For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మహిళల కోసం ప్రత్యేకంగా థాయ్- స్పా: హాండ్సమ్ మోడళ్ళతో సర్వీస్.

  |

  మహిళల కోసం ప్రత్యేకంగా థాయ్- స్పా: హాండ్సమ్ మోడళ్ళతో సర్వీస్.

  మనుషులలో సృజనాత్మకత స్థాయిని తెలియజేసే అత్యంత అద్భుతమైన మరియు తెలివైన ఆలోచనలని వ్యాపారానికి పెట్టుబడిగా పెడుతున్న కాలమిది. మరియు ప్రజలు కూడా ఇలాంటి వినూత్న ప్రయోగాలకు ఎల్లప్పుడూ జేజేలు పలుకుతుoటారని మనకు తెలియనిది కాదు. ఒక్కోసారి కొన్ని ఆలోచనలు శిఖరాన్ని ఎక్కిస్తే, కొన్ని మాత్రం అదః పాతాళానికి తోక్కేస్తుంటాయి. సృజనాత్మకత మితిమీరకుండా చూసుకోవాలి మరి.

  ఇక్కడ కొందరైతే తమ బిజినెస్ ముందుకు నడవడంకోసం కొన్ని వింత పోకడలకు కూడా సిద్దమవుతూ ఉంటారు. కాస్త ఆశ్చర్యం కలిగించినా, వాటి విజయం చూశాక కాస్త కంఫ్యూషన్ గురవడం పరిపాటి అవుతుంది.

  Models Who Offer Services At This Thai Spa

  ఇప్పుడు చెప్తున్న వ్యాసంలో, థాయిలాండ్ లో ఉన్న ఒక సెలూన్ వినియోగదారులను ఆకట్టుకోడానికి అవలంబించిన వినూత్న ప్రయోగం, అనతి కాలంలోనే వీరి రెండవ దుకాణానికి కస్టమర్ల సంఖ్యను విపరీతంగా పెంచింది. ఆ ప్రయోగం మరేమిటో కాదు , దేహదారుడ్యం కలిగిన, ఆకర్షణీయమైన పురుషులను మహిళా సెలూన్లలో సేవలకు వినియోగించడమే.

  ఇక్కడ ఆసక్తికర అంశం ఏమిటంటే ఈ థాయ్ - స్పా లో చొక్కా ధరించని పురుషులు సేవలoదివ్వడమే. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో ఒక వైరల్. ఒకవేళ మీరు ఆ వీడియోని చూస్తే, మిశ్రమ స్పందనలు కలగడం గారెంటీ.

  ఈ స్పా థాయిలాండ్లో ఉంది :

  ఈ స్పా థాయిలాండ్లో ఉంది :

  థాయిలాండ్ అంటేనే మసాజ్ స్థావరం మన భారతీయులకు. ఏ చిన్న అవకాశo వచ్చినా, వదులుకోకుండా థాయిలాండ్ ప్రయాణమయ్యే వారిని మనం తరచూ చూస్తుంటాము కూడా. అంతలా మసాజ్ సర్వీసులకు థాయిలాండ్ పెట్టింది పేరు. నిజానికి థాయిలాండ్ ఏనుగులకు ప్రసిద్ది కానీ, రాను రాను మసాజులకు ప్రసిద్దిగా మారుతుంది. థాయిలాండ్ లో కేవలం పురుషులకు మాత్రమే స్పా ఉండదు, మహిళలకు కూడా ప్రత్యేకమైన స్పాలు ఉన్నాయి. తద్వారా ఇక్కడ పెరుగుతున్న మార్కెట్ దృష్టిలో ఉంచుకుని వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా అనేకరకాల వింత పోకడలకు నిలయాలుగా మారుతున్నాయి. ఇక్కడ ఉన్న చట్టపరమైన సర్దుబాటు, వీరికి కాస్త కలిసివచ్చిందనే చెప్పాలి. ఒక్కొక్క వ్యాపారస్తుడు ఒక్కో ఆఫర్ ను ప్రకటిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. ఆ క్రమoలో భాగంగానే, ఒక థాయ్- స్పా., మహిళల కోసం ప్రత్యేకంగా ఈ సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. చొక్కా తొడగని హాండ్సమ్ అబ్బాయిలు, మహిళలకు సర్వీసులను అందించేలా. సహజంగా మహిళల చేత స్పా సెంటర్లు నడుపబడే ఈ ప్రదేశంలో వినూత్నంగా పురుషులకు ఈ అవకాశo ఇవ్వడం ఒక ప్రయోగమనే చెప్పాలి.

  సెలూన్ గురించి :

  సెలూన్ గురించి :

  ఈ సెలూన్ రెండవ శాఖను తెరచిన క్రమంలో భాగంగా, ప్రమోషన్ పథకంలో “వన్స్ ఇన్ లైఫ్ టైం ఆఫర్” కింద మహిళలకు ఈ హాండ్సమ్ పురుషులచే హెయిర్ మేకప్, స్పా సర్వీసులను అందించారు.

  ఏమిటీ “వన్స్ ఇన్ లైఫ్ టైం ఆఫర్” :

  ఏమిటీ “వన్స్ ఇన్ లైఫ్ టైం ఆఫర్” :

  హెయిర్ మేకప్, మరియు స్పా సర్వీసులను హాండ్సమ్ పురుషులచే చేయించడం అక్కడికి విచ్చేస్తున్న విదేశీ మహిళలకు ఆసక్తి కలిగించే అంశమే. కానీ, అసలు నిజమేమిటంటే, ఇది జీవితంలో ఒక్కసారి మాత్రమే.

  ఆ పురుషులను కేవలం ఒక్కరోజుకే నియమించారు :

  ఆ పురుషులను కేవలం ఒక్కరోజుకే నియమించారు :

  మామూలుగా అక్కడి స్టాఫ్ స్థానిక థాయ్ వాసులే, కానీ కండలు తిరిగిన, దేహధారుడ్యం కలిగిన ఆకర్షణీయమైన పురుషులను, కొత్త బ్రాంచ్ తెరవడంలో భాగంగా కేవలం ఒక్కరోజుకు మాత్రమే నియమించబడ్డారు.

  మీరేమనుకుంటున్నారు?

  మీరేమనుకుంటున్నారు?

  ఈ వింత ఆఫర్ గురించి మీరేం అనుకుంటున్నారు? ఎప్పుడైనా ఇలాంటి ఆఫర్ ప్రకటించడం చూశారా? మీకిలాంటి వింత విషయాల గురించి తెలిస్తే, క్రింది వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి.

  ఇటువంటి అనేక ఆసక్తికర అంశాలకై, ఈ పేజీని తరచూ సందర్శిస్తూ ఉండండి.

  English summary

  Models Who Offer Services At This Thai Spa

  A hair salon in Thailand just opened its second branch, and as a part of its promotion, the spa offers customers a once-in-a-lifetime chance to get their hair done and be pampered by incredibly hunky, topless male models! The salon is basking its profit with handsome men servicing at their salon.Models Offer Services At This Thai Spa
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more