీమ కుట్టిన కొద్దిసేపట్లోనే సూసీ శరీరం మొత్తం వాపు వచ్చింది. సూసీకి ఊపిరి తీసుకోవడం కూడా ఇబ్బందిగా మారింది. వెంటనే ప్రథమ చికిత్స చేశాడు. అయినా ఫలితం లేకపోయింది.

విపరీతమైన అలర్జీ

విపరీతమైన అలర్జీ

సూసీ విపరీతమైన నొప్పితో అల్లాడిపోతుంటే వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాడు మాథ్యూ. చీమ కుట్టిన భాగం అంతా వాపురావడంతో పాటు విపరీతమైన అలర్జీ రావడంతో సూపీ చాలా ఇబ్బంది పడింది.

మృతి చెందింది

మృతి చెందింది

డాక్లర్లు ఆమెకు ఐసీయూలో చికిత్స అందించారు. చాలా రకాలుగా ప్రయత్నించారు. అయితే ఫలితం లేకపోయింది. ఆమె మృతి చెందింది.

శరీరం వాచిపోపోయింది

శరీరం వాచిపోపోయింది

చీమకొట్టినా కొద్ది నిమిషాల్లోనే సూసీ జెఫ్పీ శరీరం వాచిపోపోయింది. ఆమెను ఆసుప్రతిలో చేర్చేసరికే బీపీ బాగా తగ్గిపోయింది. ఆమె రక్తపోటు బాగా పడిపోయింది. అలాగే నాడీ చాలా తక్కువగా కొట్టుకుంటుందట.

కొన్ని రకాల చీమలు కుడితే

కొన్ని రకాల చీమలు కుడితే

సూసీని ప్రాణాంతకమైన చీమ కుట్టడం వల్లే ఆమె చనిపోయిందని డాక్టర్లు నిర్దారించారు. సౌదీలో కొన్ని రకాల చీమలు కుడితే విషం శరీరంలోకి చేరిపోతుందని వైద్యులు చెప్పారు.

విషం చేరడంతో

విషం చేరడంతో

ఇదే తరహాలోనే జెస్సీని కుట్టిన చీమ నుంచి ఆమె శరీరంలోకి విషం చేరిందని.. ఈ కారణంతోనే ఆమె మరణించిందని వైద్యులు చెప్పారు. చీమే కదా అని లైట్ తీసుకోకండి. కొన్ని రకాల చీమల్లో విషం ఉంటుంది.

బొలీవియాలోని క‌ర‌నావి మునిసిపాలిటీలో

బొలీవియాలోని క‌ర‌నావి మునిసిపాలిటీలో

ఇక గతంలో చీమల ద్వారా ఒక మహిళను కూడా చంపారు. బొలీవియాలోని క‌ర‌నావి మునిసిపాలిటీలో జరిగిన ఈ సంఘటన అప్పట్లో వైరల్ గా మారింది. అక్కడ నివ‌సించే ఓ కుటుంబానికి చెందిన కారు దొంగతనానికి గురైంది.

విషపు చీమలు కొరడంతో

విషపు చీమలు కొరడంతో

ఆ దొంగతనం చేసింది స‌మీపంలో ఉండే యువ‌కుడేనని అనుమానించిన కొంద‌రు అత‌డిని చెట్టుకు క‌ట్టేశారు. అడ్డుకున్న అత‌డి సోద‌రి, త‌ల్లి కూడా చెట్టెకు క‌ట్టేశారు. వారిపైకి విష‌పు చీమ‌ల‌ను వ‌దిలి చిత్ర‌హింస‌లకు గురి చేశారు. విషపు చీమలు కొరడంతో అందులో ఒక మహిళ చనిపోయింది. మిగతావారిని పోలీసులు రక్షించారు.

English summary

indian woman dies in saudi arabia after fatal ant bite

indian woman dies in saudi arabia after fatal ant bite
Story first published: Thursday, April 5, 2018, 17:45 [IST]