For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జూలై 27న చంద్ర గ్రహణం – పెళ్లికానివారు గ్రహణం చూడొచ్చా! జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది?

|

జనవరి 31, 2018 తరువాత వస్తున్న రెండవ చంద్రగ్రహణం జూలై 27, 2018న వస్తున్నది. ఈ సంవత్సరంలో ఒక గంటా 43 నిమిషాల పాటు కొనసాగే అతిపెద్ద చంద్రగ్రహణముగా ఉండనుంది. మరియు ఎరుపు రంగులో కాని ముదురు గోధుమ రంగులో కాని కనిపించనుందని ఖగోళ శాస్త్రజ్ఞుల సమాచారం. క్రమంగా దీనిని బ్లడ్ మూన్ అని కూడా వ్యవహరిస్తున్నారు.

చంద్ర గ్రహణ ప్రభావాలు:

చంద్ర గ్రహణ ప్రభావాలు:

ఇప్పుడు వస్తున్న ఈ చంద్ర గ్రహణం కారణంగా అనేక ప్రతికూల ప్రభావాలు కలిగే అవకాశాలు ఉన్నట్లుగా జ్యోతిష్య శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా భూకంపం, సునామీ, అగ్ని పర్వతాలు బద్దలవడం, సైక్లోన్‌ లేదా తుఫాను వంటి ప్రకృతి సంబంధ ప్రకోపాలకు కారణమయ్యే అవకాశాలున్నాయి.

 చంద్ర గ్రహణం :

చంద్ర గ్రహణం :

జ్యోతిష్యశాస్త్రజ్ఞుల ప్రకారం, ఈ చంద్ర గ్రహణ ప్రభావం కొన్ని రాశి చక్రాల మీద అధికంగా ఉండనుందని తెలుస్తోంది. ముఖ్యంగా మేష రాశి, సింహ రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వారు సానుకూల ఫలితాలను పొందుతుండగా మకర రాశి, మిధున రాశి, కన్యా రాశి, ధనుస్సు రాశుల వారు ప్రతికూల ప్రభావాలను పొందే అవకాశాలున్నాయి. మరియు కుంభ రాశి, తులా రాశి, కర్కాటక రాశి, వృషభ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.

ప్రతికూల ప్రభావాలను పొందుతున్న రాశి చక్రాల వారు శివుని పూజించవలసినదిగా సూచించడమైనది. మరియు చంద్ర గ్రహణం రోజున చేసే దాన ధర్మాలు అత్యంత ఫలప్రదంగా ఉండనుందని తెలుస్తోంది. ఇక దాన ధర్మాల విషయానికి వస్తే బంగారము, వెండి, రాగి సంబంధిత వస్తువులను రాగి పాత్రలో ఉంచి నల్ల నువ్వులతో కలిపి దానం చేయడం ద్వారా ప్రతికూల ప్రభావాలు తొలగిపోయి సానుకూల ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

ఈ అరుదైన చంద్రగ్రహణం రోజున పెళ్లికానివారు గ్రహణం చూడొచ్చా! జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది?

పెళ్లి కాని వారు గ్రహణాన్ని చూడవచ్చా?

పెళ్లి కాని వారు గ్రహణాన్ని చూడవచ్చా?

ముఖ్యంగా శతాబ్దంలోని అత్యంత పొడవైన చంద్ర గ్రహణం రోజున, పెళ్లి కాని వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఆరోజున అందంగా కనిపించే చంద్రుడు పెళ్లి కాని వారికి ప్రతికూల ప్రభావాలను కలుగచేస్తాడని, క్రమంగా మానసిక సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని, ముఖ్యoగా వారి వారి సంబంధాల మీద మరియు పెళ్లి జరిగే అంశాల మీద ఉండనుందని హెచ్చరిస్తున్నారు.

నిజానికి చంద్రుడు రాశి చక్రాలకు సంబంధించినంత వరకు

నిజానికి చంద్రుడు రాశి చక్రాలకు సంబంధించినంత వరకు

నిజానికి చంద్రుడు రాశి చక్రాలకు సంబంధించినంత వరకు భావోద్వేగాలను మరియు ప్రేమ వంటి అంశాల మీద సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంటాడు. కానీ గ్రహణం సమయంలో కొన్ని ప్రతికూల ప్రభావాలకు భావోద్వేగాలు గురికావడం జరుగుతుంది.

రాహువు చంద్రుని మింగడాన్ని చంద్రగ్రహణంగా

రాహువు చంద్రుని మింగడాన్ని చంద్రగ్రహణంగా

రాహువు చంద్రుని మింగడాన్ని చంద్రగ్రహణంగా మాత్రమే కాకుండా చంద్రదోషంగా‌ కూడా పరిగణిస్తుంటారు. రాశి చక్రాలకు సంబంధించిన జన్మకుండలిలో నీచ స్థానంలో చంద్రుడు ఉన్న‌ ఎడల ఈ ప్రభావాలు అధికంగా ఉండే సూచనలు ఉన్నాయి. భావోద్వేగాలకు ఉద్రేకాలకు వ్యక్తులు లోనయ్యే పరిస్థితులు దాపురిస్తాయని హెచ్చరించడమైనది.

 వీలైనంత మేర పెళ్లి కాని వారు చంద్ర గ్రహణాన్ని చూడకుండా

వీలైనంత మేర పెళ్లి కాని వారు చంద్ర గ్రహణాన్ని చూడకుండా

కావున వీలైనంత మేర పెళ్లి కాని వారు చంద్ర గ్రహణాన్ని చూడకుండా ఉండడమే మేలని సూచించడమైనది. మరియు పెళ్లి కాని వారు మాత్రమే కాకుండా గర్భవతులకు, మరియు జన్మ కుండలిలో నీచ స్థానంలో చంద్రుడు ఉన్న పెళ్లయిన వారికి కూడా ప్రతికూల సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని తెలియజేయడమైనది.

ఖగోళ శాస్త్రం ప్రకారం,

ఖగోళ శాస్త్రం ప్రకారం,

ఖగోళ శాస్త్రం ప్రకారం, భూమి, చంద్రునికి మరియు సూర్యునికి మద్య వచ్చు కారణముగా, సూర్యుని యొక్క ప్రతిబింబం చంద్రుని మీద పడని కారణంగా చంద్ర గ్రహణం సంభవిస్తుంది. కానీ ఈ సందర్భములో చంద్రుడు ఎరుపు రంగులో లేదా ముదురు గోధుమ రంగులో ఉన్న కారణాన బ్లడ్ మూన్ అని వ్యవహరించడమైనది.

ఇటువంటి చంద్ర గ్రహణం 104 సంవత్సరాల తరువాత మొదటిసారిగా వస్తున్నట్లు, మరియు ఇది భారతదేశమంతా కనిపించనుందని ఖగోళ శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. వీరు ప్రతి ఒక్కరూ చంద్ర గ్రహణం స్వేచ్చగా పరికరాల సహాయంతో వీక్షించమని సెలవిస్తున్నా, ఆసమయంలో వీటి కిరణాల ప్రభావం అధికంగా ఉంటుందని, కావున దూరంగా ఉండడమే మేలని పండితులు చెప్తున్నారు.

ఇక జ్యోతిష్యశాస్త్రజ్ఞుల ప్రకారం దేశమంతా కనిపించనున్న చంద్రగ్రహణం కారణంగా భారతీయులు అందరూ చంద్ర గ్రహణ సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలకు లోనవుతారని తెలియజేస్తున్నారు.

ఇదే రోజున గురుపూర్ణిమ కూడా వచ్చుచున్నది.

ఇదే రోజున గురుపూర్ణిమ కూడా వచ్చుచున్నది.

ఇదే రోజున గురుపూర్ణిమ కూడా వచ్చుచున్నది. కానీ సూతక కాలం కారణముగా ఎటువంటి పూజలు కూడా జరపరాదని ఒకవేళ పూజలు జరపాల్సిన అవసరం ఉంటే గ్రహణానికి ముందుగానే పూర్తి చేయవలసినదిగా సూచించడమైనది. అంతే కాకుండా దాన ధర్మాలు లేదా ఇతరత్రా దైవ సంబంధిత కార్యాలకు కూడా గ్రహణం ముందు సమయమే అనుకూలంగా ఉండనుంది. ఒకవేళ గ్రహణం సంబంధించిన అనుమాన నివృత్తికై పూజావిధానాల కోసం ఆలయ పూజారిని కానీ, జ్యోతిష్య శాస్త్ర నిపుణులను కాని సంప్రదించవలసినదిగా సూచించడమైనది.

జన్మ కుండలి నందు చంద్రుని నీచ స్థానం

జన్మ కుండలి నందు చంద్రుని నీచ స్థానం

గ్రహ దోషాలు, లేదా జన్మ కుండలి నందు చంద్రుని నీచ స్థానం కలిగిన వారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులను సందర్శించి, వారి వారి సూచనలను పాటించవలసినదిగా సూచించడమైనది.

ఈవ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆద్యాత్మిక, జ్యోతిష్య శాస్త్ర, హస్త సాముద్రిక, ఆరోగ్య, జీవన శైలి తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Lunar Eclipse July 27th - Singles Should Avoid Watching It!

This is the biggest Lunar eclipse of the year, whose effects will remain for four hours. Occurring after a period of 104 years, it is being said to be very inauspicious, and has been named as Blood Moon. All, especially the unmarried people, should avoid watching it. Astrologically speaking, the Moon is said to be affected negatively
Story first published: Thursday, July 26, 2018, 7:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more