For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తమ జీవితలో ఎక్కువ భాగం గంభీరంగా ఉండే రాశిచక్రాలు ఇవే

|

జ్యోతిష శాస్త్రం ప్రకారం, కొన్ని రాశిచక్ర సంకేతాలు మిగిలిన ఇతర రాశిచక్రాల కన్నా అత్యంత గంభీరమైనవిగా ఉన్నాయి.

వారు జీవితంలో గంభీరంగా ఉన్నంతమాత్రాన, వారి జీవితంలో హాస్యచతురత, సంతోషం లేవని కాదు అర్థం. వారు జీవితంలో ప్రతి అంశం మీదా తీవ్రంగా దృష్టి సారిస్తుంటారని అర్ధం.

ఇక్కడ, ఈ వ్యాసంలో, తమ జీవితానికి కొంచం అదనంగా నవ్వును జోడించాల్సిన రాశి చక్రాల గురించిన వివరాలను పంచుకోబోతున్నాము.

ఈ రాశిచక్ర సంకేతాలు ప్రతి అంశంలోనూ తీవ్రమైన ఆలోచనలు చేస్తూ ఫలితాలను రాబట్టే క్రమంలో జీవితానికి గంభీరతను జోడిస్తూ అనేక ప్రతికూలతలను కూడా ఎదుర్కొంటుoటాయి. ఈ రాశి చక్రాలకు చెందిన వారు ప్రతి విషయంలోనూ అటువంటి తీవ్రమైన ఆలోచనలు చేయకూడదని, గంభీరత అన్ని వేళలా పనికి రాదనీ మరియు జీవితాన్ని ఆనందమయం చేసుకునే క్రమంలో కాస్త హాస్యాన్ని కూడా జోడించవలసి ఉంటుందని తెలుసుకోవలసిన అవసరం ఉంటుంది.

ఆ రాశి చక్రాలేమిటో చూడండి

వృశ్చిక రాశి: అక్టోబర్ 24-నవంబరు 22

వృశ్చిక రాశి: అక్టోబర్ 24-నవంబరు 22

ఈ రాశి చక్రానికి చెందిన వ్యక్తి మిగిలిన అన్ని రాశుల వారితో పోల్చినప్పుడు జీవితంలో అత్యంత గంభీరంగా ఉంటారు. ఒక్కోసారి తమ జీవితంలో నవ్వు అనే భాగం ఉందన్న విషయం కూడా మర్చిపోతుంటారు. ఒత్తిడి, ఆందోళన, ఉద్రేకాలకు హాస్యం, నవ్వు, వంటి అనేక ఇతర అంశాలు ఔషధాలుగా పని చేస్తాయని తెలుసుకోవలసిన అవసరం ఉంది. మానసికంగా విశ్రాంతి కోరుకుంటున్నా కూడా ప్రతి అంశాన్ని తీవ్రంగా పరిగణించడం మూలంగా ఫలితాల సాధనలో, విశ్రాంతికి దూరమవుతూ ఉంటారు. క్రమంగా గాంభీర్యం వీరి ఆభరణంగా ఉంటుంది.

మకర రాశి : డిసెంబర్ 23-జనవరి 20

మకర రాశి : డిసెంబర్ 23-జనవరి 20

ఈ వ్యక్తులు లక్ష్య సాధనలో సరైన ఫలితాలు రాకపోయినా, అనేక ప్రతికూలతలు ఎదురవుతూ ఉన్నా, జీవితంలో ఏదో కోల్పోయామన్న భావనని పొందుతూ ఉంటారు.వీరి ఆలోచనా ధోరణి ప్రశంసనీయమైనదే, కానీ ఈ ఆలోచనలే వారి అధిక ఒత్తిళ్లకు కారణమవుతున్నాయని గ్రహించలేని స్థితిలో ఉంటారు. భవిష్యత్ ప్రణాళికలు అద్భుతంగా మలచగల వీరు, విశ్రాంతి మరియు కొన్ని చిన్న చిన్న సంతోషాలకు కూడా ప్రాధాన్యతనివ్వాలి. ప్రియమైన వారితో కాలం గడపడం, ఇష్టమైన అభిరుచుల పట్ల దృష్టి సారించడం, మనసుకు నచ్చే సంగీతాన్ని ఆస్వాదించడం, అప్పుడప్పుడు కుటుంబ సభ్యులతో విహార యాత్రలకు వెళ్ళడం వంటి వాటి మీద కూడా దృష్టి సారించగలగాలి. లేకుంటే, గంభీర్యానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారే అవకాశాలు ఉంటాయి.

 కర్కాటక రాశి : జూన్ 21- జూలై 22

కర్కాటక రాశి : జూన్ 21- జూలై 22

కర్కాటక రాశి వారి దృష్టిలో తాము నివసించే గృహం అంత సురక్షితమైన ప్రదేశం, ఈ ప్రపంచంలో మరెక్కడా లేదని అభిప్రాయం. స్వేచ్చా వాయువులకు తమ నివాసమే కేంద్రబిందువు అని భావించే అల్పసంతోషులుగా ఉంటారు. ప్రతి ఒక్కరి ప్రేమ తమపై ఉండాలన్న ఆలోచనలో ఉంటారు. మరోపక్క తమ జీవితాలలో తాము విశ్వసించిన వ్యక్తులకు తప్ప మరెవరికీ స్థానం లేదని భావిస్తుంటారు , క్రమంగా ఇతరుల పట్ల గంభీర్యతను ప్రదర్శిస్తుంటారు. మరియు వెన్నుపోటు ధోరణులను ఎన్నటికీ సహించలేరు. క్రమంగా, తమను మోసగించిన వారి పట్ల హేయభావాన్ని ప్రదర్శిస్తుంటారు.

మీన రాశి : ఫిబ్రవరి 19-మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19-మార్చి 20

మీన రాశికి చెందిన వ్యక్తులు గాంభీర్యాన్ని కలిగి ఉన్నా, ఇతరులు ప్రతికూల ఆలోచనలు చేయకుండా జాగ్రత్తను కలిగి ఉంటారు. జీవితంలో ఎదురయ్యే ప్రతి అంశమూ ఒక పరీక్షే అన్న భావన వీరిది. మరియు అత్యంత శ్రద్ధ కలిగిన వ్యక్తులుగా ఉంటారు. ఫలితాలను రాబట్టే క్రమంలో మెదడుకు తీవ్రమైన ఒత్తిడి కలుగజేస్తుంటారు. తమ అపజయాల పట్ల ఇతరుల విమర్శలను ఖాతరు చేయకుండా, లోపాల గురించిన పాఠాలు తీసుకుని మరోసారి అటువంటి సమస్యలు పునరావృతం కాకుండా ప్రణాళికలు చేస్తారు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారన్న నిరాశావాదానికి వీరు పూర్తి వ్యతిరేకులుగా ఉంటారు.

నిద్రలో కూడా భవిష్యత్ ప్రణాళికల గురించిన ఆలోచనలే ఉంటాయి. తమకు అనుగుణంగా పరిసరాలు లేని ఎడల, కాస్త అసౌకర్యానికి గురవుతుంటారు, క్రమంగా వీరిలో అసహనం పెరుగుతుంటుంది. మరియు పరిసరాలను తమకు అనుగుణంగా మార్చుకునేలా కుటుంబ సభ్యులకు సూచనలు ఇస్తుంటారు. వీరి మాటలలో ఉండే నిజాయితీ, నిబద్దత ఇతరులను ఆకర్షించేలా ఉంటుంది.

ఈవ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర అంశాలు, జీవనశైలి, ఆరోగ్య, ఆహార, ఆధ్యాత్మిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

List Of Superserious Zodiac Signs Who Need To Lighten Up

In astrology, there are a few zodiac signs which are known to be more serious than others. Though they are serious in life, it doesn't mean that they don't have a sense of humour or that they are unhappy in life. It is just that they seem to be intensely focused in life. These signs are Scorpio, Capricorn, Cancer and Pisces.
Story first published: Thursday, July 19, 2018, 15:30 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more