For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పరాయి స్త్రీలతో సెక్స్ చేసే ప్రతి మగాడు సునితి సాల్మన్ గురించి తెలుసుకోవాల్సిందే

విచ్చలవిడిగా సెక్స్ లో పాల్గొనే జనాలు మనదేశంలో చాలా మంది ఉండేవారు. అలా సెక్స్ చేస్తే వచ్చే పరిణామాల గురించి ఎవ్వరికీ అంతగా తెలియవు. ఏ అమ్మాయి ఒప్పుకుంటే ఆ అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నాం అనుకున్నారు.

|

సునితి సాల్మన్ నిజంగా ఒక శక్తి. ఎందుకంటే ఆమె చేసిన సేవ అలాంటింది. అంతకు ముందు విచ్చలవిడిగా సెక్స్ లో పాల్గొనే జనాలు మనదేశంలో చాలా మంది ఉండేవారు. అలా సెక్స్ చేస్తే వచ్చే పరిణామాల గురించి ఎవ్వరికీ అంతగా తెలియవు. ఏముంది ఏ అమ్మాయి ఒప్పుకుంటే ఆ అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నాం అనుకున్నారు చాలా మంది.

ఎక్కువ మందితో సెక్స్ చేయడం అదృష్టం

ఎక్కువ మందితో సెక్స్ చేయడం అదృష్టం

ఎక్కువ మందితో సెక్స్ చేయడాన్ని అదృష్టంగా భావించేవారు చాలామంది మగవారు. కానీ అలా ఇష్టానుసారంగా, విచ్చలివిడిగా శృంగారం చేస్తే వచ్చే రోగం గురించి మనదేశంలో అప్పటి వరకు ఎవరికీ తెలియదు. చాలామంది అలా విచ్చలవిడి సెక్స్ వల్ల చనిపోయిన వారు కూడా ఉన్నారు. కానీ దానికి కారణం ఏమిటో కూడా తెలియదు.

విచ్చలవిడిగా సెక్స్ లో పాల్గొనే వారంతా

విచ్చలవిడిగా సెక్స్ లో పాల్గొనే వారంతా

అత్యంత భయంకరమైన వ్యాధిగా భావించే హెచ్ఐవీ ఎయిడ్స్ అప్పుడు భారత్ లోకి ప్రవేశించింది. ఆ తొలి రోజుల్లో విచ్చలవిడిగా సెక్స్ లో పాల్గొనే వారంతా పిట్టల్లా రాలిపోయారు. కానీ ఎవరికీ అర్థం కాలేదు. తమకు సోకింది ఎయిడ్స్ అని, అది ప్రాణాంతకమైనదని, తమ ద్వారా ఇతరులకూ సోకే అవకాశం ఉందనే విషయం ఎవరికీ తెలియదు.

ఆదుకునేందుకు వచ్చారు సునితి సాల్మన్

ఆదుకునేందుకు వచ్చారు సునితి సాల్మన్

సరిగ్గా అదే సమయంలో మన దేశంలో అక్రమ సంబంధాలు పెట్టుకుని వ్యాధులకు గురవుతున్న వారిని ఆదుకునేందుకు వచ్చారు సునితి సాల్మన్. ఎయిడ్స్ వ్యాధిని కనుగొనడానికి ఆమె పోరాటం చేశారు.

తొలిసారిగా ఎయిడ్స్ ను గుర్తించారు

తొలిసారిగా ఎయిడ్స్ ను గుర్తించారు

మనదేశంలో తొలిసారిగా ఎయిడ్స్ ను గుర్తించడంతో పాటు దాని నిర్మూలకు విశేష కృషి చేశారు డాక్టర్ సునితి. 1980లలో వైజీఆర్ కేర్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా హెచ్ఐవీ వ్యాప్తిపై ప్రజలకు అవగాహన కల్పించారు.

మైక్రోబయాలజీ ప్రొఫెసర్

మైక్రోబయాలజీ ప్రొఫెసర్

రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేవారు. తమిళనాడు వ్యాప్తంగా అనేక సేవా కేంద్రాలు స్థాపించిన ఆమె మద్రాస్ యూనివర్సిటీలో మైక్రోబయాలజీ ప్రొఫెసర్ గానూ సేవలందించారు.

హెచ్ఐవీ, ఎయిడ్స్

హెచ్ఐవీ, ఎయిడ్స్

1940 కంటే ముందే కొన్ని జంతువుల్లో హెచ్ఐవీ ఉందని కనిపెట్టారు. 1980 తర్వాత గానీ అది మనుషులకు కూడా వస్తుందనే విషయం తెలియ లేదు. 1980 తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు హెచ్ఐవీ, ఎయిడ్స్ పై అప్రమత్తత ప్రకటించాయి.

డాక్టర్ సునితి సాల్మన్ అధ్యయనం చేశారు

డాక్టర్ సునితి సాల్మన్ అధ్యయనం చేశారు

ప్రపంచంలోని అగ్రరాజ్యాల్లో హెచ్ఐవీ, ఎయిడ్స్ కు సంబంధించిన అనేక విషయాలపై ఆర్టికల్స్ ప్రచురితమయ్యాయి. వాటన్నింటిని డాక్టర్ సునితి సాల్మన్ చదివారు. మనదేశంల కూడా ఎయిడ్స్ బాధితులు చాలా మందే ఉంటారని ఆమె గ్రహించారు.

స్వచ్ఛందంగా ప్రయోగాలు

స్వచ్ఛందంగా ప్రయోగాలు

ఎయిడ్స్ మన దేశంలో వ్యాపించిన సమయంలో మొదట ప్రభుత్వం కూడా పెద్దగా పట్టించుకోలేదు. అయితే ప్రభుత్వ సాయం ఆశించకుండా స్వచ్ఛందంగా ప్రయోగాలకు సిద్ధమయ్యారు సునితి సాల్మన్.

సెక్స్ వర్కర్లపై టెస్ట్

సెక్స్ వర్కర్లపై టెస్ట్

చెన్నైలోని ఓ రెడ్ లైట్ ఏరియాలో సెక్స్ వర్కర్లుగా పనిచేసి అనారోగ్యం పాలై మైలాపూర్ లోని స్టేట్ హోంలో చికిత్స పొందుతున్న మహిళల రక్తాన్ని సేకరించింది. హెచ్ఐవీ టెస్టులు నిర్వహించారు సునితి సాల్మన్. అయితే అందులో కొందరికి ఎయిడ్స్ ఉన్నట్లు తేలింది.

సెక్స్ వర్కర్లకు హెచ్ఐవీ

సెక్స్ వర్కర్లకు హెచ్ఐవీ

తర్వాత ఆమె బ్లడ్ శాంపిల్స్ ను వేలూరు లోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీకి పంపారు. అప్పట్లో ఎలిసా టెస్టులు అక్కడ మాత్రమే అదుబాటులో ఉండేవి అక్కడ కూడా సెక్స్ వర్కర్లకు హెచ్ఐవీ ఉందని తేలింది.

ఇండియాలో కూడా ఎయిడ్స్

ఇండియాలో కూడా ఎయిడ్స్

ఇక తుది నిర్ధారణ కోసం అవే శాంపిళ్లను అమెరికాలోని జాన్ హోప్కిన్స్ యూనివర్సిటీ ల్యాబ్ కు సునితి సాల్మన్‌ పంపారు. వారు కూడా నిర్దారించారు. అలా ఇండియా కూడా ఎయిడ్స్ బాధిత దేశమేనని వెలుగులోకి తెచ్చారు సుమితి. హెచ్‌ఐవీని గుర్తించిన తొలి వైద్యురాలు ఈమె.

ఆరుగురికి ఎయిడ్స్

ఆరుగురికి ఎయిడ్స్

ఈమె పరిశోధనా ప్రాజెక్ట్‌లో భాగంగా 1986 జూన్‌లో మద్రాస్ మెడికల్ కాలేజీ (ఎంఎంసీ)లో ఓ వంద మంది సెక్స్ వర్కర్లకు పరీక్షలు నిర్వహించారు. ఆరుగురికి ఎయిడ్స్ వైరస్ ఉన్నట్టు తల్లి గుర్తించింది.

ప్రభుత్వం నమ్మలేదు

ప్రభుత్వం నమ్మలేదు

అయితే పశ్చిమ దేశాలతో పోల్చుకొంటే సంప్రదాయాల విషయంలో మెరుగైన భారత్‌లో ఎయిడ్స్ వైరస్ వ్యాపించిందనే విషయాన్ని తొలుత ప్రభుత్వం నమ్మలేదు. నమూనాలను వాషింగ్టన్‌కు పంపించి పరీక్షలు నిర్వహించారు. వారు వెల్లడించిన ఫలితాలను అప్పుడు ప్రభుత్వం నమ్మింది.

గాయ్‌టొండె కేర్ ఫౌండేషన్‌

గాయ్‌టొండె కేర్ ఫౌండేషన్‌

ఆ సమయంలో ఈ ప్రాణాంతక వ్యాధి గురించి అవగాహన కల్పించడానికి, సరైన చికిత్స అందించడానికి వైర్ గాయ్‌టొండె కేర్ ఫౌండేషన్‌ను ఆరంభించడానికి అనేక ప్రతికూల పరిస్థితులను ఆమె ఎదుర్కోవాల్సి వచ్చింది.

జైల్లో పెట్టారు

జైల్లో పెట్టారు

ఇక సునితి సాల్మన్ ఎయిడ్స్ వ్యాధి సోకిందని చెప్పిన వారిని అప్పట్లో పోలీసులు జైల్లో పెట్టారు. చితక బాదారు. అంటరాని వారీగా చూశారు. తొలిసారి ఎయిడ్స్ వ్యాధికి చికిత్స కోసం నూరి అనే సెక్స్ వర్కర్ సునితి సాల్మన్ కలిశారు. నూరిని కూడా పోలీసులు చాలా ఇబ్బందులుపెట్టారు. వారిని పోలీసుల బారి నుంచి కాపాడింది సునితి. 1987లో సునీతిని కలిసిన నూరి.. తర్వాత సౌత్ ఇండియన్ పాజిటివ్ నెట్‌వర్క్ అనే స్వచ్ఛంద సంస్థతో బాధితులకు సేవలందించింది.

జీవితాశయంగా పనిచేశారు

జీవితాశయంగా పనిచేశారు

సునితి సాల్మన్ ఆ తరువాతి కాలంలో ఎయిడ్స్ మహమ్మారిని నిర్మూలించడమే జీవితాశయంగా పనిచేశారు.డాక్టర్ సుమితి వెలుగులోకి తెచ్చిన అంశాలను గుర్తిస్తున్నట్లు తమిళనాడు శాసనసభ ఒక తీర్మానం కూడా చేసింది.

ఆ అమ్మాయి చనిపోవడం

ఆ అమ్మాయి చనిపోవడం

1992లో ఓ హెచ్ఐవీ పాజిటివ్ గర్భిణికి చికిత్స చేయడాన్ని డాక్టర్ సునితి తరచూ గుర్తుచేసేవారు. ఆ మహిళకు పుట్టిన ఆడపిల్ల కూడా 17 ఏళ్ల వయసులో చనిపోవడం తనను వేదనకు గురిచేసిందని చెప్పేవారు.

ప‌లు బోర్డుల్లో స‌భ్యురాలిగా

ప‌లు బోర్డుల్లో స‌భ్యురాలిగా

డాక్టర్ సునితి తాను బతికున్నంత కాలం ఎయిడ్స్‌పై విస్తృత ప్రచారం నిర్వ‌హించేందుకు ప్రయత్నించింది. అలాగే అప్ప‌ట్లో కేంద్ర ప్ర‌భుత్వానికి లేఖ‌లు రాసింది. ఈ క్ర‌మంలోనే ఎయిడ్స్‌పై ప్రచారం నిర్వ‌హించే ప‌లు బోర్డుల్లో ఆమె స‌భ్యురాలిగా చేరింది.

కొన్ని వేల మందికి సేవలు

కొన్ని వేల మందికి సేవలు

డాక్టర్ సునితి నెలకొల్పిన వైఆర్ గైటొండె సెంట‌ర్ ద్వారా కొన్ని వేల మంది ఎయిడ్స్ రోగుల‌కు సేవ‌లందించింది. సునితి సాల్మన్‌ పలు అవార్డులు, రివార్డులు కూడా ల‌భించాయి. 2012లో ఆమెకు త‌మిళ‌నాడు రాష్ట్ర ప్ర‌భుత్వం లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డును ప్ర‌క‌టించింది.

ఇప్పటికీ ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి

ఇప్పటికీ ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి

2015, జూలై 28న సునితి సాల్మన్‌ మృతి చెందారు. అయినా... ఎయిడ్స్‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించడంలో ఆమె రూపొందించిన గైడ్‌లైన్స్‌ను ఇప్ప‌టికీ ప్ర‌భుత్వాలు పాటిస్తున్నాయంటే ఆమె ప్ర‌తిభ ఎలాంటిదో అర్థం చేసుకోవ‌చ్చు. ఎంతో మంది ప్ర‌జ‌ల‌కు నిస్వార్థంగా సేవ చేసిన సునితి సాల్మన్‌ కు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మ‌నం హ్యాట్సాఫ్ చెప్పాలి. ఆమెను ప్రతి ఒక్కరూ జీవితాంతం గుర్తించుకోవాలి.

English summary

international womens day journey of dr suniti solomon

international womens day journey of dr suniti solomon..In 1986, Dr Suniti Solomon detected the first cases of AIDS in India. A visionary in the field of microbiology, a teacher and an activist, she has been posthumously awarded the Padma Shri by the government of India for her contribution to the field.
Desktop Bottom Promotion